top of page

Hymavati

life experiences from my heart to yours

Collapsible text is great for longer section titles and descriptions. It gives people access to all the info they need, while keeping your layout clean. Link your text to anything, or set your text box to expand on click. Write your text here...

అన్నపూర్ణ వారి ఆణి ముత్యాలు.

ఈ రోజు యూ ట్యూబ్ లో ఏదో వెతుకుతూ ఉంటే శిరీష కొమ్మరాజు గారు పాడిన వినిపించ ని రాగాలే పాట వచ్చింది. ఆవిడ ఎక్కువ గా పాత పాట లు పాడుతూ వుంటారు . ఆ పాట కూడా చాలా హాయిగా పిల్ల తెమ్మర లాగా సాగుతుంది . ఉదయాన్నే చూడు మదే చెలియా పాట విందామని సెర్చ్ నొక్కగానే పాడుతా తీయగా లో శ్రీకర్ పాడిన ఆ పాట వచ్చింది. ఆ తర్వాత హరిణి అనే అమ్మాయి ఎక్కడమ్మా చంద్రుడు పాట వచ్చింది. వింటుంటే ఎంత ఆనందం కలిగిందో , సావిత్రి గారి అమాయకమైన మొహం కళ్ల ముందు కదిలింది.

శ్రీ రామ నవమి

ఈ రోజు రామ నవమి శుభాకాంక్షలు. రాముల వారి కళ్యాణం పుట్టిన రోజు నాడే జరుగుతుంది.. పూర్వం తాటాకు పందిర్లు వేసి వీధి వీధికి కళ్యాణం చేసే వారు. వారం రోజులు ఉత్సవాలు ఘ నంగా జరిపే వారు.. ఇప్పుడు కూడా అన్నీ కాలనీల్లో అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ల్లో , గుడుల్లో శక్తి మేరకు చేస్తూ వున్నారు. ఆ మధ్య మా ఆబ్బాయి ఇస్కాన్ వాళ్లు యూ ఎస్ ఏ లో ప్రింట్ చేసిన రామాయణం పుస్తకం ఎవరో ఇచ్చారు అని తెచ్చాడు. సా ధ రణం గా ఇస్కాన్ వాళ్ళ పుస్తకాలు క్వాలిటీ బాగుంటాయి.

టెలిఫోన్ నుంచి సెల్ఫోన్ కీ.

పూర్వం రోజుల్లో పుస్తకం హస్త భూషణం అనే వారు. ఎవరైనా ఎక్కువగా పుస్తకాలు చదువుతుంటే వాడు ఒక పుస్తకాల పురుగు అనే వారు. ఇప్పుడు అయితే సెల్ ఫోన్ హస్త భూషణం అనాలి . అందరూ ఆ అర చేతిలో స్వర్గం కి బానిసలు కాబట్టి ప్రత్యేకంగా ఏ పేరు పెట్ట అక్కర్లేదు. చేతిలో ఫోన్ చెవిలో ఏవో పెట్టుకుంటే ఎదుటి వాళ్లు ఏమీ మాట్లాడినా వినిపించదు. మనం మూగ వాళ్ళ లాగా సైగ చేస్తే వాళ్ళ దృష్టి మన మీద పడితే అప్పుడు రియాక్ట్ అవుతారేమో. మా చిన్నప్పుడు ఫోన్, ఫ్రిడ్జ్ అలాంటివి ఉండటం

గుజ్జన గూళ్ళు

అసలు ఈ రోజుల్లో ఈ మాట ఎవరికైనా తెలుసో తెలియదో కానీ మా చిన్న తనం లో మేము గుజ్జన గూళ్ళు అని వంటలు చేస్తూ వుండే వాళ్ళము. అసలు ఆరోజుల్లో మనం ఆడిన ఆటలు ఇప్పుడు పిల్లలు కు అసలు తెలియదు కూడా. మరీ చిన్న పిల్లలు గా వున్నప్పుడు బొమ్మలు పెళ్లిళ్లు చేయటం ఒక ఆటగా ఉండేది. తాటాకు తో కొబ్బరి ఆకులతో బొమ్మలు చేసి వాటికీ చక్కటి లంగాలు అవీ కట్టి బొమ్మల పెళ్లిళ్లు చేయటం భలే సరదాగా ఉండేది.. మా చిన్నతనం లో పిల్లలు కి బట్టలు కుట్టిం చాలంటే ఆ టైలర్ మన వీధి అరుగు మీ

సరాగ మాల

ఈ పేరు తో మేము చదువుకునే రోజుల్లో ఆంధ్ర పత్రిక లో ఒక ఆర్టికల్ వచ్చేది. ఆరోజుల్లో పత్రిక , ప్రభ అమూలగ్రమ్ .చ ది వే దాన్ని . ఆ ఆర్టికల్ వి. ఏ కె రంగా రావు గారు రాసే వారు. అందులో సినిమా పాట ల గురించి ఉండేది. ఈ పాట కు ఏ ట్యూన్ , ఏ రాగం, ఇంగ్లీష్ మ్యూజిక్ కాపీ నా, ఇలా వివరాలు రాసే వారు. పత్రిక అంతా చదవటం తప్పితే ఆ ఆర్టికల్ గురించి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా దృష్టి అంతా సీరియల్స్ మీద , కధలు , మేము కూడా కధలు కాకరకాయ లు రాద్దాం అనే ప్రయత్నం, ఆ

హ్యాపీ హోలీ కబుర్లు

మనకు ఆంధ్ర లో ఈ హోలీ పండగ గురించి తెలియదు. మా వారు హైదరాబాద్ లో చదువుకున్నా అప్పుడు ఇంత హడావుడి ఉండేది కాదేమో. మేము పంజాబ్ వెళ్లిన నాలుగు నెలలకో ఏమో ఈ పండగ వచ్చింది. యూనివర్సిటీ లో వున్న యూపీ వాళ్ళు, పంజాబీ లు ఉదయాన్నే రంగుల తో ఇళ్ల కు వచ్చేసారు. వాళ్లతో అక్కడ వున్న తెలుగు వాళ్ళు కూడా మా వారు చాలా చికాకు పడి నాకేమి పూయద్దు అని గొడవ, వాళ్ళు మాత్రం నయా నయా షాది హోగయా హోలీ ఖేలానా పడేగా అంటూ నా చేత ఆయనకి కాస్త రంగు పూయించి , నన్ను, మా

అత్తా కోడళ్ల సరాగాలు

రోజూ ఉదయాన్నే మా కుక్ రాగానే ఏం చేయమంటారు అని అడుగుతుంది. నేను ఏదో ఆకుకూర పప్పు చెపితే నిన్న ఆకు కూర నే కదా అంటుంది.. నాకు వెంటనే మా అమ్మ, మా పెద్ద వదిన గుర్తు వస్తారు. కూరలకు వెళ్ళినపుడు రెండు మూడు రకాల ఆకు కూరలు ఒకేసారి తెస్తాము కదా , జనరల్ గా పాడు గాకుండా ఫ్రిడ్జ్ వున్నా , ఆకు కూర లు త్వరగా ఖర్చు పెట్టాలని అమ్మ ముందు రోజే తరిగి రెడీ పెట్టేది. వదిన మాత్రం నిన్న ఆకుకూరే కదా , ఈ రోజు టమాటో, లేదా దోస కాయో ఏదో చెప్పేది. మా అమ్మ కు పాపం వదిన తో వాదించే

శివరాత్రి

శివరాత్రి అనగానే ఎన్నో జ్ఞాపకాలు ఆలా తరుముకుంటూ వస్తాయి. అన్నీ పండగ లాగా ఈ పండుగ కీ పిండివంటలు హడావిడి ఉండదు కదా ఉపవాసం ఉండాలి అనే ఉత్సహం చిన్నప్పుడు చాలా ఉండేది. పిల్లలు మీరు ఏమీ ఉంటారులే వద్దు లే అని అమ్మ గారు అంటే మేము మా చిన్న నాయనమ్మ దగ్గర చేరే వాళ్ళము. వున్నంత సేపు ఉంటారులే అని మమ్మల్ని మామ్మ గారు బాగానే సపోర్ట్ చేసే వారు. మామ్మ తో గుడికి వెళ్లడం చాలా సరదాగా గా ఉండేది. ఆ రోజుల్లో మట్టి ప్రమిదలు మడికి పనికి వచ్చేవి కాదు . అందుకని కొబ్బరి చిప

మరపురాని మధుర గీతాలు 2

ఈ రోజు పేస్ బుక్ తెరవగానే బందిని సినిమా లో ఎస్ డి బర్మన్ గారి పాట ఎవరో పోస్ట్ చేసారు. ఒరే మాజీ , మేరె సాజన్ హై ఉస్ పార్ , ఆ క్షణం లో సినిమా చూస్తున్నప్పుడు పాట కన్నా నూతన్ ఏం చేస్తుంది అనే టెన్షన్ వుంటుంది. బర్మన్ గారి మ్యూజిక్ ప్రశాంతంగా ఒక నది లో అలలు మెల్లగా చిరు సవ్వడి చేస్తూ కదిలిపోతునట్లు వుంటుంది.. మన కాలేజీ రోజుల్లో పాటలు వినటమే కానీ చూడటానికి అవకాశం లేదు కదా, ఆ పాట ఈ సినిమా లో, పాడిన వాళ్ళు ఎవరు అనే కానీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి అంత తెలిసేది కాదు

మరపురాని మధుర గీతాలు

కొన్ని పాటలు వింటూ ఉంటే ఒక జలపాతం నుండీ నీరు వేగంగా ఉరికి పడుతూ వున్నట్లే వుంటుంది. వినటం తోటే మనసుకు కూడా కొత్త ఉత్సాహం గా వుంటుంది. చిన్నప్పటినుండి రేడియో ఆలా వింటూ ఉండటం ఒక అలవాటు. రేడియో లో ఏడు గంటలకు మొదలు అయ్యే జయమాల నుండీ ఛాయా గీత్ వరకు వినే వాళ్లము. మధ్య లో ఏదో డ్రామా వచ్చేది. అప్పుడు మాత్రం రేడియో కి రెస్ట్. ఆ రోజుల్లో హిందీ అంత అర్ధం అయ్యేది కాదు. ఆలా జలపాతం లాగా వచ్చే పాటలు ఎక్కువగా శంకర్ జై కిషన్ గారివే ఉంటాయి. కొన్ని సినిమాలు హిట్ కాక పోయినా ఆ పాట

బువ్వంబంతి

ఇప్పుడు పెళ్లిళ్లు ల్లో ఈ బంతి మాట అంతగా వినిపించటం లేదు కానీ పూర్వం రోజుల్లో ఈ విందు చాలా పసందుగా జరిగేది. కొత్తగా వచ్చిన మెహెందీలు, హల్ది ఫంక్షన్ లు సంగీత్ అని వీటీ తో మన పాత అలవాట్లు పూర్తిగా మరచిపోయాము.కొంచెం హోదా వున్నవాళ్లు రిసెప్షన్ పెట్టినా అదీ అయ్యాక పెళ్ళివారిని, కొత్త దంపతులు ను కూర్చోపెట్టి చక్కటి విందు భోజనాలు పెట్టేవారు. ఈ రిసెప్షన్ లేని రోజుల్లో కొత్త దంపతులు ను కూర్చోపెట్టి, వాళ్లతో పాటు పెళ్ళికొడుకు తల్లిని, ఆడపడుచులకు, ఇచ్చే లంచానాలు, స్వీట్

అల నాటి మేటి చిత్రాలు.

ఒక్కొక్క రోజు పని అంతా అయ్యాక కాస్త రిలాక్స్ అవుదామని టీ వి రిమోట్ చేతి లోకి తీసుకుంటే ముందు కన్ఫ్యూషన్ వస్తుంది. ఎందుకు అంటారేమో ఎన్నో ఓ టీ టీ చానెల్స్. రిమోట్ తో అవ్వన్నీ దాటుకుని మనకు అలవాటుయిన చానెల్స్ కి వస్తే చూస్తే ఇవే పదే పదే చూడండి అంటూ మన అత్తారింటికి దూకుడుగా పంపే సత్యమూర్తి గారి అబ్బాయో, ఆగకుండా శ్రీమంతుడయినా అతడు భరత్ గా వస్తాడు. పోనీ అనుకుంటూ హిందీ చానెల్స్ కి వెళ్ళితే అక్కడ వాళ్ళకి ఇప్పుడు మన తెలుగు, తమిళ్ సినిమాలు డబ్బింగ్ వే బాగా చూస్త

బొమ్మలు చెప్పిన కమ్మని కధలు

ఈ ఏడాది బొమ్మలు కొలువుకి రెస్ట్ ఇద్దా మని భోగి నాడు దేవుడు మందిరం లోనే అమ్మ వారిని పెట్టి పులగం నైవేద్యం చేసి ఇవతలికి వచ్చాను. నా మనవరాలు మేడ మీద నుంచి ఒక కెమెరా పట్టుకుని కిందకి వచ్చింది, ఒక ప్రశ్న తో ఆ కెమెరా పుట్టు పూర్వోత్త్రాలు అడుగుతూ. అదీ పొలారాయిడ్ కెమెరా తాతగారు యూ ఎస్ నుంచి పట్టుకొచ్చారు అని చెప్పాను.తాతగారు ఇంకా ఏం తెచ్చారు అని అడుగుతూ పై నుంచి ఒక్కొక్కటి తేవటం వాటి గురించి అడుగుతూ, బొమ్మలు పెడతాను అంటూ డిసైడ్ అయిపోయింది. ఇంత లోకే వాళ్ళ అమ్మమ్మ, మా అమ్

వన భోజనం

కార్తీక మాసము కదా రోజూ ఫేస్ బుక్ లో చాలా పోస్టులు వనభోజనాలు గురించి పెడుతున్నారు చాలా మంది ఫొటోలు , వాళ్ళు చేసిన పూజలు,ఇంకా ఆటలు అన్నీ పెడుతూ ఉన్నారు. ఇపుడు జరుగుతున్న వన భోజనాలు గురించి సరసి అనే కార్టూనిస్ట్ బోలెడు కార్టూన్లు కూడా పెడుతున్నారు. ఈ రోజు ఇంకో పోస్ట్ చూసాను పెద్ద మామిడి తోటలో ఏర్పాటు చేసిన వన భోజనము గురించి, చాలా మంది ప్రముఖులు వచ్చారు, ఉదయాన్నే ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్, తర్వాత ఏర్పాటు చేసిన లంచ్, వాళ్ళు ఆడిన ఆటలు అన్నీ ఫోటోలు తో కూడా వచ్చాయి, అవి చూడగానే నాక

తాతయ్య గారికి ప్రేమ తో

కొంత మంది మహానుభావులు వుంటారు. వాళ్ళని కొన్ని తరాలు వాళ్ళు కూడా మరచిపోలేని జ్ఞాపకాలు మిగిల్చి పోతారు. అలాంటి వారిలో మా తాత గారు కూడా ఒకరు అని నేను అనుకుంటాను. అందులో సంక్రాంతి రోజుల్లో తాత గారు చాలా గుర్తు కు వస్తూ వుంటారు..సంక్రాంతి నెల రోజులు మా ఇంట్లో చాలా సందడిగా ఉండేది. తెల్ల వారుజామున మేళ తాళాలతో మాకు మేలుకొలుపు లు ఉండేవి. తాతగారు ఆ నెల రోజులు ధనరుమాసం వ్రతం చేసే వారు. ఉదయం ఎనిమిది గంటల కల్లా పూజలు అభిషేకం పూర్తి అయ్యి, కనీసం ఒక ఐదు మంది పురోహితులు తో కలిసి భో

పెళ్లి సంగీతం

ఈ రోజు ఉదయాన్నే ఎమ్ ఎస్ అమ్మ పాడిన అన్నమాచార్య గీతాలు వెతుకు తుంటె పూరయ మమ కామమ్ కీర్తన కనిపించింది. ఆ కీర్తన కృష్ణ లీలా తరంగిణి లో వింటుంటే చాలా ఆనందం తో పాటు అనేక పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. ఆ రోజుల్లో ఆడ పిల్లలు కు సంగీతం నేర్పించే వారు. పెళ్లి సంబంధం కి వచ్చిన వాళ్ళు కూడా సంగీతం వచ్చా అని అడగటం..పాపం ఆ అమ్మాయిలు వచ్చి రాని సంగీతం జ్ఞానం తో ఏవో పాటలు పాడుతూ ఉండే వారు. మా ఇంట్లో కూడా ఇలాంటి సంగీతం క్లాసులు జరిగేవి. నాకు గుర్తు వున్నంత వరకు మా జాయి

బ్లాక్ అండ్ వైట్ టీ వీ

రోజూ లాగే లంచ్ అవగానే శయనించి , పాత రోజుల్లో అయితే నిద్ర పట్టిందాక ఏ పత్రిక, ప్రభ తిరగేసి కునుకు తీసే వాళ్ళం ఇప్పుడు అలాకాదు, మన అరచేతి స్వర్గం లో ముఖ పుస్తకం చూస్తే కాని నిద్ర పట్టదు ఏమయినా ఇంటరెస్టింగ్ పోస్ట్ లు ఉన్నాయా అని తిరగేస్తే మన బ్లాక్ అండ్ వైట్ టీవీ నాటి సీరియల్స్ రెండు ఎవరో రీల్స్ లో పోస్ట్ చేశారు, అవి చూడగానే ఆనాటి టీ వీ కథలు గుర్తు వచ్చాయి ఆ రోజుల్లో ఇన్ని ఛానెల్స్ లేక పోయినా , దూరదర్శన్ లో మంచి సీరియల్స్ వచ్చేవి. ప్రతి బుధవారం రాత్రి ఎనిమిది గంటల

మహా నగరం ముచ్చట్లు

ఈ మధ్య అనుకోకుండా రెండు మహా నగరాలు కి వెళ్ళాను. చెన్నై గా మారిపోయిన చెన్న పట్నం తో చిన్నతనం నుండి అనుభందం వుండేది. మా చిన్నతనం లో , మా నాయనమ్మ మా ఇంట్లో ఏ కొత్త వస్తువు తెచ్చినా పట్నం నుంచి మా అబ్బాయి పంపాడు అని చెపుతూ వుండేది. మేమూ సెలవులు రాగానే అక్కడికి బయలుదేరి వెళ్ళేవాళ్ళం. అలా చెన్నై గా మారిపోయిన మద్రాసు ను ఒక నెల రోజుల క్రితం వెళ్ళినప్పుడు అంతగా డెవలప్మెంట్ జరిగినట్లు అనిపించ లేదు .అదే మాట అంటే మా కజిన్ బ్రదర్ కూతురు, అక్కడే పుట్టి పెరిగిన మా బంధువు, ఈ సిటీ మోస్ట్

దీపావళి కొన్ని జ్ఞాపకాలు

అన్ని పండుగల్లో కి విశిష్టత గల పండుగ దీపావళి. దేశము మొత్తం జరుపుకునే పండగ , అంతే కాక ఈ మధ్య ఇతర దేశాలు సైతం , ఈ పండుగ సందర్భంగా కొంత ఉత్సాహం చూపిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు వ్యాపారాల్లో కొత్త పుస్తకాలు అంటే అకౌంట్ బుక్స్ ఈ రోజు నుండీ మొదలు పెడతారు. ఇపుడు ప్రతి పండుగ కు ఏవో కన్ఫ్యూజన్ అమావాస్య ఎపుడు ఉంది , పండగ ఎపుడు చేయాలి, అనే మీమాంసలు. మా చిన్నతనం లో ఇంత విన్నట్లుగా గుర్తు లేదు. నరక చతుర్దశి రోజున తెల్లవారుజామున లేచి నువ్వుల నూనె తో తలంటు కోవాలి , సూర్యోదయా

ఆ పాత మధురాలు

కొన్ని పాటలు వింటూ ఉంటే ఎన్ని సార్లు విన్నా విసుగు రాదు అనిపిస్తుంది . అందులో హేమంత్ కుమార్ గారి స్వరం ఒక విధమైన మాధుర్యం తో వుంటుంది. లోకో భిన్న రుచి అనుకోండి. కొంత మందికి నచ్చక పోవచ్చు. పాత కాలంలో కొన్ని సినిమాలు పాటలు వల్లే హిట్ అయ్యేవి. అంటే ముందుగా పాటలు రిలీజ్ అయ్యేవేమో తెలియదు ఆరోజుల్లో తెలుగు రాష్ట్రంలో ఎక్కువగా విజయవాడ లో నే హిందీ సినిమాలు వచ్చేవి. అయితే వివిధ భారతీ, ఇంకా binaka గీత మాల లో పాటలు విని ఆ సినిమా చూడాలి అనుకునే వాళ్ళం. మా రెండో అన్నయ్య బెనారస్ లో

Subscribe

Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page