top of page
Search

అన్నపూర్ణ వారి ఆణి ముత్యాలు.

  • murthydeviv
  • Apr 1
  • 3 min read

Updated: Apr 2

ఈ రోజు యూ ట్యూబ్ లో ఏదో వెతుకుతూ ఉంటే శిరీష కొమ్మరాజు గారు పాడిన వినిపించ ని రాగాలే పాట

వచ్చింది. ఆవిడ ఎక్కువ గా పాత పాట లు పాడుతూ వుంటారు .

ఆ పాట కూడా చాలా హాయిగా పిల్ల తెమ్మర లాగా సాగుతుంది . ఉదయాన్నే చూడు మదే చెలియా పాట విందామని

సెర్చ్ నొక్కగానే పాడుతా తీయగా లో శ్రీకర్ పాడిన ఆ పాట వచ్చింది. ఆ తర్వాత హరిణి అనే అమ్మాయి ఎక్కడమ్మా

చంద్రుడు పాట వచ్చింది.

వింటుంటే ఎంత ఆనందం కలిగిందో , సావిత్రి గారి అమాయకమైన మొహం కళ్ల ముందు కదిలింది.

ఆ పాట కు అశ్వద్దామ గారు మ్యూజిక్ చేసారుట , వద్దురా కన్నయ్యా కూడా ఆయనే చేసారుట.

ఆ వెంటనే వీణ గాయత్రీ గారు వీణ మీద వాయించిన అదే పాట పెట్టారు.

వింటూ ఉంటే కనులలో నీరు వచ్చింది.


ఆ చక్కటి పాటలు ఆ సినిమాలు ఎక్కడికీ పోయాయి ఆని . ఆ రోజుల్లో సావిత్రి నాగేశ్వరావు గారి సినిమాలు

ఆంటే చాలా క్రేజ్ ఉండేది. అన్నపూర్ణ వారి చిత్రాలు ఎక్కువగా సావిత్రి నాగేశ్వరరావు హీరో హీరోయిన్ వుండే వారు. దొంగ రాముడు ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు మేము బహుశా చిన్న పిల్లలము అనుకుంటా.

తర్వాత విజయవాడ లో ఎక్కువగా పాత సినిమాలు వస్తూ ఉండేవి. ఆలా చూసినట్లు గుర్తు.

మాయ బజార్ కూడా అలాగే చూసాము. మా స్కూలు లో మాత్రం పిల్లలు చేత

భలే తాత మన బాపూజీ పాట కు డాన్స్ చేయించే వారు. అలాగే మాయ బజార్ లో

రమణా రెడ్డి సృష్టి చేసిన పెళ్లి విడిది లో రీటా ఇంకొక అమ్మాయి చేసిన డాన్స్ కూడా

చేయిస్తూ వుండే వారు.

కానీ ఇప్పుడు టీ వి లో వచ్చే సినిమా లో ఆ పాట అంతగా కనిపించటం లేదు.


మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఇలాంటివి ఏమీ పట్టేవి కాదు . రేడియో లో వచ్చే పాటలు వినటం

బాగుంటే నేర్చుకోవటం . దొంగ రాముడు సినిమాకి పెండ్యాల గారి సంగీతం అని తర్వాత తెలిసింది.

హైదరాబాద్ వచ్చాక లిబర్టీ , దీపక్, శాంతి ధియేటర్ ల లో ఎక్కువగా మార్నింగ్ షో లు

పాత సినిమాలు వచ్చేవి.

చాలా పాత సినిమాలు ఆలా చూసినవే

. దొంగ రాముడు లో అన్నీ పాట లు ఎప్పుడు విన్నా

వీనుల విందు గా వుంటాయి.

ఆ రోజుల్లో ఏ పాట అయినా ఒక చంద్రుడు, రెండు, మూడు చెట్లో, పూల తీగలో ఉంటే చాలు

ఆ సినిమా లో చివురాకులలో చిలకమ్మా, అంద చందాల సొగసరి వాడు , అనురాగం విరిసెనా

రాసిన వారు సముద్రాల గారు ఒక్కరే అయినా పాడింది మాత్రం సుశీల, లీల, రాణి , జిక్కి నో

గుర్తు లేదు .

ఈ సినిమాలో బాల గోపాల తరంగం, మిగతా పాటల తో పాటుగా రారోయి మా ఇంటికి

అనే సావిత్రి ర్ నాగేశ్వరరావు పాట కూడా అంత గాను తరచుగా వినిపిస్తూ ఉండేది.

అన్నపూర్ణ వారి సినిమాలు అంటేనే మంచి కథ తో పాటు మంచి పాటలు ఉండేవి.


తర్వాత వచ్చిన తోడి కోడళ్ళు సినిమా లో కూడా మంచి పాటలు వున్నాయి. ఈ సినిమా తర్వాత వచ్చిన

మాంగళ్య బలం , ఇద్దరు మిత్రులు అన్నీ బెంగాలీ కధలే .

అయినా తెలుగు వాతావరణం నికి తగ్గట్లు గా ఉండటం తో మంచి విజయ చిత్రాలు గా నిలిచి పోయాయి.


ఇద్దరు మిత్రులు సినిమా నేను ఫస్ట్ రిలీజ్ లో చూసిన గుర్తు లేదు . తర్వాత హైదరాబాద్ లో లిబర్టీ థియేటర్ లో

మార్నింగ్ షో చూసినట్లు గుర్తు. అప్పుడు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడిచింది.


తోడి కోడళ్ళు పాటలు గురించి ఇంతక్రితం కూడా రాసినట్లు గుర్తు . దసరా పాట, గాలి పటం పాట ,

కారులో షికారు కెళ్లే బహుశా ఈ పాట శ్రీ శ్రీ గారే రాశి వుంటారు.

ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే , నలుగురు కలిసి పాటలు కూడా వీనుల విందు గా వుంటాయి.


గాలి పటం పాట ఆంటే కుల దై వం సినిమా గుర్తు వస్తుంది. తమాషాగా ఈ రెండూ సినిమాలు కి

సంగీతమ్ మాస్టర్ వేణు గారు చేసారు.

ఆ సినిమా పాటలు గురించి ఇంకోసారి చెప్పుకుందాం.


ఆ రోజుల్లో రేలంగి గారు ఏ క్యారెక్టర్ వేసినా ఒక పాట తప్పని సరి గా వుంటుంది.

అలాంటి పాటలు కూడా ఆరోజుల్లో చక్కగా చూడగలిగేటట్లు , వినగలిగేటట్లు ఉండేవి.

దసరా పాట , ఆ పిల్లలు డాన్స్ చూడాలి ముచ్చట గా వుంటాయి.


మా చిన్నతనమ్ లో మా పెద్దనాన్న గారు ఎక్కువగా సినిమాలు కి తీసుకుని వెళ్ళే వారు.

అప్పుడు ఎక్కువగా భక్తి సినిమాలు మాత్రం తీసుకుని వెళ్ళే వారు .

కొంచెం కాలేజీ కి వచ్చాక మాకు ఇష్టమైన సినిమాలు చూడటానికి అనుమతి ఉండేది.

తమాషా ఏమిటంటే మేము బి ఎస్సీ చదివే టప్పుడు వచ్చిన ఆత్మ బలం సినిమా

చూడటానికి మా అన్నయ్యలు పర్మిషన్ ఇవ్వ లేదు . తర్వాత టీ వి లో చూసి

అన్నయ్య ని అడిగాను ఏముందీ ఈ సినిమాలో మీరు వద్దు అన్నారు ఆని.


ఆ రోజుల్లో ఆ పాటలు వల్గర్ అనిపించాయి అన్నాడు. ఇప్పుడు అసలు ఆ పదం కి

అర్ధం ఏమిటో కూడా తెలియటం లేదు.


ఎన్ని మల్టీప్లెక్స్ థియేటర్ లు వున్నా మంచి సినిమాలు చూద్దాము ఆంటే లేవు .

మొన్న నే పేరు గల హీరో నిర్మించిన కొత్త థియేటర్ గురించి చదువుతూ


అనుకున్నాను, సినిమాలు ఏమున్నాయి ఆని. కనీసం ఇదివరకు లాగా మంచి ఇంగ్లీష్ సినిమాలు

క్లాసిక్స్ గాని, కనీసం జేమ్స్ బాండ్ సినిమాలు గాని రిలీజ్ అవుతే బాగుండు ఆని..


మొన్న ఎప్పుడో మా ఆబ్బాయి ఏదో ఛానల్ లో ఇంగ్లీష్ సినిమా చూస్తున్నాడు. నేను మధ్యలో వచ్చాను.


ఈ సినిమా జేమ్స్ బాండ్ నార్త్ బై ది నార్త్ వెస్ట్ కదరా అన్నాను. ఎలా కనుక్కున్నావు ఆని అడిగాడు.

మద్రాస్ సేఫియర్ థియేటర్ లో అరవై ఏళ్ల క క్రితం చూసానురా అయినా గుర్తు వున్నది అన్నాను.


సినిమా ఆంటే ఆలా ఉండాలి. అలాంటి పాత సినిమాలు వచ్చినా బాగుండు అనుకుంటాను.


దొంగ రాముడు టైమ్ లో నే వచ్చిన సినిమా భలే రాముడు . ఆ సినిమా కి హిందీ సినిమా కిస్మత్ అనుకుంటా.

నాకు అంత తెలియదు.


అందులో ఓహో మేఘ మాల పాట లీల గారు , ఘంటసాల గారు రెండూ నా ప్రియమైన పాటలు


ఎప్పుడూ వింటూ వుంటాను. ఎప్పుడు కారు లో వెళుతున్నా పెడతాను .. పాపం మా పిల్లలు కూడా


విసుక్కోకుండా వింటారు. సాలూరి వారి సంగీతం . అందులో దేశ భక్తి డాన్స్ పాట కూడా చాలా ఇన్స్పిరేటింగ్ గా

వుంటుంది.


శిరీష కొమ్మర్రాజు గారు కూడా మేఘ మాల పాట చక్కగా పాడుతారు.


ఇంకా కొన్ని మధురమైన పాటల తో ఆనాటి జ్ఞానపకాల తోరణాలు తో మల్లెల్ల పందిరి కడదాము.

అన్నపూర్ణ వారి చిత్రాలు రెండో పార్ట్ త్వరలో



























.


















































 
 
 

Recent Posts

See All
హృషీ దా

జయ భా దురి మొదటి సినిమా గుడ్డీ సినిమా జ్ఞాపకం వున్న వాళ్ళ కి హృషికేష్ ముఖర్జీ తెలిసే వుంటారు. రెగ్యులర్ సినిమా లా కాకుండా , సున్నితమైన హాస్యం తో,మనసుకు ఆహ్లాదంగా సినిమాలు తీయ టం ల

 
 
 
నా హాలీవుడ్ యాత్ర

ఇంగ్లీష్ వింగ్లీ ష్ ఆ సినిమాలో శ్రీదేవి ని చూసినట్టే నా మనవ రాళ్లు కూడా నాకు ఇంగ్లీష్ రాదు అర్థం కాదు అనుకుంటారు. మీకు ఇంగ్లీష్ ఒక్కటే వచ్చు , నాకు మూడు భాషలు వచ్చు , అనీ వాళ్ళ

 
 
 
మధుర గీతాలు గీతా దత్

ఒక ఐదు ఆరు ఏళ్ల క్రితం వరకు టేప్ రికార్డర్ లో మనకు ఇష్టమైన పాటలు పెట్టుకుని వినే వాళ్లము. నా దగ్గర గీతా దత్ టేప్స్, తర్వాత సీ డీ లు చాలా నే ఉండేవి. ఈ యూ ట్యూబ్ వచ్చాక ఏదో ఒకటి

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page