అల నాటి మేటి చిత్రాలు.
- murthydeviv
- 12 hours ago
- 2 min read
Updated: 1 hour ago
ఒక్కొక్క రోజు పని అంతా అయ్యాక కాస్త రిలాక్స్ అవుదామని టీ వి రిమోట్ చేతి లోకి తీసుకుంటే
ముందు కన్ఫ్యూషన్ వస్తుంది. ఎందుకు అంటారేమో ఎన్నో ఓ టీ టీ చానెల్స్. రిమోట్ తో
అవ్వన్నీ దాటుకుని మనకు అలవాటుయిన చానెల్స్ కి వస్తే చూస్తే ఇవే పదే పదే చూడండి అంటూ
మన అత్తారింటికి దూకుడుగా పంపే సత్యమూర్తి గారి అబ్బాయో, ఆగకుండా శ్రీమంతుడయినా
అతడు భరత్ గా వస్తాడు.
పోనీ అనుకుంటూ హిందీ చానెల్స్ కి వెళ్ళితే అక్కడ వాళ్ళకి ఇప్పుడు మన తెలుగు, తమిళ్ సినిమాలు
డబ్బింగ్ వే బాగా చూస్తూ ఉన్నట్లు వున్నారు.
ఆ మధ్య ఎవరో ఒక టీవీ ఛానల్ వాళ్ళని ఆ సినిమా డైలాగ్స్ తో సహా మాకు వచ్చేసాయి.
కొత్త వి ఏమైనా పెట్టండి అని అడుగుతున్నారు.
ఇదివరకు దూర్ దర్శన్ వాళ్ళు మంచి పాత సినిమాలు వేసే వారు. ఇప్పుడు వాళ్ళు కూడా పద్ధతి మార్చుకున్నారు.
ఆలా టీవీ లో కాస్త రిలాక్స్ అయ్యే ఛాన్స్ లేదు అనుకుంటూ యూ ట్యూబ్ లో చక్కని సంగీతం విని రిలాక్స్ అయ్యాను.
మా పిల్లలు మొన్న సంక్రాంతి నాడు సినిమా కి వెళదాం అంటే కొత్త సినిమాలు చూసి ఆనందించే ఓపిక లేదు అన్నాను.
పైగా ఆ మల్టీప్లెక్స్ లో నడవలేము. తీరా వెళ్ళాక తల నెప్పి రావటం తప్పితే ఏమీ లాభం ఉండదు.
ఆ రోజుల్లో లాగా సున్నితమైన హాస్యం తో, చక్కటి సినిమాలు మరలా చూస్తామా అనుకుంటాను.
అంగూర్, నరం గరమ్, గోల్మాల్, చోటిసీ బాత్ , కూబ్ సూరత్ ఉపహార్, పియా కాఘర్ ఆలా చెప్పుకుంటూ పొతే ఎన్నో
సినిమాలు , ఎన్ని సార్లు చూసినా విసుగు ఉండదు.
ఆ సినిమాల్లో డేవిడ్ గారిని చూస్తూ ఉంటే మన ఇంట్లో ఆప్యాయంగా సలహాలు ఇచ్చే బాబాయిలో, మామయ్యలో
గుర్తుకు వస్తారు.
ఇంక అశోక్ కుమార్ గారి గురించి మనం చెప్పగలిగేది ఏముంటుంది. ఏ క్యారెక్టర్ అయినా అందులో జీవిస్తారు.
చుపికె చుపికె, అంగూర్, గోలమాల్ ఎన్ని సార్లు చూసినా నవ్వుకోగలము.
చోటిసీ బాత్ లో అశోక్ కుమార్ గారు చెప్పే ప్రేమ పాఠాలు, ఖుబసూరత్ లో కఠినంగా వుండే భార్య తో
సర్దుకుపోయే భర్త గా ఎంత నేచురల్ గా ఉంటుందో చెప్ప లేము.
ఆశీర్వాద్ సినిమా కూడా చాలా గొప్ప సినిమా చూస్తూ ఉంటే ఎంతటి వాళ్ళము అయినా కన్నీరు కార్చక
తప్పదు.
నేను యూ స్ లో వున్నపుడు అర్జున్ పండిట్ అనే అశోక్ కుమార్ సినిమా చూసాను. ఆయన ఒక బంది పోటు దొంగ
కూతురు కోసం చదువు నేర్చుకుని మారిపోతాడు. ఈ మధ్య మరలా చూడాలి అని యూ ట్యూబ్ లో చాలా వెతికాను.
చివరికి దొరికింది. డౌన్లోడ్ చేసుకున్నాను.
కొన్ని సినిమాలు మన మనసులను ఎంత గానో ప్రభావితమ్ చేస్తాయి..అలాంటి వాటిలో అనుపమ, అమర్ ప్రేమ్,
సఫర్, ఆశీర్వాద్, అర్జున్ పండిట్.
అనుపమ లో ఎంతగా హీరోయిన్ చూసి మనం జాలి పడినా చివరి సీన్ లో మాత్రం ఆ తండ్రిని చూసి మనం
దుఃఖ పడతాము.
ఆ సినిమా లో పాట లు కూడా చాలా బాగుంటాయి.
అమర్ ప్రేమ్ ఒక బెంగాలీ కథ అనుకుంటా. అలాంటి కధ తో సినిమా తీసి హిట్ చేయటం అంటే
హిందీ ప్రొడ్యూసర్స్ కే సాధ్యం అనిపిస్తుంది.
మౌసమ్ కూడా అలాంటి కథ రెండిట్లో షర్మిల ఠాగూర్ హీరోయిన్
మౌసమ్ లో సంజీవ్ కుమార్ హీరో , ఏ పాత్ర చేసినా మెప్పించ గల నటుడు.
ఇదేదో సినిమా సమీక్ష లాగా వున్నట్లు వున్నది కానీ ఇప్పటి సినిమాలు చూసి
ఒక లాంటి నిర్వేదం వచ్చి ఒక్కప్పుడు మనకు కూడా మంచి సినిమాలు వున్నాయి అని గుర్తు
చేసి కోవటం.
ఆరాధన, ఆంధి రజని ఘందా ఉప హర్ అలాంటి ఎన్నో సినిమాలు మంచి పాటలతో
యూ ట్యూబ్ లో చూసి ఆనందించాలి.
యింకా ఎన్నో అలనాటి మేటి చిత్రాలు వున్నాయి.
నేను అయితే అంగూర్, చుపికె చుపిక్ డౌన్లోడ్ చేసుకుని కొన్ని సీన్లు చూసి నవుకుంటూ వుంటాను.
అలాంటి సినిమా నే నరం గరమ్ అమోల్ పాలేకర్ హీరో శత్రుగ్న సిన్హా యాక్షన్ చూసి తీరాలి.
అలనాటి మేటి చిత్రాలు, వీనుల విందుగా పాటలు ఉండగా మీసాల పిల్లా లాంటి చెత్త పాటలు
మనకు ఎందుకు.
ఏమంటారు మీరు.
మన తెలుగు లో మేటి చిత్రాల కబుర్లు తో ఇంకొక సారి
ఇక్కడ రంగ్ భి రంగీ కాదు ఖుబసూరత్ లో అశోక్ కుమార్. రంగభి రంగీ కూడా మంచి సినిమా
పర్వీన్ భాభీ అమోల్ పాలేకర్ , దేవేన్ వర్మ , చాలా సున్నితమైన హాస్యం తో బాగుంటుంద
ఎక్కువగా సినిమాలు చూడని మావారు ఒక సారి అప్పటి బొంబాయి వెళ్లి వచ్చి
రజనీ ఘందా సినిమా వస్తే చూడు అని చెప్పారు.
అయన తన ఫ్రైండ్స్ తో బొంబాయి లో చూసారుట.
అందులో హీరో కూడా ఎప్పుడూ చెప్పిన టైం కి రా డు
అందులో అయన కి నచ్చిన అంశము అది.


Comments