top of page
Search

బ్లాక్ అండ్ వైట్ టీ వీ

  • murthydeviv
  • Dec 2, 2025
  • 2 min read

రోజూ లాగే లంచ్ అవగానే శయనించి , పాత రోజుల్లో అయితే నిద్ర పట్టిందాక ఏ పత్రిక, ప్రభ తిరగేసి కునుకు తీసే వాళ్ళం ఇప్పుడు అలాకాదు, మన అరచేతి స్వర్గం లో ముఖ పుస్తకం చూస్తే కాని నిద్ర పట్టదు ఏమయినా ఇంటరెస్టింగ్ పోస్ట్ లు ఉన్నాయా అని తిరగేస్తే మన బ్లాక్ అండ్ వైట్ టీవీ నాటి సీరియల్స్ రెండు ఎవరో రీల్స్ లో పోస్ట్ చేశారు, అవి చూడగానే ఆనాటి టీ వీ కథలు గుర్తు వచ్చాయి ఆ రోజుల్లో ఇన్ని ఛానెల్స్ లేక పోయినా , దూరదర్శన్ లో మంచి సీరియల్స్ వచ్చేవి. ప్రతి బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు చిత్రాహర్ అని హిందీ పాటలు పెట్టేవారు.మా పిల్లలు ఆ టైమ్ కి డిన్నర్ చేస్తూ ఆ పాటలు చూసే వారు. 1976 లో అనుకుంటాను మొదటి సారిగా హైదరాబాద్ లో దూరదర్శన్ వచ్చింది. మా వారు బ్లాక్ అండ్ వైట్ టీ వీ లకు కంపోనెంట్స్ తయారు చేసి ఈ సి ఐ ఎల్ కి ఇచ్చే వారు. అలా ఆ ఏరియా లో మా ఇంట్లో నే మొదట టీ వీ వచ్చింది అని గుర్తు . మొదట గా బాపు గారి సంపూర్ణ రామాయణము సినిమా వచ్చింది.ఆ రోజు మా ఇంట్లో హాలు చుట్టుప్రక్కల వాళ్ళతో నిండి పోయింది. అలా ప్రతి ఆదివారం రాత్రి ఏడు గంటలకు మా ఇల్లు కిటకిట లాడిపోయేది.

ఆ ఫేస్ బుక్ లో ఆరోజుల్లో వచ్చే రెండు సీరియల్స్ గురించి వచ్చింది.ఒకటి వాగ్లే కి దునియా , రెండోది ఏ జో హై జిందగీ

వాగ్లే కి దునియా లో హీరో గారి భార్య రోజూ పక్క వాళ్ళింటికి టీ వీ చూడటానికి వెళ్తుంది. భార్య కోసం పాపం టీ వీ కొంటాడు. ఇంక రోజూ టీ వీ చూడటానికి వచ్చే వాళ్ళతో ఆ యజమాని కి ఇంట్లో నిలబడటా నికి కూడా చోటు ఉండదు అది చూడగానే నాకు కూడా అప్పట్లో మా ఇల్లు గుర్తు వచ్చింది. ఏ జో హై జిందగీ కూడా సున్నితమైన హాస్యం తో చాలా బాగుండేది. ఈ రోజే నేను కూడా యూ ట్యూబ్ లో వున్నాయేమో అని వెతికాను.కొన్ని ఎపిసోడ్స్ వున్నాయి. ఇంకా హామ్ లోగ్ ,అని బునియాద్ , అనే సీరియల్ కూడా చాలా రోజులు వచ్చింది. ఇవి కాకుండా మాల్గుడి డేస్ ఆర్. కె నారాయణ్ గారి కథలు చాలా బాగుండేవి. హామ్ లోగ్ సీరియల్ అయితే చాలా సహజంగా మధ్య తరగతి వర్గాలు లోని ప్రేమలు. చిన్న చిన్న అభిప్రాయ బేధాలు చక్కగా చూపించారు. బనియాద్ సీరియల్ రమేష్ సిప్పీ గారు తీశారు. ఈ సీరియల్ అయితే దేశ విభజన తర్వాత అక్కడ నుండి వచ్చిన కొన్ని కుటుంబాలు మరలా ఇక్కడ స్తిర పడటానికి పడ్డ కష్టాలు అవీ చాలా న్యాచురల్ గా చూపించారు. ఇందులో నటించిన ఆలోకనాథ్ గారు, ఇంకా కొంత మంది యాక్టర్స్నీ ఇప్పటికీ కొన్ని సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. ఇంక రామానంద్ సాగర్ గారి రామాయణం, బి. ర్ చోప్రా గారి మహా భారతము ఇప్పటికీ ఎదో ఒక ఛానల్ లో ప్రసారం అవుతూ ఉంటాయి. తెలుగు లో అయితే ఋతురాగాలు అనే సీరియల్ వచ్చేది. మా అత్త గారు, అమ్మ గారు తప్పకుండా చూసేవారు. ఆ రోజులన్నీ గుర్తు వచ్చి ఆహా అపుడు దూరదర్శన్ ఎంత బాగుండేది అనుకుని ఒక నిట్టూర్పు విడిచాను. ఇంక ఇప్పుడు సీరియల్స్ గురించి ఏం చెప్పాలో కూడా తెలియదు. టెక్నాలజీ పెరిగినా , ఛానెల్స్ పెరిగినా కథలు మాత్రం కుట్రలు కుతంత్రాలు తప్ప, సున్నితమైన హాస్యం కానీ, సమాజానికి పనికి వచ్చే విషయాలు కానీ రావడం లేదు. ఇంకా మూఢ నమ్మకాలు ను పెంచి పోషిస్తున్నారు. పాత సీరియల్ ను చూడగానే ఇవ్వన్నీ గుర్తు వచ్చాయి. సరే ఆలోచించి మనం మాత్రం ఏం చేస్తాములే అనుకుని , యూ ట్యూబ్ లో ఆ పాత మధురాలు నే చూద్దాం అనుకున్నాను.

 
 
 

Recent Posts

See All
సముద్రపు గాలి

ఈ రోజు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కాఫీ తాగుతూ ఉంటే రాత్రి కాస్త చినుకులు పడ్డాయేమో చల్లటి గాలి పలకరించింది. . ఈ హైదరాబాద్ ఎండలకు ఇరవై నాలుగు గంటలూ కూలర్ , ఫ్యాన్ లు తిరుగుత

 
 
 
హృషీ దా

జయ భా దురి మొదటి సినిమా గుడ్డీ సినిమా జ్ఞాపకం వున్న వాళ్ళ కి హృషికేష్ ముఖర్జీ తెలిసే వుంటారు. రెగ్యులర్ సినిమా లా కాకుండా , సున్నితమైన హాస్యం తో,మనసుకు ఆహ్లాదంగా సినిమాలు తీయ టం ల

 
 
 
నా హాలీవుడ్ యాత్ర

ఇంగ్లీష్ వింగ్లీ ష్ ఆ సినిమాలో శ్రీదేవి ని చూసినట్టే నా మనవ రాళ్లు కూడా నాకు ఇంగ్లీష్ రాదు అర్థం కాదు అనుకుంటారు. మీకు ఇంగ్లీష్ ఒక్కటే వచ్చు , నాకు మూడు భాషలు వచ్చు , అనీ వాళ్ళ

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page