top of page
Search

సరాగ మాల

  • murthydeviv
  • Mar 8
  • 3 min read

ఈ పేరు తో మేము చదువుకునే రోజుల్లో ఆంధ్ర పత్రిక లో ఒక ఆర్టికల్ వచ్చేది. ఆరోజుల్లో పత్రిక , ప్రభ అమూలగ్రమ్

.చ ది వే దాన్ని . ఆ ఆర్టికల్ వి. ఏ కె రంగా రావు గారు రాసే వారు.

అందులో సినిమా పాట ల గురించి ఉండేది.

ఈ పాట కు ఏ ట్యూన్ , ఏ రాగం, ఇంగ్లీష్ మ్యూజిక్ కాపీ నా, ఇలా వివరాలు రాసే వారు.

పత్రిక అంతా చదవటం తప్పితే ఆ ఆర్టికల్ గురించి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా దృష్టి అంతా

సీరియల్స్ మీద , కధలు , మేము కూడా కధలు కాకరకాయ లు రాద్దాం అనే ప్రయత్నం, ఆ సీరియల్ గురించి

ఫ్రైండ్స్ తో కబుర్లు.


మార్కులు తక్కువగా వస్తే నాన్నగారితో చివాట్లు , ప్రభలు పత్రికలు తెప్పించను అనే వారు.


ఇంతకీ అసలు సంగతి కి వస్తే పెళ్లి అయ్యాక మా వారు మా అన్నయ్య దగ్గర చాలా రికార్డ్స్ వున్నాయి.

నాగయ్య గారి పాటలు దగ్గర నుండి అని చెప్పారు. అప్పుడు నేను కూడా పత్రిక లో చదివిన నా విజ్ఞాన ము

గురించి చెప్పాను.

తర్వాత మా వారు , మా బావ గారు మద్రాస్ వెళ్ళినప్పుడు వి ఏ కె రంగా రావు గారిని కలిశారు. అయన భరత నాట్య కూడా నేర్చుకుని కార్వేటి నగరం గుడిలో నాట్యం చేసే వారుట .

ఈ రోజు ఇవ్వన్నీ ఎందుకు గుర్తు వచ్చాయి ఆంటే , యు ట్యూబ్ లో కూడా ఒక అయన ఇలాగే మ్యూజిక్ గురించి,

మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి చెప్తూ వుంటారు. అయన పేరు తెలియదు కానీ ఆ ప్రోగ్రామ్ పేరు జల్సా ఘర్.


ఈ రోజు ఆ ప్రోగ్రామ్ వింటుటే అయన చెప్పిన ఒక విషయం వింటుంటే చాలా అశ్చర్యం కలిగింది.

సలీల్ చౌదరి గారు చాలా మలయాళం సినిమాలు కు మ్యూజిక్ చేసారుట. అయన అసిస్టెంట్ గా పని చేసిన

ఆర్ కే శేఖర్ గారి కొడుకు ఏ. ఆర్ రెహమాన్ , ఇళయరాజా రాజా గారు కూడా చిన్న తనము లోనే

చౌదరి గారు మ్యూజిక్ చేసిన సినిమాల్లో గిటార్ , ఆర్గాన్, అవీ వాయించే వారుట.

అప్పుడే సలీల్ చౌదరీ గారు చెప్పారుట, ఈయన గొప్ప మ్యూ జీషియన్ అవుతారు అని.


ఇంకో విశేషం ఏమిటంటే ఎస్ డీ బర్మన్ గారి భార్య కూడా మంచి సంగీత కళా కారిణి

ఆవిడ బెంగాలీ లో చాలా పాటలు పాడే వారుట రవీంద్ర నాథ్ గారి సాహిత్యం కి మ్యూజిక్

కంపోజ్ చేసారుట.


ఆవిడ బర్మన్ గారికి మ్యూజిక్ కంపోజ్ చేయటం లో చాలా హెల్ప్ చేస్తూ వుండే వారుట.


సలీల్ చౌదరీ గారి సంగీతం ఆంటే మధుమతి సినిమా గుర్తు వస్తుంది. ఈ సినిమా లో

అన్నీ మధురమైన పాటలే . కాకపోతే దిల్ తడప్ , సుహానా సఫర్ మరీ బాగుంటాయి.

అందులో అజారే పరదేశీ గుడ్డి సినిమా లో కూడా వాడుకున్నారు.


రేడియో లో బినాక గీత్ మాల లో పాటలు వింటాం తప్పితే ఆ రోజుల్లో ఇంత మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి

తెలియదు. ఒక్క రాజ్ కపూర్ , శంకర్ జై కిషన్ లు తప్పితే. ఇప్పుడు అయితే ఎంత అయినా

గూగుల్ బాబాయ్ గారు చెప్తారు.


అసలు నిన్న పెండ్యాల గారి జయంతి అని పేస్ బుక్ లో వాగ్దానం సినిమా లో పాట పెట్టారు.

ఆ సినిమా లో నా కంటి పాప లో పాట బాగుంటుంది. రేలంగి గారి హరి కథ సినిమా కే హై లైట్


వాగ్దానం శరత్ గారి నవల కు అనుకరణ , ఈ టీ వి లో చాలా సార్లు వచ్చింది. అన్నపూర్ణ వారి దొంగ రాముడు

సినిమా కి కూడా పెండ్యాల గారి మ్యూజిక్ ట . ఆ సినిమా లో చివురు ఆకుల లో చిలకమ్మా పాట ని

ఎంత నేచరల్ గా తీశారో, వినటానికి, చూడటానికి కూడా ఎంతో బాగుంటుంది.


తోడికోడళ్ళు సినిమా లో కూడా పాటలు బాగుంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలియదు కానీ.

దసరా కి పిల్లలు కోలాటం పాట , పిల్లలు చాలా హుషారు గా డాన్స్ చేస్తారు, చివరికి అయ్య వారికీ చాలు ,

ఐదు వరహాలు పిల్ల వారికీ చాలు సున్ని ఉండలు అనే మాట తో ముగుస్తుంది.


అన్నపూర్ణ వారి సినిమా ల లో పాటలు ఎప్పుడూ బాగుంటాయి కదా. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో

గూగుల్ బాబా గారిని అడగాలి. ఆ సినిమా లో గాలి పటం పాట, కారులో షికారు , ఆడుతూ పాడుతూ పాట

బాగుంటాయి.

ఈ సినిమా కూడా బెంగాలీ బాబుల కథ, ఇదే కథ తో షభానా అజ్మి, అమోల్ పాలేకర్ తో హిందీ లో

చూసాను. పేరు గుర్తు లేదు.


భలే రాముడు లో ఓహో మేఘ మాల పాట కూడా గుర్తు వస్తున్నది. నాకు ఎందుకో లీల గారి టోన్

నచ్చుతుంది ఘంటసాల గారు లీల గారు పోటీ పడి పాడినట్లు అనిపిస్తుంది.


ఈ సినిమా కూడా హిందీలో వున్నది. పేరు గుర్తు లేదు. శిరీష కోటంరాజు ఎన్ ఆర్ ఐ యూ ట్యూబ్ లో పాడింది బాగా పా డింది.

పాట వింటూ ఉంటే హాయి గా సముద్రపు ఒడ్డు న మెత్త టి ఇసుక లో వెన్నెల విరిసినట్లు ఉండాలి కానీ

అర్ధం లేని మాటలతో , చెవులు పగిలి పోయే మ్యూజిక్ తో ఉండ కూడదు అని నా అభిప్రాయం.


అదీ ఈ నాటి స రా గ మాల, ఇంకా కొన్ని ఆ పాత మధురా ల తో మరలా కలుసుకుందాం..


శుభ రాత్రి






































 
 
 

Recent Posts

See All
హృషీ దా

జయ భా దురి మొదటి సినిమా గుడ్డీ సినిమా జ్ఞాపకం వున్న వాళ్ళ కి హృషికేష్ ముఖర్జీ తెలిసే వుంటారు. రెగ్యులర్ సినిమా లా కాకుండా , సున్నితమైన హాస్యం తో,మనసుకు ఆహ్లాదంగా సినిమాలు తీయ టం ల

 
 
 
నా హాలీవుడ్ యాత్ర

ఇంగ్లీష్ వింగ్లీ ష్ ఆ సినిమాలో శ్రీదేవి ని చూసినట్టే నా మనవ రాళ్లు కూడా నాకు ఇంగ్లీష్ రాదు అర్థం కాదు అనుకుంటారు. మీకు ఇంగ్లీష్ ఒక్కటే వచ్చు , నాకు మూడు భాషలు వచ్చు , అనీ వాళ్ళ

 
 
 
మధుర గీతాలు గీతా దత్

ఒక ఐదు ఆరు ఏళ్ల క్రితం వరకు టేప్ రికార్డర్ లో మనకు ఇష్టమైన పాటలు పెట్టుకుని వినే వాళ్లము. నా దగ్గర గీతా దత్ టేప్స్, తర్వాత సీ డీ లు చాలా నే ఉండేవి. ఈ యూ ట్యూబ్ వచ్చాక ఏదో ఒకటి

 
 
 

2 Comments


Syamala Tadigadapa
Syamala Tadigadapa
Mar 10

ఆమ్మా, చాలా బాగా వ్రాస్తున్నారు. కొంచెం టెక్స్ట్ ఫార్మాటింగ్ చూసుకోండి. లైన్స్ కొంచెం నిండుగా రానీయండి. అలాగే "హాయిగా" బదులు "హాయి గా" వంటివి వ్రాయటం సరికాదు. ఇలాంటివి చాలా కనిపిస్తున్నాయి - ఈమధ్యకాలంలో మొబైల్ మీద తెలుగు టైపింగు ఇలాగే చాలామంది చేస్తున్నారు!

Like
murthydeviv
Mar 10
Replying to

మీ సలహాలు పాటించటానికి ప్రయత్నం చేస్తాను. నేను ఐ పాడ్ మీద టైపు చేస్తాను.


మీకు నచ్చినందుకు ధన్యవాదములు.

Like

Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page