top of page
Search

హ్యాపీ హోలీ కబుర్లు

  • murthydeviv
  • 7 hours ago
  • 3 min read

మనకు ఆంధ్ర లో ఈ హోలీ పండగ గురించి తెలియదు. మా వారు హైదరాబాద్ లో చదువుకున్నా అప్పుడు ఇంత

హడావుడి ఉండేది కాదేమో. మేము పంజాబ్ వెళ్లిన నాలుగు నెలలకో ఏమో ఈ పండగ వచ్చింది.


యూనివర్సిటీ లో వున్న యూపీ వాళ్ళు, పంజాబీ లు ఉదయాన్నే రంగుల తో ఇళ్ల కు వచ్చేసారు.

వాళ్లతో అక్కడ వున్న తెలుగు వాళ్ళు కూడా మా వారు చాలా చికాకు పడి నాకేమి పూయద్దు

అని గొడవ, వాళ్ళు మాత్రం నయా నయా షాది హోగయా హోలీ ఖేలానా పడేగా అంటూ నా చేత

ఆయనకి కాస్త రంగు పూయించి , నన్ను, మా పక్కన ఇంట్లో వున్న కన్నడ దంపతుల ను

రంగుల్లో ముంచి , మంచి కాఫీ తాగి వెళ్ళారు.


ఆ తర్వాత ఏడాది కొత్తగా పాపాయి వచ్చింది అంటూ రంగులు , అయితే పాపాయికి బొట్టు పెట్టి

వంటికి మాత్రం కొద్దిగా పులిమారు.


అప్పటికి నేను కూడా హోలీ రంగులు పూయటానికి వచ్చిన వాళ్లకు స్వీట్ పెట్టాలి అని తెల్సుకుని రవ్వలడ్డు చేసేదాన్ని.

ఆలా మా వారు నసుగుతూ వున్నా అక్కడ హోలీ ఎప్పుడూ చాలా రంగుల మయం గా ఉత్సహంగా జరిగేది.


ఇంక హైదరాబాద్ వచ్చాక అసలు ప్రహసనాలు మొదలు అయ్యాయి. అన్నయ్య వాళ్ళు మేము దగ్గర గా ఉండటం వలన

ఏ పండగ వచ్చినా పిల్లలు చాలా హడావిడి చేసే వారు. ముందు రోజే వెళ్లి పిచికారీ లు రంగులు తెచ్చికొని

ఉదయాన్నే రోడ్డున పడే వారు.

ఇంక మా అత్తగారు, అమ్మ ఏ పండగ పిచ్చి పండగ అంటూ విసుక్కుంటూ ఉండేవారు. అదే వరస లో మా వారు కూడా.


కానీ ఫ్యాక్టరీ లో పని చేసే వాళ్ళు అందరూ వచ్చి రంగులు పులిమేవారు . వద్దు అనలేముకదా , అయన మాత్రం పొడి మాత్రమే పూయించుకునే వారు. ఇంక దగ్గర లో ఏమైనా ఎలక్షన్స్ ఉంటే ఆ ఏరియా లో వుండే రాజకీయ నాయకులు కూడా హలో చెప్పే వారు రంగులతో , మరి ఓట్లు రావాలి కదా.

అచ్చి వచ్చిన స్వీట్ రవ్వలడ్డు చేసినా బజారు నుంచీ కూడా తెప్పించి స్టాక్ పెట్టుకోవాల్సి వచ్చేది.


మా రెండో వదిన ఖమ్మం నుండి, వాళ్లకు హోలీ నాడు అన్నదమ్ములు వచ్చి రంగులు పూయటమే కాకుండా

అక్క చెల్లెళ్ళ చేత తలకు నూనె పెట్టించుకుని, ఏదో గిఫ్ట్ ఇచ్చి వెళ్ళే వారు.

మా వదిన వాళ్ళు పెద్ద ఫ్యామిలీ, అందరూ క్లోజ్ గా వుండే వారు.

వాళ్ళు కజిన్స్ , తమ్ముడు అందరూ వచ్చి నానా హడావిడి గా రంగులు తో, జోక్స్ తో హోరు ఎత్తించే వారు.


ఇంక పిల్లలు పూర్తిగా తడిసిపోయి , వస్తే వాళ్లకు ఓపికగా శుభ్రం గా స్నానము చేయించి ఆలు ఫ్రై తో పప్పు తో

అన్నాలు పెట్టే వాళ్లము.

ఇళ్లు వళ్ళు అన్నీ రంగుల మయం అంటూ పెద్దవాళ్ళ నస లతో అన్నీ క్లీన్ చేసుకుని ఒక వారం రోజులు ఆ

రంగుల మొహం లతోనే తిరిగే వాళ్ళము.


ఇప్పటికీ హోలీ పండగ ఏమీ మార లేదు , విల్లాల్లో డ్రమ్స్ లో రంగు నీళ్లు పెట్టి మరీ హోలీ అడుతున్నారు.

పిల్లలు వాళ్ళ ఫ్రైండ్స్ వద్దన్నా వినకుండా రంగులు పులిమి ఫోటోలు తీయించుకుని సందడి చేస్తారు.


నా రవ్వలడ్డు మారక పోయినా వాళ్ళ ఫుడ్ మాత్రం మరీ పోయింది . తిరిగి తిరిగి అలిసిపోయి పిజ్జా లు బర్గర్ లు

ఆర్డర్ ఇవ్వటమే.

నన్ను రంగుల్లో ముంచేత్తినా తాతగారికి జెంటల్ గా రాస్తారు గ్రాండ్ చిల్డ్రన్ వాళ్ళ ఫ్రైండ్స్


అన్నట్లు మా అమ్మాయి యూఎస్ లో ఉన్నప్పుడు కూడా గ్యారేజ్ లో హోలీ ఆడారు. అక్కడ బయట ఆడకూడదు కదా.

ఆ టైమ్ లో అక్కడ వున్నాను , రవ్వలడ్డు తో పాటు ఆంధ్ర ఫుడ్ కూడా ఏర్పాటు చేశాను.


పూర్వ ము కావ్యాల్లో కూడా వసంత వుత్సవం అని రాసే వారుట.


అసలు హోలీ ఆంటే సినిమా ల్లో వున్న హోలీ పాటలు గుర్తు చేసుకోకపోతే ఎలా అందుకే కొన్ని మంచి పాటలు

గుర్తు చేసుకుని విందాము.

అసలు హోలీ పాటలు అంటేనే నవరంగ్ లో పాట గుర్తు వస్తుంది. అసలు శాంతరా ము గారి ఆలోచన కు

హ్యాట్సాఫ్ అనాలి. సంధ్య గారి చేత డాన్స్ రెండు వేషాల్లో ఒక విచిత్రం అయితే, పాట మధ్యలో

వినాయకుడి విగ్రహం నుండి ఏనుగు వచ్చినట్లు చూపించటం, అదీ ఇంకో వింత.

పాట మొత్తం చాలా హుషారుగా వుంటుంది. రాజ దర్బారులో, అంతఃపురం లో పాట పాడుకుంటూ

రంగులు చల్లుకుంటూ పాట ముగుస్తుంది.

పాట వింటూ ఉంటే ఆ రంగులు మన మీద చల్లి నట్లే వుంటుంది.

ఆ సినిమా ఒక కళా ఖండం , అన్నీ పాటలు ఎప్పటికీ నిత్య నూతనం గా వుంటాయి.

మదర్ ఇండియా లో శంషాద్ బేగం పాడిన హోలీ పాట బాగుంటుంది.

కొత్త సినిమాల్లో చాలా పాటలు వున్నాయి కానీ నాకు మాత్రం నవరంగ్ పాట బాగా నచ్చుతుంది.

ఆన్ సినిమా లో ఒక హోలీ పాట ఉంది, షం షాద్ బేగం పాడిందే ఈ

మధ్య విన్నాను.

మీరు కూడా హోలీ ఆడక పోయినా పాటలు వినండి..

మేము వద్దు అన్నా మా కోతి మూక చేత రంగులు పూయించు కోవాలి. రంగులు పోయరు.

పిజ్జా తినలేము , రవ్వలడ్డు మాత్రమే .

అవీ హోలీ కబుర్లు , హోలీ కి రంగు రంగుల శుభాకాంక్షలు.















































 
 
 

Recent Posts

See All
అత్తా కోడళ్ల సరాగాలు

రోజూ ఉదయాన్నే మా కుక్ రాగానే ఏం చేయమంటారు అని అడుగుతుంది. నేను ఏదో ఆకుకూర పప్పు చెపితే నిన్న ఆకు కూర నే కదా అంటుంది.. నాకు వెంటనే మా అమ్మ, మా పెద్ద వదిన గుర్తు వస్తారు. కూరలకు వెళ్ళినపుడు

 
 
 
శివరాత్రి

శివరాత్రి అనగానే ఎన్నో జ్ఞాపకాలు ఆలా తరుముకుంటూ వస్తాయి. అన్నీ పండగ లాగా ఈ పండుగ కీ పిండివంటలు హడావిడి ఉండదు కదా ఉపవాసం ఉండాలి అనే ఉత్సహం చిన్నప్పుడు చాలా ఉండేది. పిల్లలు మీరు ఏమీ ఉంటారులే

 
 
 
మరపురాని మధుర గీతాలు 2

ఈ రోజు పేస్ బుక్ తెరవగానే బందిని సినిమా లో ఎస్ డి బర్మన్ గారి పాట ఎవరో పోస్ట్ చేసారు. ఒరే మాజీ , మేరె సాజన్ హై ఉస్ పార్ , ఆ క్షణం లో సినిమా చూస్తున్నప్పుడు పాట కన్నా నూతన్ ఏం చేస్తుంది అనే టెన్ష

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page