వన భోజనం
- murthydeviv
- 4 days ago
- 1 min read
కార్తీక మాసము కదా రోజూ ఫేస్ బుక్ లో చాలా పోస్టులు వనభోజనాలు గురించి పెడుతున్నారు చాలా మంది ఫొటోలు , వాళ్ళు చేసిన పూజలు,ఇంకా ఆటలు అన్నీ పెడుతూ ఉన్నారు. ఇపుడు జరుగుతున్న వన భోజనాలు గురించి సరసి అనే కార్టూనిస్ట్ బోలెడు కార్టూన్లు కూడా పెడుతున్నారు. ఈ రోజు ఇంకో పోస్ట్ చూసాను పెద్ద మామిడి తోటలో ఏర్పాటు చేసిన వన భోజనము గురించి, చాలా మంది ప్రముఖులు వచ్చారు, ఉదయాన్నే ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్, తర్వాత ఏర్పాటు చేసిన లంచ్, వాళ్ళు ఆడిన ఆటలు అన్నీ ఫోటోలు తో కూడా వచ్చాయి, అవి చూడగానే నాకు మొదట వచ్చిన ఆలోచన,అది.ఒక పిక్నిక్.పార్టీ అంటే బాగుండేది కదా ,అని. మా పిల్లల చిన్నతనం లో వన భోజనాలు వెళ్ళినట్లు గుర్తు లేదు కానీ పిక్నిక్ లాగా ఇందిరా పార్క్, గండిపేట దగ్గర కిద్వాయి గార్డెన్ ఆని ఉండేది. ఇప్పుడు వుందో లేదో తెలియదు. చాలా లాన్స్ తో చాలా అందం గా ఉండేది


Comments