top of page
Search

ఆ పాత మధురాలు

  • murthydeviv
  • 3 days ago
  • 3 min read

Updated: 2 days ago

కొన్ని పాటలు వింటూ ఉంటే ఎన్ని సార్లు విన్నా విసుగు రాదు అనిపిస్తుంది . అందులో హేమంత్ కుమార్ గారి స్వరం ఒక విధమైన మాధుర్యం తో వుంటుంది. లోకో భిన్న రుచి అనుకోండి. కొంత మందికి నచ్చక పోవచ్చు. పాత కాలంలో కొన్ని సినిమాలు పాటలు వల్లే హిట్ అయ్యేవి. అంటే ముందుగా పాటలు రిలీజ్ అయ్యేవేమో తెలియదు ఆరోజుల్లో తెలుగు రాష్ట్రంలో ఎక్కువగా విజయవాడ లో నే హిందీ సినిమాలు వచ్చేవి. అయితే వివిధ భారతీ, ఇంకా binaka గీత మాల లో పాటలు విని ఆ సినిమా చూడాలి అనుకునే వాళ్ళం. మా రెండో అన్నయ్య బెనారస్ లో చదువు కునే వాడు , ఆ అన్నయ్య వలన హిందీ సినిమాలు పాటలు, గురించి పరిజ్ఞానం వచ్చింది ఏదైనా కొత్త సినిమా చూస్తే ఆ పా టలు గురించి లెటర్స్ లో రాసే వాడు అలా పాటలు వింటం , హిందీ సినిమాలు, యాక్టర్స్ పరిచయం అయ్యారు కొన్ని పాటలు ఎంత పాత. వైనఎపుడు విన్నా కొత్తగా అనిపిస్తాయి.ఆ నీల్ గగన్ కి తలే అనే పాట 1954 లో వచ్చిన బాద్షా అనే సినిమాలో పాట నేను ఈ మధ్యనే ఏదో పాత పాట కోసం వెతుకుతూ ఉంటే ఈ పాట వచ్చింది. అసలు న తుమ్ హామ్ జా నే అనే పాట తో హేమంత్ కుమార్ ఫేవరెట్ ను అయిపోయాను . ఆ పాట మేము కాలేజ్ లో చదువుకునే రోజుల్లో బినాకా హిట్ పరేడ్ లో వుండేది. ఆరోజుల్లో బినాకా గీత మాలా వినటం , పాటలు గురించి కబుర్లు చెప్పుకోవడం అదొక సరదా గా వుండేది. ఆ సినిమా బాత్ ఏక్ రాత్కి

మా ఊరు వచ్చినప్పుడు కాలేజీ ఎగ్గొట్టి మా టి నీ షో కి వెళ్ళినట్లు గుర్తు. సినిమా ఏమి గొప్ప గా లేదు. దేవానంద్ ఆ రోజుల్లో అమ్మాయిల ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో . సో సినిమా బాగా లేకపోయినా పాట , హీరో రెండూ ఇష్టం కదా అనుకున్నాము. ఆ తర్వాత బీ స్ సాల్ బాద్ , బిస్వజీత్ సినిమాలో హేమంత్ కుమార్ గారి పాటలు హై లైట్. ఆయన పాడే పాటలు వింటూ ఉంటే సముద్రపు ఒడ్డున వెన్నెల లో విహరిస్తూ ఉన్నట్లు వుంటుంది . ఆ గొంతు లో ఉన్న మార్థవం అలా అనిపిస్తూ వుంటుంది . ఆరోజుల్లో ఏదయినా నచ్చిన పాట అయితే వెంటనే నేర్చుకుని పాడే వాళ్ళం . న తుమ్ హామ్ జా నే

పాట కాలేజ్ లో కూడా చాలా సార్లు పాడాను. ఏమిటో అంత ధైర్యం అని ఇప్పుడు అనుకుంటాను. విన్న. వాళ్ళ ఓర్పు అనుకోవాలి. హై apna దిల్ తో ఆవారా పాట కూడా బినాకా హిట్ పరేడ్ లో ఉన్న పాట . కాకపోతే అప్పుడు నాకు బినాకా గీత మాలా గురించి తెలియదు. మా కజిన్ బ్రదర్ మాతో పాటు కాలేజ్ లో చదువుకునే రోజుల్లో. ఈ పాట ఎక్కువగా పాడుతూ వుండే వాడు. మౌత్ ఆర్గాన్ మీద కూడా వాయించే వాడు. ఎపుడు విన్నా చాలా హాయి గొలిపే పాట.ఈ మధ్య

సనమ్ అనే గ్రూప్ వాళ్ళు చాలా పాత పాటలు పాడుతూ యూ ట్యూబ్ లో పెడుతున్నారు. ఈ పాట ఒక నలుగురు కలిసి

చాలా హుషారుగా పాడారు. వాళ్ళు ఇలా చాలా. పాటలు పాడుతున్నారు, బాగున్నాయి. Jaaal అనే సినిమాలో ఏ రాత్ ఏ చాందినీ , అనుపమ సినిమా లో ఏ దిల్ కే సు నో దునియా వా లో , విషాదమైన పాట వింటూ ఉంటే దుఃఖం వస్తుంది.

. అనుపమ లో పాటలు అన్నీ బాగుంటాయి. సినిమా కూడా చాలా గొప్ప సినిమా , కానీ ఇప్పుడు అంత విషాదం చూడ లేము.

జనక్ జనక్ పాయల బా జే సినిమా లో నయన్ తో నయన్ కూడా చాలా మంచి పాట. వింటూ ఉంటే చాలా హాయిగా ఉంటుంది. వసంత్ దేశాయ్ సంగీతము . శాంతారాం గారి గురించి మనం చెప్పేదేముంది . ఆయన సినిమాలు అన్నీ కళా ఖండాలు. ఆయన సినిమాలు లో పాటలు అన్నీ ఎప్పటికీ నూతనంగా వుంటాయి. మంచి సంగీతం, సాహిత్యం తో మ్యూజిక్ లవర్స్ ను అలరిస్తూ వుంటాయి. ఫ్యా సా సినిమా లో జాన్ ఓ కయిసే పాట కూడా విషాదం గా ఉన్నా ఆ మెలోడీ తో వినాలని అనిపిస్తుంది. బిస్ సాల్ బాద్,ఆ తర్వాత కొహర అనే సినిమా లు రెండూ బిస్వజీత్ హీరో , అన్నీ పాటలు హేమంత్ కుమార్ గారు పాడారు. చాలా హుషారుగా ఉన్న పాటలు అన్నీ కూడా హిట్ పరేడ్ లో వచ్చేయేమో గుర్తు లేదు . కొహర,

బీ స్ సాల్ బాద్ రెండూ సస్పెన్స్ సినిమాలు, కొహర రెబెకా అనే ఇంగ్లీష్ నవల కథ తో తీశారు. ఖామోషీ సినిమాలో కూడా

పాటలు బాగుంటాయి. తెలుగు లో చివరకు మిగిలేది సినిమా , అయితే నేను రెండూ చూడలేదు. కానీ పాటలు వింటూ వుంటాను. తుమ్ పుకారు లో తుమారి ఇంతజార్ మే అనే హేమంత్ కుమార్ గా రు పాడారు.అసలు ఆయన పాట అంటేనే ఎక్కువగా మ్యూజిక్ పెట్ట కుండా అలా లాలిత్యం గా వుంటాయేమో అనుకుంటాను. ఇంకా ఎన్నో పాటలు ఉన్నా నాకు తెలిసిన పాటలు గురించి రాశాను. బాదుషా 1954 లో తీసిన సినిమా ట , హసరత్ జైపూరి రాశారు, పాడిన వాళ్లు హేమంత్ కుమార్ లత మేడమ్ గారు, పాట వింటుంటే ఎంతో హాయిగా ఉంటుంది. అలా ఎక్కువ మ్యూజిక్ హంగామా లేకుండా ఉండే పాట దులారి అనే సినిమా ఈ సినిమా కూడా 1949 లో వచ్చిందిట. ఇందులో రఫీ గారి పాట సుహాని రాత్ డల్ చుకీ అనే పాట చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు కూడా పాత పాటలు ఇష్టం ఉంటే వినండి. నా బ్లాగ్ చూసే నా మిత్రులకు, నేను రాసే కాలక్షేపం కబుర్లు ఓర్పు గా చదువుతున్న మిత్రులు కు దీపావళి శుభా కాంక్షలు .have a happy and safe Deepavali. గుడ్ నైట్ .

Ga

 
 
 

Recent Posts

See All
డ్రెస్ కోడ్

.ఏదో స్కూల్ డ్రెస్ లాగా ఈ హెడ్డింగ్ ఏమిటో అనుకోకుండా కొంచెం ఓపికగా చదివితే మీకే తెలుస్తుంది కదా , దసరా హడావిడి పూజలు కోలాటాలు బతకమ్మ డాన్సులు అయినాయి పిల్లలు కు హాలిడేస్ అనిఅమ్మాయి ఉదయాన్నే బ్రేక్ఫాస

 
 
 
దేవీ మహత్యం 4

ఈ రోజు నాలుగో స్తోత్రము గురించి తెలుసు కుందాము .ఈ స్తోత్రము కూడా దేవతలు అమ్మ వారిని ప్రార్థిస్తూ చేసిన ప్రార్థన. ఈ స్తోత్రము నే నారాయణి...

 
 
 
అట్ల తదియ

దసరా నవరాత్రులు, హడావిడి, బతుకమ్మ డ్యాన్సులు, ఆయుధ పూజలు హడావిడి అయింది కదా. దసరా కి మన నవరాత్రుల పూజలు హడావిడి కాకుండా, ఇపుడు ప్రతి...

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page