murthydeviv
6 days ago2 min read
పెళ్లి సంగీతం
ఈ రోజు ఉదయాన్నే ఎమ్ ఎస్ అమ్మ పాడిన అన్నమాచార్య గీతాలు వెతుకు తుంటె పూరయ మమ కామమ్ కీర్తన కనిపించింది. ఆ కీర్తన కృష్ణ లీలా తరంగిణి లో వింటుంటే చాలా ఆనందం తో పాటు అనేక పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. ఆ రోజుల్లో ఆడ పిల్లలు కు సంగీతం నేర్పించే వారు. పెళ్లి సంబంధం కి వచ్చిన వాళ్ళు కూడా సంగీతం వచ్చా అని అడగటం..పాపం ఆ అమ్మాయిలు వచ్చి రాని సంగీతం జ్ఞానం తో ఏవో పాటలు పాడుతూ ఉండే వారు. మా ఇంట్లో కూడా ఇలాంటి సంగీతం క్లాసులు జరిగేవి. నాకు గుర్తు వున్నంత వరకు మా జాయి



