తాతయ్య గారికి ప్రేమ తో
- murthydeviv
- Jan 15
- 2 min read
కొంత మంది మహానుభావులు వుంటారు. వాళ్ళని కొన్ని తరాలు వాళ్ళు కూడా మరచిపోలేని జ్ఞాపకాలు మిగిల్చి పోతారు.
అలాంటి వారిలో మా తాత గారు కూడా ఒకరు అని నేను అనుకుంటాను.
అందులో సంక్రాంతి రోజుల్లో తాత గారు చాలా గుర్తు కు వస్తూ వుంటారు..సంక్రాంతి నెల రోజులు మా ఇంట్లో చాలా సందడిగా
ఉండేది. తెల్ల వారుజామున మేళ తాళాలతో మాకు మేలుకొలుపు లు ఉండేవి. తాతగారు ఆ నెల రోజులు
ధనరుమాసం వ్రతం చేసే వారు. ఉదయం ఎనిమిది గంటల కల్లా పూజలు అభిషేకం పూర్తి అయ్యి, కనీసం ఒక ఐదు మంది పురోహితులు తో కలిసి భోజనాలు అయ్యేవి. ఈ లోపల పిల్లలు మేము ముగ్గులు గోబ్బెమ్మలు పెట్టి తాత గారి పూజలు అయ్యే సమయానికి తయారు అయ్యే వాళ్ళమ్.
జీవితం లో ఎన్ని రోజులు గడిచినా సంక్రాంతి రోజుల్లో ఆ హడావుడి ఆ పూజలు ఆలా మనసులో వెన్నెల లాగా పరచుకుని
ఆనందం కలిగిస్తూ ఉంటాయి.
అన్నిటికన్నా తాత గారు మా వూరి లో మొదలు పెట్టిన ఆరుద్ర ఉత్స వం ఇప్పటికీ ఎంతో వైభవం గా కొ న సాగటం గొప్ప
విశేషం.
ఆ రోజుల్లో యాత్రలు కి వెళ్ళితే బంధువులు అందరితో వెళ్లేవారు. అలాగే తాత గారు కూడా దక్షిణ దేశం యాత్రలో
చిదంబరం వెళ్ళారుట. అక్కడ ఆలయంలో చేసే ఈ ఆరుద్ర ఉత్స వం చూసి తాత గారు మా స్వగ్రామం లోని
శివాలయం లో ఈ ఆరుద్ర ఆభిషేకం మొదలు పెట్టారుట.
తాత గారు వున్నన్ని రోజులు, తర్వాత నాన్నగారు కూడా ఒక పెద్ద పండగ లాగా ఈ అభిషేకం నిర్వహించే వారు.
ఇంటి నుండీ మేళ తాళ లతో వూరేగింపు గా గుడి కి వెళ్లి రాత్రి పది గంటలనుండి గర్భ గుడిలో అభిషేకం చేసి
మరల ఇంటికి రాగానే ఇంట్లో మరల పూజలు అభిషేకం అయ్యాక సంతర్పణ లాగా భోజనాలు పెట్టే వారు.
నాన్న గారి తర్వాత అన్నయ్య లు మేము ఎంతో వుత్సహంగా ఈ కార్యక్రమం చేసే వాళ్ళము.
ఇప్పటికి నాలుగో తరం కూడా ఈ ఆరుద్ర అభిషేకం చేస్తున్నా రు. తాత గారి సంకల్పం ఎంత గొప్పదో కదా
అనిపిస్తుంది.
మేము చిదంబరం వెళ్ళినప్పుడు ఈ విషయాలు అక్కడ పూజారులు కు చెప్పితే వాళ్ళు ఎంతో
సంతోషిం చారు.
ఆ దేవాలయం లో జరిగే ఈ ఆరుద్ర అభిషేకం కి మొదటి గా మా కుటుంబం నికి
ప్రాముఖ్యత ఇస్తారు.
ఇది అంతా తాత గారి ఆశీర్వాదం అని అనుకుంటాను.
ఆలా సంక్రాంతి పండగ అనగానే ఈ విషయాలు అన్నీ గుర్తు వస్తూ ఉంటాయి.


Comments