top of page
Search

పెళ్లి సంగీతం

  • murthydeviv
  • 3 days ago
  • 2 min read

ఈ రోజు ఉదయాన్నే ఎమ్ ఎస్ అమ్మ పాడిన అన్నమాచార్య గీతాలు వెతుకు తుంటె పూరయ మమ కామమ్

కీర్తన కనిపించింది. ఆ కీర్తన కృష్ణ లీలా తరంగిణి లో వింటుంటే చాలా ఆనందం తో పాటు అనేక పాత జ్ఞాపకాలు

గుర్తుకు వచ్చాయి.

ఆ రోజుల్లో ఆడ పిల్లలు కు సంగీతం నేర్పించే వారు. పెళ్లి సంబంధం కి వచ్చిన వాళ్ళు కూడా

సంగీతం వచ్చా అని అడగటం..పాపం ఆ అమ్మాయిలు వచ్చి రాని సంగీతం జ్ఞానం తో ఏవో పాటలు

పాడుతూ ఉండే వారు.

మా ఇంట్లో కూడా ఇలాంటి సంగీతం క్లాసులు జరిగేవి. నాకు గుర్తు వున్నంత వరకు మా జాయింట్ ఫ్యామిలీ లో

వున్న డజన్ మంది ఆడ పిల్లల్లో ఒక్క అక్కయ్య కు మాత్రం చక్కటి సంగీతం వచ్చింది.

మా పెదనాన్న గారి అమ్మాయి, అయన కు కూడా సంగీతం ఆంటె చాలా అభిరుచి ఉండేది.

ఆ రోజుల్లోనే మద్రాస్ ప్రముఖుల సంగీత కార్యక్రమం కు వెళ్లి వచ్చే వారు.

ఈ రోజు మా అక్కయ్య ఎందుకు గుర్తు వచ్చింది అంటే మా పెళ్లి బువ్వం బంతి లో మా అక్కయ్య

మా చిన్న అత్తయ్య ఈ కీర్తన పాడారు.

కాస్త సంగీత జ్ఞానం వున్న మా వారు ఆ కీర్తన విని చాలా ఆనందించి నీకు కూడా సంగీతం వచ్చా అని అడిగారు.

అసలు సినిమా పాట లు తప్పితే ఇంకేమి తెలియని నేను వున్న నిజాన్ని నిర్భయంగా చెప్పాను.

మా అక్కయ్య కు రోజూ సంగీతం మాస్టర్ గారు వచ్చి వయలిన్ కూడా నేర్పే వారు.

మా అమ్మ గారికి కూడా సంగీతం ఆంటె చాలా శ్రద్ద ఉండేది.

అందుకుని నన్ను కూడా రోజూ ఆ మాస్టర్ గారి దగ్గర నేర్చుకో మని చేప్పేది

ఆ సంగీతం మనకు వంట బట్టలేదు. సరిగమలు, తర్వాత రెండు, మూడు వర్ణాలు నేర్చుకున్న తర్వాత

నేను ఎస్ ఎస్ ఎల్ సి కి వచ్చాను , చాలా కష్ట పడి చదవాలి, అని సంగీతం కు గుడ్ బై చెప్పాను

ఆరోజుల్లో ఇంట్లో ఆడపిల్లలు కు సంగీతం నేర్చుకోవాలి అని ఏమిటో రూల్ అనుకునేదాన్ని.

పెళ్లి చూపుల్లో పాటలు పాడమని అడగటం ఎందుకు, ఏమయినా సంగీత కచ్చేరి లు చేయిస్తారా

అనే డౌట్ వచ్చేది.

కాలేజీ లో సినిమా పాటలు, ఉద్యోగం చేసేటప్పుడు లలిత గీతాలు నేర్చుకుని, మా అమ్మ గారి దగ్గర కొన్ని హారతి

పాటలు నేర్చుకుని సంగీతం వచ్చేసింది లే అని తృప్తి పడ్డాను.

పెళ్లి అయ్యాక తెలిసింది మా ఆడబడుచు కు సంగీతం బాగా వచ్చు అని వాళ్ళింటి లో అందరికి సంగీత పరిజ్ఞానం

బాగా వుంది అని.

నాకు సంగీతం గురించి అంత తెలియక పోయినా నాకు వచ్చిన ఎంకి పాటలు లలిత గీతాలు వాళ్లకి నేర్పి

కొంచెం పరువు నిలుపుకున్నాను.

మా వారి కి సంగీతం అంటే వున్న అభిరుచి కోసం మా అమ్మాయి లకు సంగీతం నేర్పించుదామని

ఒక టీచర్ ని పెట్టాను.

మా పెద్ద అమ్మాయి ఒక నెల రోజులు నేర్చుకుని ఇంక నేర్చుకోనని చెప్పింది.

మా రెండో అమ్మాయి మాత్రం సంగీతం తో పాటు వీణ కూడా కొనుక్కుని తీరిక సమయాల్లో నేర్చుకోవాలి

అని ఇంకా ట్రై చేస్తూనే వున్నది.

పట్టు వదలని విక్రమార్కుడు లాగా మా మనవ రాళ్లకి సంగీతం నేర్పాలని ప్రయత్నం చేస్తే

మా పెద్ద మనవరాలు మాత్రమే సిన్సియర్ గా తెలుగు ని ఇంగ్లీష్ లో రాసుకుని

కొంచెం సంగీతం నేర్చుకుంది

ఇప్పుడు ఇంగ్లీష్ పాటలు బాగా పాడుతుంది. స్కూల్లో కాలేజీ లో పెరఫార్మెన్స్ ఇస్తుంది.

ఏదయినా సంగీతమే కదా అనుకుంటాను.

నేను మాత్రం రోజూ కర్ణాటక సంగీతం విని ఆనందిస్తూ వుంటాను.

ఈ రోజుల్లో అమ్మాయిల ను సంగీతం గురించి అడిగి తే ఏమంటారో.

అవీ పెళ్లి సంగీతం కబుర్లు.
































 
 
 

Recent Posts

See All
బ్లాక్ అండ్ వైట్ టీ వీ

రోజూ లాగే లంచ్ అవగానే శయనించి , పాత రోజుల్లో అయితే నిద్ర పట్టిందాక ఏ పత్రిక, ప్రభ తిరగేసి కునుకు తీసే వాళ్ళం ఇప్పుడు అలాకాదు, మన అరచేతి స్వర్గం లో ముఖ పుస్తకం చూస్తే కాని నిద్ర పట్టదు ఏమయినా

 
 
 
మహా నగరం ముచ్చట్లు

ఈ మధ్య అనుకోకుండా రెండు మహా నగరాలు కి వెళ్ళాను. చెన్నై గా మారిపోయిన చెన్న పట్నం తో చిన్నతనం నుండి అనుభందం వుండేది. మా చిన్నతనం లో , మా నాయనమ్మ మా ఇంట్లో ఏ కొత్త వస్తువు తెచ్చినా పట్నం నుంచి మా అబ్బ

 
 
 
దీపావళి కొన్ని జ్ఞాపకాలు

అన్ని పండుగల్లో కి విశిష్టత గల పండుగ దీపావళి. దేశము మొత్తం జరుపుకునే పండగ , అంతే కాక ఈ మధ్య ఇతర దేశాలు సైతం , ఈ పండుగ సందర్భంగా కొంత ఉత్సాహం చూపిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు వ్యాపారాల్లో

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page