top of page
Search

బువ్వంబంతి

  • murthydeviv
  • 19 hours ago
  • 3 min read

ఇప్పుడు పెళ్లిళ్లు ల్లో ఈ బంతి మాట అంతగా వినిపించటం లేదు కానీ పూర్వం రోజుల్లో ఈ విందు చాలా పసందుగా జరిగేది.

కొత్తగా వచ్చిన మెహెందీలు, హల్ది ఫంక్షన్ లు సంగీత్ అని వీటీ తో మన పాత అలవాట్లు పూర్తిగా మరచిపోయాము.కొంచెం హోదా వున్నవాళ్లు రిసెప్షన్ పెట్టినా అదీ అయ్యాక పెళ్ళివారిని, కొత్త దంపతులు ను కూర్చోపెట్టి చక్కటి విందు భోజనాలు

పెట్టేవారు.

ఈ రిసెప్షన్ లేని రోజుల్లో కొత్త దంపతులు ను కూర్చోపెట్టి, వాళ్లతో పాటు పెళ్ళికొడుకు తల్లిని, ఆడపడుచులకు, ఇచ్చే

లంచానాలు, స్వీట్స్ అవీ ఇచ్చే వారు.

మగ పెళ్ళివారిని , ఆడ పెళ్లి వారి మర్యాద ల గురించి సరదాగా పాట లు అవీ పాడే వారు.

మా అమ్మ గారి పాట ల పుస్తకం లో ఈ వియ్యాల వారి పాటలు అని ఏకంగా ఒక పాతిక పాటలు ఉండేవి.

అమ్మ కు ఓపిక వున్నప్పుడు ఆవిడ పాటల పుస్తకం కొంచెం పాత పడగానే కొత్త పుస్తకం లో రాసుకునేది

హారతి పాటలు, జోల పాట లు , ఈ పెళ్లి పాట లు ఆలా చాలా కలెక్షన్ ఉండేది.

ఆ పెళ్లి పాటలు మమ్మల్ని నేర్చుకోమని చాలా సరదా పడే వారు.

మేము మాత్రం ఆ పాటలు ఈ రోజుల్లో పాడటం లేదులే అని తప్పించుకునే వాళ్ళము.

ఇంక ఈ బఫె భోజనాలు వచ్చాక యింకా మీరు పాటలు ఏం పాడుతారులే అని వదిలేసింది.

కాని కొంచెం ఒక పాతి కేళ్ళ క్రితం వరకు కొంచెం టేబుల్ వేసి భోజనాలు వడ్డించే వారు.

ఇంతకీ ఈ బువ్వబంతి గురించి చెప్పలేదు కదా.

మగ పెళ్లి వారి కోసం ముగ్గులు వేసి వాటి మీద చక్కగా అరిటాకులు వేసేవారు.

వంట వాళ్ళు కూడా ముందుగానే అరటికాయ గుండ్రంగా తరిగి రెడీ పెట్టే వాళ్ళు.

ఆ అరటి కాయలు ముక్కల్లో సాంబ్రాణి కడ్డీలు గుచ్చి, అరిటాకు చుట్టూ రకరకాలుగా ముగ్గులు వేసే వారు.

కొత్త దంపతులకు మద్యలో ఆకుల మీద వెండి కంచాలు పెట్టే వారు.

మరలా ఈ పెళ్ళివారిని విడిదికి వెళ్లి పేరుపేరునా పిలిచి వచ్చే వారు.

కొత్త దంపతులు కు పక్కన ఆడ పడుచుల దంపతులు, అత్తగారు, మామగారు ఆలా అందరికి

భోజనాలు కు కూర్చో పెట్టి వడ్డించే వారు.

ఆ రోజుల్లో బువ్వంబంతి లో పెరుగు వడ, ఎదో ఒక స్వ్వీట్ తప్పకుండా ఉండేవి.

ఎన్ని వున్నా పెళ్లి లో కందిపొడి తప్పకుండా అన్నీ బంతుల్లో వడ్డించే వారు.


ఆరోజుల్లో పెళ్ళికి ముందు అప్పడాలు, వడియాలు ఇంట్లోనే పెట్టే వారు.

అప్పడాలు పెట్టే టపుడు సరదాగా రకరకాలుగా బొమ్మలు ఆ పిండితో చేసేవాళ్ళు.

ఆవ్వన్ని ఈ బంతిలో వేయించి సరదాగా వడ్డించే వారు.

ఇంక పాటలు కి అయితే అంతే ఉండేది కాదు.

ఎన్నో రకాల పాటలు పాడుతూ ఎంతో ఆహ్లాద కరంగా ఉండేది..

మగ పెళ్లివారు లో కూడా పాటలు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఆడ పెళ్లివారి మీద

విమర్శలు కురిపిస్తూ పాడే వారు.

అసలు భోజనం కన్నా ఇలాంటి సరదాలు, సందడి బాగా సాగేవి.

ఆలా ఆడ పెళ్లి వారి మధ్య మగ పెళ్లివారి మధ్య ఒక అనుబంధం ఏర్పడేది.

తర్వాత ఎపుడు కలుసుకున్నా ఆ నాటి పెళ్లి ముచ్చట్లు గుర్తుకు తెచ్చుకునే వారు.

ఆ పెళ్లి లో ఏమీ పాటలు పాడేరో , కొత్త పాటలు అయితే నేర్చుకోవాలి అని కూడా

సరదా పడే వాళ్ళు.

ఆలా మా అమ్మగారి కి , మా పెద్ద వదినకు చాలా శ్రద్ధ ఉండేది.

కొన్నేళ్ల క్రితం వరకు కొంచెం టేబుల్ వేసి భోజనాలు పెట్టే వారు.


అప్పుడు కూడా మా వదినలు ఆ టేబుల్ మీదనే ముగ్గులు అవీ వేసి కొంచెం బువ్వం బంతి

ఆకారం తె చ్చే వాళ్ళు. కానీ ఆరోజుల సందడి వేరు.

పెళ్లి దంపతుల కు రిసెప్షన్ లో నుంచుని గనక ఉంటే ఇంక ఓపిక ఏం వుంటుంది.

వాళ్ళ ఓపిక అంతా సంగీత్ లో , మెహందీ లో, ప్రీ వెడ్డింగ్ షూట్ లోనే ఖర్చు అయిపోతుంది.

ఈ బంతి లో వాళ్ళు చెప్పుకునే కబుర్లు ఏమీ ఉంటాయి.

నాకు ఈ రోజుల్లో ఏ పెళ్ళికి వెళ్లినా మా అమ్మగారు, మా అత్త గారు గుర్తు వస్తారు.


ఎపుడూ ఒకటే మాట అనే వాళ్ళు ఏముంది లక్షలు ఖర్చు తప్పితే , అందరూ కంచాలు పట్టుకుని తినటం,

సరదా లు , వేడుకలు ఏమున్నాయ్ అని.


జనరల్ గా వియ్యపురాళ్ళు అపోజిట్ పోల్స్ లాగా వుంటారు. కానీ నా అదృష్టం ఏమిటంటే ఇద్దరూ ఒకటిగా

వుండి నన్ను టార్గెట్ చేసుకునే వాళ్ళు.

మా ఇంట్లో రెండు వైపులా ఒక పాతిక పైన పెళ్లిళ్లు నా ఆధ్వర్యంలో జరిగాయి.

అందుకు నేనే వాళ్లకు అందుబాటులో వుండే టార్గెట్ ని.


కొస మెరుపు ఏమిటీ ఆంటే మా ఆడబడచు చాలా బాగా పాడుతుంది. క్లాసికల్ మ్యూజిక్ కూడా వచ్చు.

మా బావ గారికి, మామ గారికి వినటం కూడా చాలా ఇష్టం.

ఆ అమ్మాయి పెళ్లి లో ఒక పాట తో సరిపెట్ట కుండా పెళ్లి వారికే విసుగు వచ్చేట్లు కచేరి లాగా పాడించు కున్నారు.

వాళ్ళ మూడ్ కనిపెట్టి నేను, మావారు కచేరి ని అపాము.

అవీ ఆనాటి బంతి ముచ్చట్లు. మీరు మీ పెళ్లి సందర్బంగా జరిగిన ముచ్చట్లు గుర్తు తెచ్చుకోండి .






























































 
 
 

Recent Posts

See All
అల నాటి మేటి చిత్రాలు.

ఒక్కొక్క రోజు పని అంతా అయ్యాక కాస్త రిలాక్స్ అవుదామని టీ వి రిమోట్ చేతి లోకి తీసుకుంటే ముందు కన్ఫ్యూషన్ వస్తుంది. ఎందుకు అంటారేమో ఎన్నో ఓ టీ టీ చానెల్స్. రిమోట్ తో అవ్వన్నీ దాటుకుని మనకు అలవ

 
 
 
బొమ్మలు చెప్పిన కమ్మని కధలు

ఈ ఏడాది బొమ్మలు కొలువుకి రెస్ట్ ఇద్దా మని భోగి నాడు దేవుడు మందిరం లోనే అమ్మ వారిని పెట్టి పులగం నైవేద్యం చేసి ఇవతలికి వచ్చాను. నా మనవరాలు మేడ మీద నుంచి ఒక కెమెరా పట్టుకుని కిందకి వచ్చింది, ఒక

 
 
 
వన భోజనం

కార్తీక మాసము కదా రోజూ ఫేస్ బుక్ లో చాలా పోస్టులు వనభోజనాలు గురించి పెడుతున్నారు చాలా మంది ఫొటోలు , వాళ్ళు చేసిన పూజలు,ఇంకా ఆటలు అన్నీ పెడుతూ ఉన్నారు. ఇపుడు జరుగుతున్న వన భోజనాలు గురించి సరసి అనే కార్

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page