top of page
Search

బొమ్మలు చెప్పిన కమ్మని కధలు

  • murthydeviv
  • 4 days ago
  • 3 min read

ఈ ఏడాది బొమ్మలు కొలువుకి రెస్ట్ ఇద్దా మని భోగి నాడు దేవుడు మందిరం లోనే అమ్మ వారిని పెట్టి పులగం నైవేద్యం

చేసి ఇవతలికి వచ్చాను. నా మనవరాలు మేడ మీద నుంచి ఒక కెమెరా పట్టుకుని కిందకి వచ్చింది, ఒక ప్రశ్న తో

ఆ కెమెరా పుట్టు పూర్వోత్త్రాలు అడుగుతూ.

అదీ పొలారాయిడ్ కెమెరా తాతగారు యూ ఎస్ నుంచి పట్టుకొచ్చారు అని చెప్పాను.తాతగారు ఇంకా ఏం తెచ్చారు అని

అడుగుతూ పై నుంచి ఒక్కొక్కటి తేవటం వాటి గురించి అడుగుతూ, బొమ్మలు పెడతాను అంటూ డిసైడ్ అయిపోయింది.

ఇంత లోకే వాళ్ళ అమ్మమ్మ, మా అమ్మాయి మనవరాళ్లు వచ్చారు..

నాకు ఓపిక లేదు అంటున్నా బొమ్మలు పెట్టెలు పట్టుకొచ్చారు. పేరంటం వద్దులే. ఊరికే పెట్టుకోని అంటూ మా అమ్మాయి

సపోర్ట్.

కానీ అలవాటు గా పెట్టే దీపం, నైవేద్యం మానుకోలేము కదా. ఆలా బొమ్మలు కొలువు తయారు అయింది.

ఎన్నోన్నో బొమ్మలు వాటి వెనుక చెదిరిపోని జ్ఞాపకాలు

కొంచెం పాతగా వున్న జంట అమ్మాయిలు బొమ్మ చూసి ఈ బొమ్మ ఇండియన్ అమ్మాయిలు కాదు కదా, అంటూ

డౌట్, అవును అదీ తాత గారు జపాన్ వెళ్ళినప్పుడు అత్తయ్య లకు తెచ్చారు, అని చెప్పాను.

కొంత మందికి ఎక్కడికి వెళ్లినా ఎదో ఒకటి కొనుక్కోచ్చే అలవాటు వుంటుంది.

ఆలా తాత గారు తెచ్చిన బొమ్మలు అన్నీ పేర్చి పెట్టింది.

మద్యలో నీవు అన్నీ దేవుడు బొమ్మలే కొన్నావు. అమ్మమ్మ లవ్స్ ఓన్లీ goddess బొమ్మలు, అని ఇంకో మనవరాలు

ఇంగ్లీష్ లో సమాధానం.

వెంటనే నాకు మా చిన్నతనం లో మా ఇంట్లో బొమ్మలు గుర్తుకు వచ్చాయి. మా ఇంట్లో రక రకాలుగా కృష్ణుడు బొమ్మలు

ఉండేవి. అబ్బా అన్నీ ఇవే బొమ్మలా అని విసుక్కుంటే బామ్మ గారికి ఎక్కువగా కృష్ణుడు అంటే ఇష్టం అని

అమ్మ గారు చెప్పేది.

ఆలా మా ఇంట్లో కంచి కామాక్షి మధుర మీనాక్షి, అఖిలండేశ్వరి లలితా దేవి రెండు మూడు వరసల్లో కొలువు తీరారు

అన్నీ కృష్ణుడు బొమ్మలు వున్నా మధ్యలో అరుదుగా వుండే ఒక శివుడు బొమ్మ గణపతి ని ఎత్తుకుని శివుడు పక్కన పార్వతి దేవి తో వున్న బొమ్మ అపురూపం గా మా పుట్టింటి నుండీ తెచ్చుకున్న కున్నాను.

ఆ బొమ్మ లో వున్న ఒక గణపతి ని మాత్రమే గుర్తు పట్టారు. ఆ బొమ్మ చరిత్ర చెప్ప గానే చాలా హ్యాపీగా

మేము కూడా ఈ బొమ్మని దాచి పెడతాము అనుకున్నారు.

మా అమ్మ గారు మద్రాస్ నుండీ ఒక పెద్ద దేవాలయం బొమ్మ తెచ్చారు.

ఆ గుడి పెట్టటానికి బంక మట్టితో ఒక కొండ లాగా చేసి చిన్న బల్బ్ లు పెట్టి చాలా హంగామా పడే వాళ్ళము.

ఈ పనులకు అన్నయ్యల సహాయం తో పూర్తి చేసేవాళ్ళము.

ఈ బొమ్మలు పెట్టినపుడు మా మేనత్త గారి పిల్లలు కు మాకు కొంచెం పోటీ నడిచేది.

పార్క్ సరిగ్గా రాకపోతే అన్నయ్య లను నస తో వేధించి తే వాళ్ళు అసలీ పండగ ఆడవాళ్లు ది,

వచ్చే ఏడు అసలు మేము చేయము అన్న దాకా మా నస నడిచేది.

ప్రతి ఏడు మా మనవడు వచ్చి తన చిన్న కార్లతో , పెయింటింగు తో ఒక షో రూమ్ లాగా

పెట్టేవాడు. పార్క్ కూడా ఎదో తీమ్ తో కడుతూ వుండే వాడు. ఈ సారి ఎందుకో రాలేదు.

మా మనవరాలు కి కొన్న బార్బీ బొమ్మలు అన్నీ కాళ్ళు చేతులు పీకి మరీ ఆడుకునేది.

నాకు ఓపిక వున్నపుడు వాటికీ పాపం లంగాలు అవీ కుట్టి వేసేదాన్ని.

ఆ బొమ్మలు అవశేషాలను చూసి కాసేపు నవ్వుకుని వాటిని మరలా లోపల పెట్టే సారు.

మా బామ్మ గారి కృష్ణుడు లాగా మా అబ్బాయికి గణేష్ అంటే ఇష్టం అని

చాలా గణేశుని బొమ్మలు, వాడి పెళ్ళికి కూడా వెండి గణేషులు, గణేశుని పెయింటింగు లు

ఎన్నో ప్రెసెంటేషన్ లు వచ్చాయి.

అవీ అన్నీ కూడా ఓపికగా పే ర్చి పెట్టారు.

ఇపుడు కూడా చాలా రకాలుగా బొమ్మలు దొరుకుతున్నాయి. థీమ్స్ తో పెళ్లి సెట్స్, రామాయణం,

ఇంకా ఎన్నో రకాలుగా.

అవీ చూస్తే నాకు కొనాలి అనిపిస్తుంది.

ఇన్ని ఏళ్లు బొమ్మలు పెట్టినా ఇంకా నీకు విసుగు లేదా అంటారు మా పిల్లలు. కానీ నాకు మాత్రం

ఎవరైనా సహాయం చేస్తే బొమ్మలు కొలువు చక్కగా పెట్టాలి అనిపిస్తుంది.

తాతగారు తెచ్చిన బ్యాటరీ బొమ్మలు ఒక పార్క్ లాగా పెట్టి మద్యలో ఒక జపాన్ అమ్మాయిని పెట్టారు.

పక్కనే రెండు ఎడ్ల బండ్లు పెట్టి తాత గారి సొంత ఊరు ని కూడా పెట్టి కొలువు పూర్తి చేసారు.

ప్రతి బొమ్మలు కధలు చెప్పి , మర్నాడు ఉదయం లేచి పూజ చేయండి అని చెప్పితే పూజ

నీవు చేయి మేము వచ్చి పూలు పెడతాము, అంటూ

టీ వి లో మోడరన్ ఫ్యామిలీ అనే ఇంగ్లీష్ ఎపిసోడ్ లో లీ న మయ్యారు.

అదీ కొస మెరుపు.

మా పిల్లలు బొమ్మలు కథలతో ఇంకొక సారి.

మా చిన్నప్పటి బొమ్మలు కధలు తో , మా మేనత్త, మా పెద్దమ్మ వాళ్ళు రాసిన అమ్మ వారి మీద పాట లు

ఇంకోసారి కలుద్దాం.















 
 
 

Recent Posts

See All
వన భోజనం

కార్తీక మాసము కదా రోజూ ఫేస్ బుక్ లో చాలా పోస్టులు వనభోజనాలు గురించి పెడుతున్నారు చాలా మంది ఫొటోలు , వాళ్ళు చేసిన పూజలు,ఇంకా ఆటలు అన్నీ పెడుతూ ఉన్నారు. ఇపుడు జరుగుతున్న వన భోజనాలు గురించి సరసి అనే కార్

 
 
 
తాతయ్య గారికి ప్రేమ తో

కొంత మంది మహానుభావులు వుంటారు. వాళ్ళని కొన్ని తరాలు వాళ్ళు కూడా మరచిపోలేని జ్ఞాపకాలు మిగిల్చి పోతారు. అలాంటి వారిలో మా తాత గారు కూడా ఒకరు అని నేను అనుకుంటాను. అందులో సంక్రాంతి రోజుల్లో తాత గారు చాలా

 
 
 
పెళ్లి సంగీతం

ఈ రోజు ఉదయాన్నే ఎమ్ ఎస్ అమ్మ పాడిన అన్నమాచార్య గీతాలు వెతుకు తుంటె పూరయ మమ కామమ్ కీర్తన కనిపించింది. ఆ కీర్తన కృష్ణ లీలా తరంగిణి లో వింటుంటే చాలా ఆనందం తో పాటు అనేక పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page