దేవీ మహత్యం 4
- murthydeviv
- 3 days ago
- 4 min read
ఈ రోజు నాలుగో స్తోత్రము గురించి తెలుసు కుందాము .ఈ స్తోత్రము కూడా దేవతలు అమ్మ వారిని ప్రార్థిస్తూ చేసిన ప్రార్థన. ఈ స్తోత్రము నే నారాయణి స్తోత్రము అంటారు . కాత్యాయనీ స్తోత్రము అని కూడా అంటారు.
శరణాగతుల గు భక్తులు యొక్క ఆర్తి నీ హరించే తల్లి వైన దేవి అనుగ్రహింపుము. ఓ విశ్వేశ్వరి సకల విశ్వమును అనుగ్రహించుము.
ఓ దేవీ ఈ సకల విశ్వమునకు ఆధారభూతముగా వున్న ఓ దేవీ నీవే భూమి గా వుండి , అట్లే జల రూపము గా ఉండి సమస్త జగత్తును పోషింప చేస్తున్నావు. ఇక్కడ ఆధార భూతము అంటే మూలాధారం నుండి సహస్రారము వరకు అమృత ప్రవాహం గా ఉండి యోగులను అమృత ధారల తో నింపుతావు.
నీవే వైష్ణవి శక్తి వి ఈ జగత్తుకు మూలమైన శక్తి వై మోహింప చేయు చున్నావు. నీ అనుగ్రహము తో లోకములోనీ సర్వులకు ముక్తి కారణము అవుతున్నావు.
సమస్త విద్యలు, మంత్రములు, నీ భిన్న భిన్న స్వరూపులు . లోకములలోనీ అంశ రూపములు
తోఈ విశ్వము అంతయు నిండి వున్నది. లోకములోని స్త్రీలు అందరూ నీ అంశ రూపములే
స్తోత్రము చేయగలిగిన మాటలు అన్నియు నీలోనే నిండి ఉండగా వేరే స్తోత్రము ఏమి చేయగలము .
దేవీ నీవు సమస్త భూత స్వరూపిణి వి భుక్తి నీ , ముక్తి నీ, ఇచ్చే దేవీ నిన్ను ఉపాసించు టకు ఏ మాటలు యోగ్యం మో తెలియకుండా వున్నాము.
సర్వ జనుల యందు బుద్ధి రూపంలో వున్న నీవు స్వర్గము ను,, మోక్షము ను ప్రసాదించు ఓ నారాయణి నమస్కారము
ప్రపంచము నకు కల, కా ష్ట , అనే కాల ప్రమాణ రూపంలో మార్పులు కలిగించి, తుదకు లోకములను అంతము చేయు శక్తి కలిగిన నారాయణి నమస్కారము.
సమస్త మంగళములకు మంగళ స్వరూపి వి. శివే, ఆనంద స్వరూపిణివి. సమస్తమైన కళ్యాణములు సిద్ధింప చేయు శుభ స్వరూపిణి వి . మూడు కన్నుల తో , స్వచ్ఛమైన వర్ణము కల శరణాగత వత్స ల వైన గౌరీ దేవి నీకు నమస్కారము
సృష్టి, స్థితి, లయము లను చేయు శక్తి కలదానవు. త్రిగుణములకు ఆశ్రయమైన గుణ రూపము కల దానివి. సృష్టి కి పూర్వము కూడా ఉన్న ఓ నారాయణి నీకు నమస్కారము
నిన్ను శరణు కోరిన దీనులను , ఆర్తులను, రక్షించుట నీ ఆదర్శము. ప్రతి ఒక్కరి బాధలను తొలగించు జననీ నీకు నమస్కారము.
బ్రాహ్మణి రూపములో హంస వాహనము నందుండి దర్భ ల తో పవిత్రమైన జలము చల్లి శత్రువులను సంహారం చేసిన ఓ బ్రహ్మ స్వరూపిణి నీకు నమస్కారము.
మహేశ్వర శక్తి స్వరూపంలో చేతిలో త్రిశూలం కంఠం నందు సర్పమును ధరించి మౌళి యందు చంద్ర రేఖను ధరించి వృషభ వాహనము పై సంచరించు నారాయణి నీకు నమస్కారము.
కు మా ర శక్తి స్వరూపంలో నెమలి నీ, కుక్కుటం తో , శక్తి అనే ఆయుధము ధరించిన నీకు నమస్కారము.
వైష్ణవీ రూపంలో శంఖం, చక్రము, గద, ధనస్సు ధరించి ప్రసన్నురాలు వైన నారాయణి నీకు నమస్కారము
భయంకరమైన సుదర్శన చక్రము ధరించి నీ కోరలతో పృథ్విని ఉద్ధరించిన వారాహి , మంగళ స్వరూపిణి
నారాయణి నీకు నమస్కారము.
నరసింహ రూపంలో క్రూర రాక్షసులను సంహరించ పూని త్రిలోకముల సంరక్షణ భారము వహించిన నారాయణి నీకు
నమస్కారము.
కిరీటము ,, వజ్రాయుధం ధరించి వేయి కన్నుల తో ఉజ్వలముగా ప్రకాశించూచు వృతా సు రు ను సంహరించిన
ఇంద్ర శక్తి స్వరూపిణి నారాయణి నీకు నమస్కారము.
శివుని దూత గా పంపిన కౌ శి కి దేవీ రూపంలో వున్న, భయంకరమైన రూపము, తీక్షణమైన కంఠం తో అసుర సంహారం చేసిన నారాయణి నీకు నమస్కారము.
కోరలతో కూడి, కపాలముల మాల ఆభరణముగా ధరించిన ఓ కాళికా దేవి, ముండా సురునును సంహరించిన చాముండేశ్వరి నీకు నమస్కారము.
ఓ లక్ష్మీ హ్రీం స్వరూపిణీ, మహా విద్యా, బ్రహ్మ విద్యా స్వరూపిణి, శ్రద్ధా, పుష్టి,, స్వధా రూపిణీ, ధృవ రూపిణి, మహా రాత్రీ,
మహా మాయ, స్వరూపిణి నారాయణి నీకు నమస్కారము.
ఓ మేధా స్వరూపిణి, సరస్వతి, వాక్ రూపిణీ సర్వ శ్రేష్ఠ రూపిణీ , సత్వ రజో తమో రూపిణీ, నియమ స్వరూపిణి సకలాధీశ్వరి నారాయణీ నీకు నమస్కారము.
సర్వ స్వరూపిణి , సమస్త విశ్వమునకు సామ్రాజ్ఞివి , సర్వేశ్వరీ , సర్వ శక్తి స్వరూపిణి ఓ దుర్గా మాత మమ్ము సమస్త భయములనుండి కాపాడుము .ఓ మాత నీకు నమస్కారము.
ఓ కాత్యాయనీ సౌమ్యమైన నీ ముఖము మూడు కన్నుల తో ఉజ్వలముగా ప్రకాశించు చున్న ది .ఆ చూపులు మమ్ము సకల భయములనుండి రక్షించు గాక.
అమ్మవారి మూడు కన్నులు సూర్య చంద్ర, అగ్ని రూపము లై ఉన్నవి .ఈ ప్రపంచము వివిధ భయములతో నిండి వున్నది.
పరమాత్మ స్వరూపిణి అయిన అమ్మ వారే ఈ భయములనుండి రక్షింప గలదు.
భద్రకాళీ ,అగ్ని జ్వాలలతో భీకరము గా ను, అనేక మంది రాక్షసులను సంహరించిన నీ త్రిశూలము మమ్ము సమస్త భయముల నుండి రక్షించు గాక . మంగళ స్వరూపిణి వైన ఓ భద్రకాళి నీకు నమస్కారము.
దేవీ నీ ఘంటా నాదముతో ఈ జగత్తు నంతను నింపి , రాక్షసుల తేజము ను హరింప చేయుదువో అట్టి ఘంటా నాదముతో నీ కన్న బిడ్డల మమ్ము సమస్త పాపముల నుండి రక్షించు గాక .
అసురులు యొక్క రక్తమను పంకముతో నిండి యున్న నీ చేతి లోని ఖడ్గము ప్రకాశవంతమై శిష్ట ప్రాణుల రక్షణ కొరకు
క్షే మము ను కలుగ చేయు గాక . ఓ దేవీ నీకు నమస్కరించుచున్నాము.
ఓ దేవీ నీవు ఆరాధన చే సంతృప్తి చెందిన సకల ఉపద్రవములు , వ్యాధుల నుండి విముక్తిని ప్రసాదించగలవు. నీవు క్రోధము
వహించినచో సాధకుని కోరికను నశింప చేయగలవు. నిన్ను శరణు కోరిన వారికి ఆపదలు అంటవు. అంతే కాక వారు ఇతరులకు ఆశ్రయభూతులు అగుదురు.
ఈ పై శ్లోకము దేవీ సప్త శ్లో కి లో ఉన్నది. ఈ మహిమాన్వితమైన శ్లోకము ఏ దుఃఖము నుండి అయినను విముక్తిని. ప్రసాదిస్తుంది .
ఓ దేవీ అనేక రూపముల తో ధర్మ ద్వేషులైన మహా రాక్షసులతో యుద్దము చేసి వారిని సంహరించితివి . ఇప్పుడు నీవు
వో న రించిన ఇట్టి కార్యము వేరెవరు చేయగలరు .
సకల విద్యలకును, శాస్త్రములకును, వేద వాక్యములందును, ఈశాన్యాది ఉపనిషత్తులు అందునను, నీవే వర్ణింపబడి ఉన్నావు. అహంకార, మమకారములతో నిండి యున్న ఈ విశ్వము మహా అంధకారమైన మమత యను గుంత లో బడి తిరుగు చున్న ది .
రాక్షసులు, భయంకరమైన విష సర్పములు వున్న చోట , శత్రువులను , చోరులు, కార్చిచ్చు నందును సముద్ర మధ్యమున
చిక్కుపడిన , నీవే నిలిచి ఈ జీవులను , విశ్వము ను కాపాడు చున్నావు.
విశ్వేశ్వరి , ఈ సమస్త విశ్వమును నీవే పరిపాలించుచున్నావు. ఓ విశ్వాత్మికా, ప్రకృతి స్వరూపిణీ వై నీవే ఈ విశ్వమును
ధరించు చున్నావు. విశ్వేశ్వరుని కి కూడా నీవు వందనీయు రాలి వై ఉన్నావు. నీ యందు భక్తి కలిగిన వారు విశ్వమునకే
ఆశ్రయ మగుదురు
ఓ దేవీ అనుగ్రహింపుము, శత్రు భయము నుండి మమ్ము నిత్యమూ ఇప్పటి వలనే రాక్షసుల వధించి భీతి నుండి కాపాడుము. అట్లే ఈ జగత్తు నందు వివిధ అధర్మ కార్యము ల చేత ఏర్పడిన పాప ఫలముల వలన కలిగే బాధలను ,
భయంకరమైన ఉపద్రవములు ను, పాపములను, తక్షణమే శ మింప చేయుము..
ఓ దేవీ విశ్వార్థిహారిణి , ప్రణుతులమైన మాకు ప్రసన్నురాలై వై ఈ ముల్లోకాలలో నున్న వారికి నీవే వర ప్రధాతవు ,
అని నిన్ను శరణు వేడుతున్నాము . కరుణతో అనుగ్రహింపుము దేవీ.
పర శివా పావని గై కొను హారతి భార్గవి సుందరి పలుమరు నిను వే డితి షణ్ముఖ జననీ శుభ ప్రదాయిని
సా ర సాక్షి రో సరగున రమ్మ అరిషడ్వర్గ ము ల ను హరియించి శాంత మనే. సాధన నా కి ఇ మ్మ
ఈ స్తోత్రము చాలా మహిమాన్వితమైన స్తోత్రం . దసరా లోనే పూర్తి చేయాలని ప్రయత్నం చేశాను . పండుగ హడావిడి లో
పూర్తి చేయలేక పోయాను ఆ శ్లోకాలు పారాయణ చేయలేక పోయినా ఈ అర్ధం చదివినా అంతే ఫలం కలగాలని దుర్గా మాత ను ప్రార్ధిస్తూ శ్రీ మాత ఆశీస్సులు మనందరికీ లభించాలని కోరుకుంటూ జయ మాతా.
Comments