top of page
Search

డ్రెస్ కోడ్

  • murthydeviv
  • 5 hours ago
  • 2 min read

.ఏదో స్కూల్ డ్రెస్ లాగా ఈ హెడ్డింగ్ ఏమిటో అనుకోకుండా కొంచెం ఓపికగా చదివితే మీకే తెలుస్తుంది కదా , దసరా హడావిడి పూజలు కోలాటాలు బతకమ్మ డాన్సులు అయినాయి

పిల్లలు కు హాలిడేస్ అనిఅమ్మాయి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కి వెళదాం హోటల్ అంటూ డ్రైవ్ అంటూ ఎయిర్పోర్ట్ దగ్గర హొటల్ కి తెచ్చింది, నేను నా పూజ అంటే ఈ పూట కి ఈశ్వరుడికి పూజారి ని నైవేద్యం చేయమని నన్ను కారు ఎక్కించింది, మేము. వెళ్ళేటప్పటికి బ్రేక్ఫాస్ట్ హాల్ కిటకిట లాడుతోంది మా ఫ్యామిలీ కి పట్టే టేబుల్ చూసుకుని కూర్చున్నాము బఫె కదా గ్రాండ్ చిల్డ్రన్ కి నా మెను తెలుసు కదా. ఆనీ నేను ఒక కుర్చీలో సెటిల్ అయ్యాను .అక్కడ వాళ్లను చూస్తూ ఉంటే మనం భారత దేశంలో ఉన్నామా అనిపిస్తుంది అలా కూర్చుని అందరినీ నయనానందకరంగా చూస్తూ ఉంటే నాకు మా బామ్మ గుర్తు వస్తుంది. మా చిన్న తనంలో కాసేపు అలా జట్టు విరబోసుకుని తిరిగితే ఏమిటది దయ్యాలు లాగా.,అని తిట్టేది .ఇంట్లో ఉన్న ఆడపిల్లల కు అందరికీ జడలు వేయటానికి మన అమ్మ లేక అక్క ,పినతల్లి ,కనీసం ఒక రెండు మూడు గంటలు పట్టేది. ఇపుడు ఆ పని పూర్తిగా లేదు. కదా అనుకున్నాను. ఇంక వాళ్ళ డ్రెస్సులు చూస్తే భారత దేశంలో రాష్ట్రానికి ఒక్కొక రకమైన చీరెలు డ్రెస్సులు తయారు అవుతాయి కదా , వీళ్ళ కి ఈ పీలికలు డ్రెస్సులు ఎలా దొరుకుతాయా అనిపిస్తుంది , అలంకరణ అనేది ప్రతి వాళ్ళ వ్యక్తి గతమైన విషయం , అయితే అది అసభ్యంగా. ఉండకుండా ఉంటే బాగుండు అనుకుంటాను నేను , మా చిన్నతనం లో మాకు హిందీ సినిమా లో హీరోయిన్ లాగా పంజాబీ డ్రెస్ వేసుకోవాలని కోరిక వుండేది, ఆరోజుల్లో టైలర్ కి ఆ డ్రస్ ఎలా కట్ చేయాలో కూడా తెలియదేమో , లంగా ఓణీ ల తర్వాత చీరెలు కట్టుకోవటమే. తర్వాత పంజాబీ డ్రెస్ బాగా పాపులర్ అయింది. ఇప్పుడు అయితే మన తెలుగు దేశం లో చాలా కామన్ అయిపోయింది. ఇంక సాఫ్ట్ వేర్ పుణ్యమా అని అమెరికా కి మనకూ సంబంధ బాంధవ్యాలు ఎక్కువ అయిపోయి జీన్స్ , టీ షర్ట్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఇంకా సినిమాలు పుణ్యమా అని ఆ డ్రెస్సులు లో కూడా ఎన్నో ఫ్యాషన్లు, మారి పోతూ ఉంటాయి. మా చిన్నతనం లో ఒక జోక్ చెప్తూ వుండేవారు. పారిస్ లో ఒకావిడ చేతిలో డ్రెస్ పట్టుకొని పరిగెత్తుతూ వుంటుంది. ఎవరో నాలాంటి వాళ్ళు ఎందుకమ్మా అలా పరిగెత్తుతున్నావు అంటే నేను ఇంటి కి వెళ్ళే లోపల ఫ్యాషన్ మారి పోతుందేమో అని చెప్పిందట . ప్రస్తుతం పరిస్థితి అలాగే ఉన్నది. ఇంక షార్ట్స్, నైటీలు కనిపెట్టిన వాడు ఎవడో గాని పిలిచి, పద్మ శ్రీ ఇవ్వాలని వుంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఇపుడు అందరూ పగలూ రాత్రీ నైటీలు వేసుకుని తిరుగుతూ ఉంటారట. తనిష్క్, ఇంకా కొన్ని షాపుల్లో డ్రెస్ కోడ్ వుంటుంది. ఇప్పుడు మంచి పేరు తో ఉన్న బ్రాండెడ్ షాపుల్లో ఇలాంటి డ్రెస్ కోడ్ ఉంటున్నది . చూడటానికి హాయిగా , నీట్ గా ఉంటుంది. నేను ఇలా చెప్తూ ఆడవాళ్ళ ఫ్రీడమ్ ను ఒప్పుకోనేమో అనుకుంటున్నారేమో . కానీ జీన్స్ ప్యాంట్స్ ఇక్కడ ఫ్యాషన్ అంటూ చినిగినవి కొని వేసుకుంటున్నారు . కానీ ఏ దేశం అయినా అలాంటి డ్రెస్సులు మర్యాదస్తులు అనుకునే వాళ్ళు వేసుకోరు. నా ఉద్దేశంలో ఆధునికత అనేది మన చేతుల్లో, మన భావాల్లో ఉండాలి. కానీ ఇలాంటి చిన్న విషయాలు ల్లో. కాదు అని . మా అమ్మాయి చెప్పినట్లు నయనందకరము గా చూస్తూ కూర్చొని లంచ్ లాంటి బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఇలా ఆలోచిస్తూ ఉండటం ఎందుకో అనుకున్నా. అలా జట్టు విరబోసుకుని తిరుగుతూ ఉన్న అమ్మాయిలను చూస్తే నాకు సీ నారాయణ రెడ్డి గారు రాసిన మధురమైన పాట గుర్తు వస్తుంది.

  1. చుక్కలు తో నొక్కసారి సూచింతును నా కన్నియ , నల్లని వాల్ జడ లోపల మల్లి య నీ మొలవాలని ,

    ఇప్పుడు అయితే ఆ పాట ఎలా పాడాలి అంటే చుక్కలు తో నొక్కసారి సూచింతును నా కన్నియ నల్లని నీ కురులకు

    షాంపూ లా మెరవాలని , బాగుంది కదా ప్రాస బాగానే కుదిరింది. అనుకుంటూ నవ్వుకున్నాను. అలనాటి బాపు బొమ్మలు లేరు , చక్కటి వాల్ జడ లు లేవు . అమ్మమ్మ ఏం కాఫీ కావాలి అంటూ నా మనవరాలు ఈ లోకము లోకి తెచ్చింది. జట్టు పడకుండా ఆర్డినరీ కాఫీ అన్నాను.

 
 
 

Recent Posts

See All
దేవీ మహత్యం 4

ఈ రోజు నాలుగో స్తోత్రము గురించి తెలుసు కుందాము .ఈ స్తోత్రము కూడా దేవతలు అమ్మ వారిని ప్రార్థిస్తూ చేసిన ప్రార్థన. ఈ స్తోత్రము నే నారాయణి...

 
 
 
అట్ల తదియ

దసరా నవరాత్రులు, హడావిడి, బతుకమ్మ డ్యాన్సులు, ఆయుధ పూజలు హడావిడి అయింది కదా. దసరా కి మన నవరాత్రుల పూజలు హడావిడి కాకుండా, ఇపుడు ప్రతి...

 
 
 
దేవీ మహత్యం 3

ఈ రోజు మూడవ స్తోత్రము ఐదవ అధ్యాయం లో వస్తుంది . ఈ అధ్యాయం లో శంభు నిశుంబు లను వధించు కథ వుంటుంది.ఈ స్తోత్రము నీ అపరాజిత స్తోత్రము...

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page