murthydeviv
Aug 14, 20254 min read
శ్రావణ భాద్రపదాలు
ఈ రెండు నెలలు అందరికీ తెలిసినవే కదా రాయటానికి ఏముంటుంది అనుకుంటారేమో, కాదేది కవిత కి అనర్హం అన్నట్లుగా పెన్ చేతిలో ఉంటే, సారి ఇపుడు పెన్ను అక్కరలేదు కదా ఐ పాడ్ లో కొట్టుకుంటూ కూర్చోవచ్చు. చిన్నతనం లో మా నాయనమ్మ ఒక కథ చెప్పేది. ఆరోజుల్లో మనం పెద్దవాళ్ళు ఏమి చెప్పినా నోరు మూసుకుని బుద్దిగా వినేవాళ్ళం. ఇంతకీ ఆ కథ ఏమిటంటే ఒక బ్రాహ్మణుడు ఏదో ఊరు వెళ్తూ ఇంట్లో లోపము లేకుండా బియ్యం పప్పులు అన్నీ రెడీ గా పెట్టీ శ్రావణ భాద్రపదాలు వస్తాయి అన్నీ జాగ్రత్తగా వాడుకో, నేను పనుల చూసుకొని వస్



