ఆవకాయ 2
- murthydeviv
- 1 day ago
- 2 min read
అబ్బా ఈ రోజుతో అవకాయ రుచులు చూసి, చూసి ఇంక అన్నీ సరిపోయి నేలే అనుకుంటూ జాడిల్లోకి ఎత్తి అమ్మయ్య ఇంక ఈ ఏడాదికి అవకాయ పని అయిపోయింది అనీ ఊపిరి పీల్చుకున్నాను.
ఇంక అందరికి రుచి కోసం పంపే కార్యక్రమం వున్నది. డబ్బాలు తెమ్మని కోడలుకు చెప్పితే ఆర్డర్ పెడతానండి అనీ వినయంగా చెప్పింది.
మన లాగా సాయంత్రం చక్కగా ఇస్త్రీ చీర కట్టుకుని సరదాగా బజారు కెళ్ళి కూరలు, పండ్లు అవీ తెద్దాం అనే కోరిక ఉండదు వీళ్లకు , ఏదయినా ఆన్లైన్,
సరే కాల మహిమ ఏం చేస్తాం .
మూడు రోజుల నుండీ ఉప్పు , కారం ఘాటు అన్నీ బాగా పట్టాయా లేదా అంటూ రోజు ఒక రకం ఆవకాయలు రుచి చూస్తుంటే నీకు బీపీ పెరిగి పోతుంది
ఇంక ఆపు నీ రుచి పరీక్షలు అనీ మా ఆబ్బాయి హెచ్చరిక, నిజమే కదా,
అనీ ఇంక మా పని అమ్మాయిని టేస్ట్ మేకర్ గా పెట్టుకున్నాను.
భ గ వంతుడి దయ వలన నిన్న మా పెద్ద అమ్మాయి రాగానే , భోజనం చేశాను అనీ చెప్తున్నా అన్నీ రకాల ఆవకాయలు రుచి చూపించి అన్నిటింకీ టిక్ మార్క్ వేయించుకున్నాను.
కొత్త ఆవకాయ పెట్టిన రెండు మూడు నెలలు అందరూ అదే తింటారు , తర్వాత మాములే , చేసినవి నచ్చక పొతే ఆవకాయ వెయ్యి అనటం మావారికి, పిల్లలు కి బాగా అలవాటు.
మనవరాళ్లు, మనవడు కూడా గోంగూర , ఆవకాయ రెండు రోజుల కొకసారి అయినా తినాలి.
మా బామ్మగారు చెప్పేవారు ఆ రెండూ రామ లక్ష్మ ణులు లాగా ఇంటి ఇల్లా ల్ని
ఆదుకుంటాయి అనీ, అరోజుల్లో అంతే కదా.
ఇప్పటిలాగా బంధువులు హోటల్స్ లో దిగటం, హోటల్లో భోజనం చేయటం ఉండేది కాదు. ఏ వేళ లో వచ్చినా అన్నం వండి కూర లు చేయ క పోయినా
ఈ ఊర గాయలతో భోజనం పెట్టే వారు.
మా బామ్మ గారు అయితే పండు కారం లో, గోంగూర లోకి వెన్న పూస,
చింత కాయలోకి పచ్చి మిరపకాయ వేసే వారు.
ఆలా నేను కూడా మద్రాస్ నుండీ వచ్చిన ఫేమస్ టీ వి కంపెనీ వాళ్ల కి
అలాంటి రుచులు చూపించాను.
మాములుగా లంచ్ కి వచ్చే మావారు వెళ్తూ నేను లంచ్ కి రాను, అనీ చెప్పి వెళ్లి ఒంటి గంట కు ఫోన్ చేసి మేము ఇంటికే లంచ్ కి వస్తున్నాము అన్నారు.
అయన తో ఎన్ని సార్లు అలాంటి జలక్ లు అలవాటు అయినా కంగారు పడటం నాకు అలవాటు.
మా అత్త గారు మాత్రం నింపాదిగా పిల్లలు కు చేసిన ఉత్తి పప్పు ఉందిలే
అందులో మాగా య వేస్తాను, ఉల్లి గడ్డ తరిగి ఇవ్వు అన్నారు.
ఆవిడ చింత కాయ, మగాయ , ఉత్తి చింత పండు తో పప్పు చేయటం లో ఎక్సపెర్ట్ , కూరల్లో మహారాణి ఆలూ గడ్డ వేయించి వాళ్లకు స్వాగతం పలికాను.
వాళ్లకు పండు కారం, తో వెన్నపూస, గోంగూర ఉల్లిపాయ, ఈ మాగా య పప్పు వేసాను. రోసుకుంటూ తిని ఆ రుచికి ఫిదా అయిపోయారు.
వాళ్ళు మద్రాస్ వెళ్ళాక ఇంకో డైరెక్టర్ అయిన అతని తమ్ముడు ఫ్యామిలీ తో వచ్చి అదే మెనూ తో భోజనం అడిగాడు.
అతను వెళ్ళాక అదే కంపెనీ లో ఇద్దరు డైరెక్టర్లు భోజనానికి వచ్చారు.
మా అత్తగారు అయితే వీళ్లతో మనకు ఏమన్నా పని ఉందా వూరికే భోజనాలా అనీ అడిగారు.
ఆ టీ వి కంపెనీ వున్న నాళ్ళు మాకే ఆర్డర్ ఇచ్చే వారు , చాలా స్నేహం గా ఉండేవారు
కానీ కొన్ని సంఘటనలు తల్చుకుంటే మనసుకు చాలా ఆనందం వస్తుంది.
మా అత్తగారు వెళ్ళిపోయాక పండ్ల గోంగూర పచ్చడి తెనాలి నుండీ తెప్పించుకోవటమే , పెట్టే దైర్యం లేదు .
వెన్న పూస మాత్రం ఉండాల్సిందే పక్కన , అప్పుడు మాత్రం నాకు కోలేస్ట్రాల్, మా పిల్లలు కి డైటింగ్ గుర్తు రావు.
అవీ ఈ నాటి ఆవకాయ తో నా ఊహల ఉయ్యాల.
శుభ రాత్రి
.
Comments