మధుర గీతాలు సురయ్యా, నూర్జాహన్
- murthydeviv
- 3 minutes ago
- 3 min read
దూర్ దర్శన్ వచ్చిన కొత్తలో శనివారం పాత హిందీ సినిమాలు వేస్తూ వుండే వారు. ఆలా చూసిన సినిమాల్లో మీర్జా గాలిబ్ ,రుస్తుం సోహెరాబ్ అనే ఇంకా శాంతా రామ్ గారి సినిమాలు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వచ్చేవి.
అప్పట్లో దూర్ దర్శన్ లో వచ్చిన ప్రతి సినిమా తప్పకుండా చూసే వాళ్లము.
1995 లో యూ ఎస్ వెళ్ళినప్పుడు కూడా అప్పటికీ ఇంకా మన చానెల్స్ ఏవీ వచ్చేవి కాదు .ఒక్క జీ టీ వి
ఛానల్ వచ్చేది. అదీ హిందీ సినిమాలు పాతవి రోజూ ఉదయం 11 గంటలకు వచ్చేవి..
అందులో కూడా చాలా పాత సినిమాలు , ఆరోజుల్లో నేను హిందీలో చాలా పౌరాణిక సినిమాలు చూసాను.
అసలు అన్నీ పౌరాణిక సినిమాలు హిందీ లో వున్నాయి అని కూడా నాకు తెలియదు.
అందులో రెండు సినిమాలు మాత్రం బాగా గుర్తు వున్నాయి..
ఒకటి వామన్ అవతార్ అందులో పాట కవి ప్రదీప్ గారు రాసి ఆయనే పాడారు అనుకుంటా , తేరే ద్వార్ కడా
భగవాన్, చాలా ఫేమస్ పాట నేను చాలా సార్లు విన్నాను. కవి ప్రదీప్ గారే పాడారుట.
ఇంకొక సినిమా పాదు కా పట్టాభిషేకం , ఆ సినిమా లో అయితే యాక్టర్స్ పేర్లు కూడా తెలియవు.
వామన ఆవాతర్ లో అయితే నిరూప్ రాయ్ , బలి చక్రవర్తి గా వేసిన యాక్టర్ కూడా తెలిసిన మొహం పేరు తెలియదు కానీ
పాదు కా పట్టాభిషేకం లో చాలా పవర్ ఫుల్ డైలాగ్స్ వున్నాయి. పౌరాణిక సినిమాలు హిందీ లో కూడా
బాగా తీయగలరని అపుడే అర్ధం అయింది.
చోప్రా గారి మహా భారత్ చూసాక ఇంకా బాగా అర్ధం అయింది. ఆ శ్రీ కృష్ణుడు ముందు ఇంక ఏ యాక్టర్ ఆలా చేయ లేరు అనిపించింది.
అందులో శ్రీ రాముల వారు భరతుడికి కి చెప్పే డైలాగ్ నాకు ఎప్పటికీ గుర్తు ఉండీ పోయింది.
ప్రేమ కన్నా భాద్యత నిర్వహించడం మే ఎవరికయినా ముఖ్యం అనీ.
అసలు విషయం కి వస్తే అక్కడే చూసిన పాత సినిమాల్లో సు ర య్యా, దేవానంద్ యాక్ట్ చేసిన సినిమాలు చూసాను.
నేను అంతగా మరీ పాత పాటలు వినను కానీ , మా బావ గారి దగ్గర సెహగల్, పంకజ్ మల్లిక్, సు ర య్యా, ఇంకా నూరజహాన్ పాట ల రికార్డు లు ఉండేవి.
మావారు, ఆయన ఆ పాటలు పెట్టుకుని చాలా ఆనందంగా వింటూ వుండే వారు. ఆలా కొన్ని పాటలు నచ్చేవి.
నిన్న సం షా ద్ బేగం పాటలు విన్నాక మరలా ఆ రోజులు ఆ పాటలు గుర్తు వచ్చాయి
సరే ఇప్పుడు మన అరచేతి స్వర్గం లో నొక్క గానే బోలెడు పాటలు వచ్చాయి. సురయ్యా గారు సుమారుగా 70 సినిమాల్లో నే యాక్ట్ చేసారుట కానీ మూడు వందల పైనే పాటలు పాడా రుట , ఆవిడ యాక్టర్, కమ్ సింగర్ .
ఆరోజుల్లో ఆవిడ యాక్ట్ చేసిన సినిమాలు కి చాలా క్రేజ్ ఉండేదిట, ఆవిడ తో యాక్ట్ చేసిన హీరోల కన్నా ఆవిడ ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకునే వారుట.
ఆవిడ చివరి గా యాక్ట్ చేసిన సినిమా రుస్తుం సోహ్రబ్ దూర్ దర్శన్ లో చూసాను కానీ అంతగా గుర్తు లేదు..
సురయ్యా పాడిన చాలా ఫేమస్ పాటలు ఇప్పటికీ ఛాయా గీత్ లో బోలె బిసేరె గీత్ లో వినిపిస్తూ వుంటాయి.
Husky వాయిస్ అనిపిస్తుంది , మిర్జా గాలిబ్ లో పాటలకు ఆవిడకు అవార్డు లు రావటమే కాక నెహ్రూ గారు
కూడా ప్రైజ్ చేసారుట.
యూ ట్యూబ్ లో చాలా పాటలు వున్నాయి, సురయ్యా , దేవానంద్ పెళ్లి చేసుకుందాం అనుకున్నారుట, కానీ సురయ్యా
బంధువులు ఒప్పుకోక పోవటం చేత ఆ పెళ్లి జరగలేదు. ఆవిడ అవివాహత గానే ఉంది పోయా రు.
కానీ వింటూ ఉంటే ఇంకా వినాలని అనిపించే కం ఠం, అరోజుల్లో క్రేజ్ క్రియేట్ చేసిన హీరోయిన్ .
మా బావ గారు దగ్గర నూరజహాన్ అనే ఆవిడ రికార్డ్స్ కూడా ఉండేవి , ఆ యన ఆ పాటలు కూడా చాలా ఆనందంగా వింటూ వుండే వారు.
ఆవిడ హిందూస్తాని మ్యూజిక్ నేర్చుకుందిట, అరేళ్ళ వయసు నుండీ పాడటం మొదలు పెట్టిన ఆవిడ సుమారుగా
30 000 పాటలు పాడారుట .
ఆమె హిందీ లో ప్రా ణ్, శాంతా అప్తే, త్రిలోక్ కపూర్ తో నటించారు ట.
ఈవిడ పాటలు యూ ట్యూబ్ లో ఎక్కువగా లేవు , మరలా ఒకసారి వెతకాలి.
చివర గా పాత సింగర్స్ లో కే ఎల్ సెహగల్ గారిని , పంకజ్ మల్లిక్ గారిని ఒకసారి తలచుకుందా ము.
సెహగల్ గారి రెండు పాటలు నాకు గుర్తు , సోజా రాజ కుమారి, జబ్ హీ దిల్ టూట్ గయా అనే పాటలు .
ఈయన పాటలు యూ ట్యూబ్ లో వున్నాయి. స్లో మ్యూజిక్ తో వినటానికి హాయిగా వున్నాయి.
పంకజ్ మల్లిక్ గారి పాటలు కిషోర్ కుమార్ రెండు సినిమాల్లో పాడారు. పడొసన్, చల్తీ కా నామ్ గాడి లో .
కిషోర్, ఆశా పాడిన ఢిల్లీ కా టగ్ లో అందమైన పాట అంతక ముందు పంకజ్ మల్లిక్ గారు స్లో గా పాడారు యూ ట్యూబ్ లో వున్నది.
ఓల్డ్ ఈ స్ గోల్డ్ అనుకుంటూ మన లాంటి పెద్ద వాళ్ళము ఆ పాటలు వింటూ ఉందాము.
లేకపోతే చిక్రి చిక్రి అనుకుంటూ వినలేని సాహిత్యం వినాల్సి వస్తుంది.
శుభరాత్రి
Comments