మధుర గీతాలు సురయ్యా, సంషాద్ బేగం ,నూర్జాహన్
- murthydeviv
- 4 minutes ago
- 2 min read
మధ్యాహ్నం లంచ్ అయ్యాక యూ ట్యూబ్ ఓపెన్ చేయగానే సయ్యా దిల్ మే అనారే అంటూ వైజయంతి మాల డాన్స్ పాట రెండూ చూడ ముచ్చట గా వున్నాయి . నేను పాట పాడింది ఏదో కొత్త టోన్ లాగా ఉంది అనీ చూస్తే సంషాద్ బేగం అనీ ఉంది. ఆవిడ వి ఇంకా ఏమీ పాటలు వున్నాయి అనీ వెతికితే చాలా పాటలు వచ్చాయి ఆ పాటలు రెండూ ఆవిడ పా డింది అనీ తెలియదు కానీ, ఒకటి భ గవాన్ , సినిమా పేరు గుర్తు లేదు కానీ, దూర్ దర్శన్ పెట్టిన కొత్తల్లో శనివారంపాత సినిమాలు వేసే వాళ్ళు. ఆ సినిమా లో పాట లు ఆవిడే పాడింది ట. ఇప్పుడే చూసాను సినిమా పేరు పతంగా మ్యూజిక్
సీ రామ చంద్ర గారు
ఇంకొక పాట కజరా మోహ బ్బత్ వాలా ఆశా భోన్సలే , సంసాద్ బేగం ఓ పి నయ్యర్ గారి మ్యూజిక్ పాట, డాన్స్ రెండూ హుశారుగా వుంటాయి. ఆ సినిమా 1969 లో వచ్చింది.
రేడియో సిలోన్ లో ఉదయం పురానే సంగీత్ అంటూ చాలా పాత పాట లు వచ్చేవి. చివరికి సైగల్ గారి పాట గాని,
పంకజ్ మల్లిక్ గారి పాట వచ్చేది
మేము అయితే కాలేజీ రోజుల్లో బినాకా గీత్ మాలా బాగా వినే వాళ్లము. మా బావగారికి , మా వారికీ
పాత పాట లు అందులో సైగల్ , పంకజ్ మల్లిక్ పాటలు ఆంటే చాలా ఇష్టం ఉండేది .
ఆలా ఆ ప్రోగ్రామ్ వినటం అలవాటు అయ్యింది.
ఈ రోజు ఆవిడ పాట వినేటప్పటికి , ఆవిడ ఇంకా ఏం పాటలు పాడారో అనీ యూ ట్యూబ్ లో వెతికితే
చాలా పాటలు వచ్చాయి.
ఆవిడ మొత్తం హిందీ లో ఆరు వేల పాటలు దాకా పాడారుట. లేటెస్ట్ గా 1970 దాకా పాడారుట .
వైజ యంతి మాల బహార్ లో అన్నీ పాటలు ఆవిడే పాడినట్లు వున్నారు. ఎస్. డి బర్మన్ గారి సంగీతం ట
తెలుగు లో భానుమతి గారి కంఠం లాగా ఖంగు మోగే కంఠం , లేఖే లేఖే పెహలా పెహలా ప్యార్ , కాజరా మొహాబ్బత్ వాలా లో బాగా తెలుస్తుంది.
కహా పే నీగాహే , కహిపే నిషానా , లేకే లేకే పెహలా పెహలా ప్యార్ ఇవీ ఓపి నయ్యర్ గారి సంగీతం అనిపిస్తున్నది.
శంకర్ జై కిషన్ డైరెక్షన్ లో మూడు పాటలు మాత్రమే పాడారుట ఒకటి ఆవారా సినిమాలో ఏక్ దో తీన్ అనే పాట యట్యూబ్ లో వెతికాను కానీ దొరక లేదు.
నౌషాద్ గారి డైరెక్షన్ లో మదర్ ఇండియా, మొగలే అజామ్,అందాజ్, బాబుల్ , సినిమాల్లో పాడారుట
తలత్ మొహమ్మద్ గారి తో పాట మిలతే హాయి అంఖే ఇప్పటికీ ఛాయా గీత్ లో భోలే బిసేరె గీత్ లో వినిపిస్తూ వుంటుంది.
మదర్ ఇండియా లో కూడా హోలీ పాట ఈ మధ్య వేరే ఎవరో పాడి యూ ట్యూబ్ లో పెట్టారు.
ఆలా వై జయంతి మాలా అందమైన డాన్స్ చూసి ఈ బేగం గారి గురించి తెలుసుకొని మీతో ఈ పాత పాటల
సరాగాలు పంచుకున్నాను.
ఆరు వేల పాట లు ఆంటే అన్నీ రాయలేముకదా , ఆ పాటలు విని అనందిద్దాము అనుకుంటే యూ ట్యూబ్ లో వినండి..
హిందీ సినిమాల్లో వేసే టుంటుం యాక్టర్ కూడా పాటలు పాడే వారుట ఆవిడ అసలు పేరు ఉమాదేవి.
ఆఫసానా లిఖ్ రహి హుం అనే పాట దర్ద్ సినిమా లో నౌషాద్ గారి డైరక్షన్ లో 1947 లో పాడారుట
ఈ పాట ఈ మధ్య సోనీ టీ వి లో ఇండియన్ ఐ డాల్ అనుకుంటా ను అక్కడ కూడా ఎవరో ఈ పాట పాడారు .
చాలా బాగా పాడింది.
ఈవిడ ఇంకా దర్ద్, దిల్లగి సినిమాల్లో నౌషా ద్ గారి మ్యూజిక్ లో పాడారుట , ఆ పాటలు యూ ట్యూబ్ లో కనిపించ లేదు.
ముబారక్ బేగం ఈవిడ రెండు మూడు పాటలు నేను ఎక్కువగా వింటూ వుంటాను. ఆవిడ పాడింది కేవలం 178 పాటలు ట.చాలా స్వీట్ వాయిస్
ఏ దిల్ బతా హమ్ కహా ఆగాయే, కభీ తన్హాయాయోమె, హుమరాహి లో డ్యూయెట్ రఫీ గారి తో
మధుమతి లో కూడా ఖవాలి పాడారు. రవీంద్ర భారతి లో ఆవిడ కు సన్మానం చేస్తే వెళ్లినట్లు గుర్తు
అప్పటికే పెద్ద వయసు అయినా కొన్ని పాటలు పాడారు.
ఈ మధ్య పాత పాటలు కు హంగామా గా మ్యూజిక్ జోడించి డాన్సులు, అవీ చాలా రీల్స్ కనిపిస్తూ వుంటాయి.
కొత్తగా మంచి పాటలు కంపోజ్ చేయక పో గా పాత పాట లు కూడా పాడు చేస్తున్నారు అనిపిస్తుంది.
మన తరం పాటలు కూడా గుర్తు చేసుకుని వింటూ ఉంటే హాయిగా వుంటుంది కదా.
సయ్యా దిల్ మే అనారే కి చాలా రీల్స్ చూసాను.
ఇంకా సు రయ్యా, నూర్జాహన్ గురించి ఇంకో రోజు కలుద్దాం
శుభ రాత్రి
Comments