top of page
Search

అన్నపూర్ణ వారి ఆణి ముత్యాలు 3

  • murthydeviv
  • 10 hours ago
  • 3 min read

ముచ్చట గా మూడో సారి సావిత్రి, నాగేశ్వరావు గారి సినిమాలు తో పాటు , కొన్ని అన్నపూర్ణ వారి

సినిమాలు లో మధురమైన పాటలు గుర్తు చేసుకుని ఈ సీరీస్ కి ముగింపు చెప్తాను.


పూల రంగడు కన్నా ముందే ఆత్మ గౌరవం సినిమా వచ్చింది. ఈ కధ సులోచన రాణి గారు రాశారుట.

బహుశా సినిమా కే రాశారేమో , ఆవిడ నవలలు లో చదివినట్లు గుర్తు లేదు.


ఈ సినిమా ఈ టీవీ లో చాలా సార్లు వచ్చింది. విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో సాలూరి వారి సంగీతం లో

విన తగ్గ పాటలే వున్నా సాహిత్య పరం గా కొంచెం వాసి తగ్గింది అనుకోవచ్చు.

ఒక పూల బాణం పాట బాగుంటుంది.

రానని రాలేనని, అందె ను నేడే అందని జాబిలి, రాజశ్రీ తో కల లో పాట ట్యూన్స్ అన్నీ బాగుంటాయి.


రంగారావు గారు, సూర్యకాంతం గారి జంట ఎంత సహజంగా వుంటాయో, రేలంగి సూర్య కాంతమ్మ

జంట కూడా అలాగే నవ్వులు పండిస్తాయి. ఇద్దరు మిత్రులలో ఓహో ఇంటి ఇల్లాలా ఆని పిలవటం

చుట్ట కు నిప్పు తెమ్మని అడగటం , చదువుకున్న అమ్మాయిల్లో వాళ్ళు ఇద్దరి మధ్యలో ఒక పాట


ఆత్మ గౌరవం లో కూడా మాట చెల్ల లేదని బావి లో దూ కటం సగటు మధ్య తరగతి మెంటాలిటీ ని

చూపిస్తుంది.

మాంగళ్య బలం లో, ఎస్ వి రంగారావు గారు , సూర్యకాంతం జంట , మీరు మీరు ఒకటేగా ,

నేనే గా పరాయి దాన్ని అంటూ సినిమా చివరి దాకా సాధింపులు చాలా సహజము గా

వుంటాయి.

దొంగ రాముడు , తోడి కోడళ్ళు, కూడా రేలంగి , సూర్య కాంతం జంట నవ్వులు పూయిస్తాయి.

అన్నపూర్ణ వారి సినిమాల్లో ఏదో ఒక దేశ భక్తి గీతం , లేదా ఏదో ఒక సమాజానికి

పనికి వచ్చే పాట వుంటాయి. కానీ ఈ కొత్త సినిమాల్లో అవీ లేవు

టీ వి లో వచ్చేటప్పుడు తీసి వేశారేమో తెలియదు.

ఆత్మీయులు కూడా సులోచన రాణి గారి కధ ట, కధలో చాలా మలుపులు వున్నాయి ఈ సినిమా కూడా

టీ వీ లోనే చూసినట్లు గుర్తు.

వాణిశ్రీ , చాలా హుషారుగా నటించిన సినిమా పాటలు కూడా బాగుంటాయి.

స్వాగతం చిలిపి కన్నుల శ్రీవారు , ఓ చేమంతి ఏమిటే ఈ వింత, కళ్ల లో పెళ్లి పందిరి సాలూరి వారి సంగీతం లో

ఉర్రుత లుగిస్తూ హుషారుగా వుంటాయి.

వీణ పాట మదిలో వీణలు మ్రో గే మాత్రమే చందమామ పూల తీగల మధ్యలో, మిగతావి అన్నీ అవుట్ డోర్ పాటలు

ఈ పాట దాశరధి గారి సాహిత్యం.


నమ్మిన బంటు శంబు ఫిలిమ్స్ సినిమా మా వూరి దగ్గర గా వున్న కారంచేడు లో ఎడ్ల పందాలు

షూటింగ్ చేసారు అని చాలా చెప్పుకున్నారు , నాకు అయితే ఈ సినిమా చూసిన గుర్తు లేదు.

ఇప్పుడు యూ ట్యూబ్ లో వున్నది. పాటలు కూడా మరలా ఎక్కడా వినలేదు.


నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రైజ్ కూడా వచ్చిందిట. పాటలు నాకు అంతగా గుర్తు లేవు .


ఆరాధన, సిరి సంపదలు లో మంచి పాటలు వున్నాయి. కథ కూడా పూర్వం రోజుల్లో జమిందారులు,

ఆస్తి పరులు , కొత్త పద్దతుల కు అలవాటు పడ లేక, డబ్బు ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటే ,

రమణా రెడ్డి లాంటి ఇంటిదొంగలు, ఆస్తి కాజేయాలనీ చూసే రాజనాల లాంటి వాళ్ళు

ఏదో దగ్గర బంధువులు ఇళ్ల ల్లో చూసే సమస్యలు లాగా వుంటుంది.


యూ ట్యూబ్ లో ఎప్పుడు చూసినా గుమ్మడి ని చూస్తూ ఉంటే ఏదో సొంత వాళ్ళని చూసినట్లే వుంటుంది

పద్మశ్రీ వారి సినిమా , వేణు గారి సంగీతం .


అక్కా చెల్లళ్ళు పాడుకునే వేణు గానమ్ము వినిపించేనే చక్కటి మరీ మరీ వినాలి అనిపించే పాట.


ఈ పగలు రేయిగా, ఎందుకో సిగ్గెందుకో , సావిత్రి నాగేశ్వరావు ముచ్చట గా పాడిన పాటలు హాయిగా వుంటాయి.

పువ్వు నవ్వేను, గుడి లో దేవుని గంటలు విషాద గీతాలు జానకి, సుశీల గార్లు చక్కగా పాడారు.


డిటేక్టివ్ నవలలు చదువుతూ , రహస్యం చేధించే పాత్ర లో రేలంగి, బాల సరస్వతి హాస్యం , సూర్య కాంతమ్మ నగలు

వంటి నిండా అలకరించుకుని అర్థరాత్రి పూట తిరగడం చాలా నేచరల్ గా వుంటాయి.

చక్కటి సినిమా, ఎక్కడా విసుగు రాదు


ప్రాణ మిత్రులు కూడా పద్మ శ్రీ వాళ్ళ సినిమా , ఏదో ఇంగ్లీష్ సినిమా కథ ట, అంతగా హిట్ అయినట్లు కనిపించదు.


ఎన్నో సినిమాలు వున్నా మంచి మనసులు , మూగ మనసులు రెండూ ఆ రోజుల్లో గొప్పగా హిట్ అయిన

సినిమాలు .

మంచి మనసులు అన్నీ పాటలు చక్కటి పాటలు , కే వి మహదేవన్ గారి సంగీతం , డ్యూయెట్లు హుషారుగా వుంటాయి. ముఖ్యం గా చెప్పుకోవాల్సిన పాట హంపి ని చూపిస్తూ ఆత్రేయ గారు రాసి ఘంటసాల గారు

పాడిన పాట కృష్ణ దేవ రాయల వైభోగం వర్ణిస్తూ , వింటూ ఉంటే మనసు పులకిస్తుంది.


ఈ సినిమా కి బాపు గారు advertisement కి కార్టూన్ లు వేసారుట ,

ఏమండోయ్ శ్రీవారు ఈ రోజు సినిమా అంటూ

మూగ మనసులు సినిమా గురించి మూడు ముక్కల్లో చెప్పుకోలేము . ఇంకోరోజు చెప్పుకుందాం.


సుమంగళి సినిమా లో కూడా మంచి పాటలు వున్నా ఆ కథ ఎందుకో తెలుగు వాళ్లకు నచ్చలేదు.

కొత్త పెళ్లి కూతురా రా అనే పాట మాత్రం ఇప్పటికీ పెళ్లిళ్ళ లో వినిపిస్తూ వుంటుంది.


శుభరాత్రి మంచి పాటలు వినండి మనసుకు ఆనందంగా వుంటుంది.

























 
 
 

Recent Posts

See All
అన్నపూర్ణ వారి ఆణి ముత్యాలు 2

ఈ పాత సినిమాలు గురించి ఎంత రాసినా తృప్తి ఉండదు. కొన్ని సినిమాలు ఇప్పుడు చూస్తే కొంచెం సాగ తీత గా వున్నా కొన్ని పాట లు ఎప్పుడు విన్నా కొత్తగా , వీనుల విందుగా వుంటాయి. అర్దాంగి లో హరిద

 
 
 
అన్నపూర్ణ వారి ఆణి ముత్యాలు.

ఈ రోజు యూ ట్యూబ్ లో ఏదో వెతుకుతూ ఉంటే శిరీష కొమ్మరాజు గారు పాడిన వినిపించ ని రాగాలే పాట వచ్చింది. ఆవిడ ఎక్కువ గా పాత పాట లు పాడుతూ వుంటారు . ఆ పాట కూడా చాలా హాయిగా పిల్ల తెమ్మర లాగ

 
 
 
శ్రీ రామ నవమి

ఈ రోజు రామ నవమి శుభాకాంక్షలు. రాముల వారి కళ్యాణం పుట్టిన రోజు నాడే జరుగుతుంది.. పూర్వం తాటాకు పందిర్లు వేసి వీధి వీధికి కళ్యాణం చేసే వారు. వారం రోజులు ఉత్సవాలు ఘ నంగా జరిపే వారు.. ఇప్

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page