top of page
Search

మధుర గీతాలు సుమన్ కళ్యాణ్ పూర్

  • murthydeviv
  • 7 minutes ago
  • 3 min read

సుమన్ కళ్యాణ్ పూర్ అనుకోగానే నతుమే హమే జానే ,పాట గుర్తు వస్తుంది. ప్యాసే పంచి లో తుమహీ మేరీ మీత్ హో

అనే పాట హేమంత్ కుమార్ గారితో ఆ రెండు పాటలు ఆవిడ పాడారు అనే గుర్తు వుంది.

ముందుగా మనకు తెల్సిన సింగర్స్ ఒక్కొక్కళ్ళు వెళ్లి పోతూ ఉంటే ఏదో భాధ గా వుంటుంది, వాళ్ళని ఆ మధురమైన

పాటలు నీ కాసేపు తలచుకుందాము అనిపించింది.


మన కాలేజీ రోజుల్లో సినిమా కన్నా హిందీ పాటలు ముందుగా రేడియో లో వినే వాళ్లము. ఆలా పాటలు బాగుంటే

ఆ సినిమా ఎప్పుడో మన ఊరు వస్తే చూసే వాళ్లము. హిందీ సినిమా లు జెనరల్ గా ఒక వారం కంటే ఉండేవి కాదు.


ఆలా బాత్ ఏక్ రాత్ కి సినిమా ఆ పాట కోసం కాలేజీ ఎగొట్టి మాట్నీ షో కి వెళ్లి , సినిమా గొప్పగా లేక పోయినా పాటలు, దేవానంద్ ఆ రోజుల్లో అమ్మాయిల ఫేవరెట్ కదా, సరే పక్కన వహీదా నీ చూసి ఆనందించి డబ్బులు వేస్ట్ కాదులే అనుకున్నాము.


పాటలు వినటం మంచి పాట , మనం నేర్చుకోగలం అనుకుంటే ఎలాగో నేర్చుకునే వాళ్ళము. ఆలా ఈ నతుమ్ హమే జానే పాట నేర్చుకుని కాలేజీ లో కూడా పాడినట్లు గుర్తు.


ప్యాసే పంచి అనే సినిమా లో రెండు పాటలు అలాగే నేను మా కజిన్ నేర్చుకున్నాము. తుమ్హి హీ మేరీ మీత్ హో ,

ప్యాసే పంచి, మొదటి పాట హేమంత్ కుమార్ గారు, సుమన్ కళ్యాణ్ పూర్ పాడారు .

ప్యాసే పంచి అనే పాట ముకేశ్ గారు పాడారు. ఆ రోజుల్లో ఆ సినిమా చూడ లేదు, ఇప్పుడు యూ ట్యూబ్ లో ఆ

పాటపాడింది మెహమూద్ అనీ చూస్తే ఏమిటో నచ్చదు. కానీ పాట బాగుంటుంది.


సుమన్ కళ్యాణ్ గారు కన్నడ వాళ్లే అయినా డా ఖా లో పుట్టి పెరిగారుట..

బొంబాయి వచ్చాక క్లాసికల్ సంగీతం నేర్చుకుని కొన్ని రేడియో ప్రోగ్రాం లు చేశా రుట

ఆవిడ చిత్ర లేఖనం లో ఇంటరెస్ట్ వుండి జే జే స్కూలు అఫ్ ఆర్ట్స్ లో కూడా శిక్షణ తీసుకున్నారు ట.

మొదట గా మరాఠి చిత్రాల్లో పాడిన తర్వాత హిందీ చిత్రాల్లోకి వచ్చారుట.

సుమన్ గారు మొదట చిత్రం మంగు అనే హిందీ సినిమా లో వో పి నయర్ మ్యూజిక్

అందులో మూడు పాటలు రికార్డు చేసినా ఒకటే ఉంచారుట. అదీ లాలీ పాట.


మమతా సినిమా నా కు చాలా ఇష్టం అందులో రెహనే రహే హమ్ పాట పాడింది సుమన్ కళ్యాణ్ గారు

నేను ఎప్పుడు ఆ పాట వింటూ వుంటాను. అయితే రఫీ గారితో పాడే పాట సుమన్ గారు పాడారు.

సుచిత్ర సేన్ ముందుగా పాడిన పాట లతా గారు పాడారుట


ఆర్ పార్ లో మొహబ్బాత్ కర్లో పాట లో కూడా సుమన్ గారి వాయిస్ ఉందిట.

.

ఆవిడ పాట ఒకటి పాఖిజా సినిమాలో కూడా ఉందిట మీనా కుమారికి అయితే ఆ పాట సినిమాలో వుందో లేదో, సినిమా చూసి చాలా ఏళ్లు అయింది.. ఈ రోజే యూ ట్యూబ్ లో విన్నాను.

బహుశా మీనా కుమారి మొదటి పోర్షన్ కి అయివుండవచ్చు , గీర్ గయి రే మేరె మాతి కి భిందియా


ఎంతో జాగ్రత్తగా వింటే కానీ లతా గారి టోన్ కి సుమన్ గారి టోన్ కి తేడా కనుక్కోలేము.


చక్కటి టోన్ తో , హుషారుగా పాడే పాటలు ఎంత బాగుంటాయో , క్లాసికల్ టచ్ వున్న పాటలు, విషాద గీతాలు అంతే

వీనుల విందు గా వుంటాయి.

అన్నట్లు సుమన్ గారు కూడా గీతా గారి లాగా బులో, సీ రానో మ్యూజిక్ లో పాడారుట..


మన్నాడే గారి తో , నజా నే కహా తుంసే పాట కూడా బాగుంటుంది. ముకేశ్ గారితో సుమన్ గారివి చాలా పాటలు వున్నాయి. ఈ మౌసమ్ రంగీన్ షామా మోడరన్ గర్ల్ సినిమా లో , మెరా ప్యార్ భి తూ హై షాతి సినిమా లో బాగా ఫేమస్ అయింది.. హిట్ పరేడ్ లో కూడా నడిచిందేమో అనుకుంటా.

ఏ మౌసమి రంగిన్ షామా కూడా బినాక హిట్ పరేడ్ లో నడిచిందిట.


మేరె మెహబూబ్ నా జా , నూర్ మహల్ సినిమా లో, సాంజ్ ఔర్ సవేరా లో కూడా మంచి పాటలు వున్నాయి.

మన్ మోహన మన్ మే , రఫీ గారి తో హిందూస్తాని క్లాసికల్ పాట చాలా మధురం గా వుంటుంది .

కైసే కహూన్ అనే సినిమా ట , ఎప్పుడు పేరు విన లేదు. పాట అయితే చాలా బాగుంది. యూ ట్యూబ్ లో వుంది.


ఇంకో స్లో గా సాగే మెలోడీ రఫీ గారితో పర్వోతో కే పేడోమ్ పర్ షాగూన్ సినిమా ట. సుమన్ గారు రఫీ గారితో చాలా డ్యూయెట్స్ పాడారు. ముకేశ్ గారితో మంచి పాటలు చాలా వున్నాయి.


నానా కర్తె ప్యార్ తుమిసే కర్ బై టె నందా ఎంత హుషారు గా డాన్స్ చేసిందో పాట కూడా సుమన్ అలాగే పాడారు.

అలాంటి పాట ఇంకొకటి అజ్ కల్ చర్చే హర్ జాబాన్ పర్ చాలా స్పీడ్ మ్యూజిక్ , డాన్స్ ముంతాజ్ అనుకుంటా ను.

ఈ తరానికి తగ్గ పాటలు అయినా హుశారుగా వుంటాయి.


ఆవిడ మంగేష్కర్ సిస్టర్స్ కి ఏ మాత్రం తీసిపోని పాటలు పాడారు. చాలా స్వీట్ వాయిస్ కానీ రావాల్సినంత పేరు రాలేదు అనుకుంటాను.


సుమన్ గారి మృతి తో ఒక యుగం సమాప్తి అయిపోయింది. ఇప్పుడు వచ్చే సినిమా ల్లో పాటలు విన్నదీ తక్కువే,

పాడే వాళ్ల పేర్లు తెలియవు.

నాకు తెల్సిన పాటలు సినిమాలు పేర్లు రాసాను కొన్ని తప్పు ఉన్నాయేమో తెలియదు.

ఏమైయినా ఉంటే కరెక్ట్ చేయండి.


శుభరాత్రి ఇంకా కొన్ని కబుర్లతో మరలా కలుద్దాం.







 
 
 

Recent Posts

See All
సముద్రపు గాలి

ఈ రోజు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కాఫీ తాగుతూ ఉంటే రాత్రి కాస్త చినుకులు పడ్డాయేమో చల్లటి గాలి పలకరించింది. . ఈ హైదరాబాద్ ఎండలకు ఇరవై నాలుగు గంటలూ కూలర్ , ఫ్యాన్ లు తిరుగుత

 
 
 
హృషీ దా

జయ భా దురి మొదటి సినిమా గుడ్డీ సినిమా జ్ఞాపకం వున్న వాళ్ళ కి హృషికేష్ ముఖర్జీ తెలిసే వుంటారు. రెగ్యులర్ సినిమా లా కాకుండా , సున్నితమైన హాస్యం తో,మనసుకు ఆహ్లాదంగా సినిమాలు తీయ టం ల

 
 
 
నా హాలీవుడ్ యాత్ర

ఇంగ్లీష్ వింగ్లీ ష్ ఆ సినిమాలో శ్రీదేవి ని చూసినట్టే నా మనవ రాళ్లు కూడా నాకు ఇంగ్లీష్ రాదు అర్థం కాదు అనుకుంటారు. మీకు ఇంగ్లీష్ ఒక్కటే వచ్చు , నాకు మూడు భాషలు వచ్చు , అనీ వాళ్ళ

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page