top of page
Search

కుకింగ్ గాడజెట్స్

  • murthydeviv
  • 3 days ago
  • 4 min read

పండగ ముందు పేపర్ చూస్తున్నా, పేస్ బుక్ చూస్తున్నా రకరకాలుగా వంట సామాన్లు , సోఫా లు, మంచాలు,

డైనింగ్ టేబుల్ ఎన్నిరకాల ప్రకటనలో , చక్కటి ఫోటోలు తో చూడ ముచ్చట గా వుంటాయి.


కూరలు కట్ చేయటానికి, ఉల్లిపాయ లు గార్లిక్ , కోతిమేర సన్నగా కట్ చేయటానికి, ఒకటే ఏమిటీ ఎన్ని రకాలో

ఇన్నీ వున్నా , వంట లు చేస్తారో లేదో తెలియదు. ఏ హోటల్ కి వెళ్లినా కిట కిట లాడుతూ వుంటాయి.


మొన్నా మధ్య శనివారం నాడు పిల్లలు సరదా పడుతూ దగ్గర లో ఏదో ఛాట్ భండా ర్ నన్ను కూడా లాక్కుని

వెళ్లారు. అక్కడ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ లాగా కారు లో కూర్చుని తినటమే. కానీ కారు పార్క్ చేయటానికి స్థలం లేదు.

అంత రష్ గా వుంది.


శుక్రవారం రాత్రి నుండే మా ఇంటి చుట్టూ వుండే హోటల్స్ కి వచ్చే వాళ్లతో రోడ్లు అన్నీ కార్ల తో నిండి వుంటాయి.


ఆ హోటల్స్ లోనే అంత రష్ ఉంటే ఈ ఛాట్ భాండర్ కి రష్ ఉండటం లో ఆశ్చర్యం ఏముందిలే అనుకున్నాel

ఏ మాల్ కి వెళ్లినా కిచెన్ గాడ్జిట్స్ రకరకాలుగా అమర్చి పెట్టి వుంటాయి.

ఈ మధ్య లో గ్యాస్ కొరత అనీ రకరకాలుగా ఎలక్ట్రిక్ స్టవ్లు, అవీ కూడా అడ్వర్టిజ్ చేస్తున్నారు.


ఈ రోజు ఉదయం పేస్ బుక్ లో పాత కాలం లో వంటలు కి వాడిన కట్టెలు, కుంపట్లు , పొట్టు పొయ్యిలు గురించి రాశారు.


అదీ చదవ గానే ఒక్కసారి ఏభై ఏళ్ల క్రితం మన చిన్న తనం రోజులు గుర్తు కి వచ్చాయి. నాకు అయితే

మా ఇంట్లో వంటింట్లో వున్న పొయ్యి చూసిన గుర్తు లేదు .

ఆ రోజుల్లో ఇంట్లో వాళ్ళు కంటే వంట చేసే వంట బామ్మగార్లకు ఎక్కువగా ఆచారం , పట్టింపు ఉండేది.


మా చిన్న నాయనమ్మ తో పాటు ఇద్దరు ముగ్గురు వంటకు,ఇంక ఏవో పై పనులు కి ఉండేవారు.

బావిలో నీళ్లు తేవటానికి, ఇడ్లీ, దోశ పప్పు రుబ్బటం అలాంటి పనులు చేసే వాళ్ళు.


కానీ వాళ్ళు కూడా పిల్లలు స్కూలు గుడ్డలు తో అన్నీ ముట్టుకుంటామని అసలు దగ్గరికే రానిచ్చే వారు కాదు

ఉదయం తొమ్మిది పది గంటల మధ్యలోనే మేము భోజనం చేసి , ఇంకా లంచికి ఏవో పట్టుకెళ్ళ వాళ్లము.

ఉదయం పూట అమ్మ గారు టిఫిన్లు , కాఫీలు వంటింటి పక్కన వున్న వేరే గది లో చేసే వారు.


ఆ గది పేరు చద్దన్నా ల గది అనే వారు. స్కూలు కి వెళ్ళే వాళ్ళు ఉదయం ఆవకాయ గోంగూరపచ్చడి

వేసుకుని తినే వాళ్ళు. తినేది వేడి అన్నం అయినా ఆ గది పేరు మాత్రం చద్దా న్నాల గది అనే వాళ్లము.


అక్కడ ఒక పొయ్యి కూడా ఉండేది. అమ్మ గారు మధ్యాహ్నం పూట ఆ పొయ్యి మీదే రకరకాల పిండి వంటలు

ఈ అసిస్టెంట్ వంట బామ్మ గార్ల సహాయం తో చే స్తూ ఉండేది.


ఇవ్వన్నీ చేయటానికి ఎక్కువగా కట్టెలు వాడుతూ ఉండేవారు. ఆ కట్టెలు గనక కొంచెం పచ్చిగా ఉంటే ఒకటే పొగ

ఇంక ఆ రోజు

వంట బామ్మగార్లు ఎంతో చి కాకు గా వుండే వాళ్ళు

నిజమే కదా , ఇంత మందికి వంట చేయాలి ఈ పొయ్యిల మీద

అవీ రుచిగా లేకపోతే అందరూ వంకలు పెడతారు కదా .

ఆ రోజుల్లో కొన్ని బావుల్లో నీళ్లతో కంది పప్పు వుడికేది కాదుట . ఆ పప్పు లో పొసే నీళ్లు కొన్ని బావుల్లోనే వుంటాయి.

ఆ బావుల దగ్గర నుండీ నీళ్లు తేవాల్సి వచ్చేది. పప్పు సరిగ్గా ఉడకక పొతే ఆ నీళ్లు తెచ్చే వాళ్లకి ఆ పూట ఒక క్లాసు ఉండేది.

ఇన్నీ రకాల వంటలు పచ్చడి తో సహ ఉదయం పది గంటలకు పూర్తి చేయాలి , ఆందరికీ వడ్డీంచాలి.


ఆ రోజుల్లో రోజూ పూజ చేసే బ్రాహ్మణు డు తో సహా అందరూ భోజనం చేసే వారు. వీళ్ళే కాకుండా

చదువుకునే కొంతమంది పేద విద్యార్థులు కి తాత గారు భోజనం పెట్టమనే వారు .


ఉదయం పూట ఆ బామ్మ గార్లు అందరూ మడి తో నే భోజనం చేసే వారు. అందువలన ఆందరికీ వాళ్లే

వడ్డించే వారు.


ఇప్పుడు తలచుకుంటే పాపం వాళ్ళు ఈ వంటలు ఎంత కష్ట పడి చేసే వాళ్ళు, మనకు అవేమి తెలియవు కదా

హాయిగా తిని తిరిగే వాళ్లము అనిపిస్తోంది.

ఇప్ప్పుడు మా కుక్ ని కాకరకాయ వేపుడు చేయ మంటె మొహం అంతా జీరో కాండిల్ బల్బ్ లాగా అయిపోతుందివాళ్ళు అరోజుల్లో ఉదయాన్నే కనీసం ఒక రెండు కిలోలు దాకా వంకాయలు, కాకరకాయ లు వేయిస్తూ ఉండేవారు .


సాయంత్రం పూట దోశల పిండి, ఇడ్లీ పిండ్లు రుబ్బ ట మే కాక రోజూ కంది పచ్చడో , సెనగ పచ్చడో

రుబ్బే వాళ్ళు.


ఇలా వాళ్ళు ఆరోజుల్లో చేసిన సర్వీస్ తలుచుకుని ఒక నమస్కారం పెట్టుకుంటాను.

విశేషం ఏమిటీ ఆంటే వాళ్ళని మనం ఇంట్లో మనుషుల్లా గా చూసే వాళ్లము.

వాళ్ళు కూడా మా చిన్న నానమ్మ తో సొంత అక్క చెల్లళ్ళ లాగా వుండే వారు , అమ్మగారిని అంత ప్రేమ గా చూసే వాళ్ళు.

ఇంక మా మేనత్త గారింట్లో ఒక తమిళ్ వంట మనిషి వుండే వాడు. నాకు బావర్చి లో రాజేష్ ఖ న్నా ని

చూస్తే అతనే గుర్తు వస్తాడు.


అయితే చాలా సీరియస్ గా వుండే వాడు , మేము అతన్ని చూసి మేము భయ పడే వాళ్లము.


కానీ అతను ఎంత వంట అయినా ఎంత బాగా, ఎంత తొందరగా చేసే వాడు ఆంటే ఏదయినా మేజిక్ వచ్చు ఎమో

అనిపించేది.


ఉదయం పూట అతను చేసే బ్రేక్ఫాస్ట్ ల్లో పెసరట్టు రుచి ఇప్పటికీ మర్చిపోలేను . మేనత్త గారింట్లో ఉదయం టిఫిన్

మధ్యా హ్నం భోజనం వంట అతనే చేసే వాడు ఇంత వంట , అతను పొయ్యి మీదే చేసే వాడు.

రకరకాలుగా తమిళ్ వంటలు, బంగాళాదుంప ఛిప్స్ ఇప్పుడు హాట్ చిప్స్ లో దొరికే చిప్స్ లాగా చేసే వాడు.


ఇంక మా అమ్మమ్మ గారింట్లో అయితే అక్కడ మాకు జరిగిన గారాబం గుర్తు వస్తే అబ్బా ఆ రోజులు ఎంత బాగున్నాయి అనిపిస్తుంది. అక్కడ కట్టెలే కాకుండా ఏదో చొప్ప కట్టె అనీ ఏదో పొయ్యి లో పెట్టే వారు . ఒకటే పొగ వచ్చేది ముఖ్యం గా

బాత్ రూమ్ దగ్గర , అయినా అవీ ఆ పోయ్యిలో పెట్టటం సరదాగా ఉండేది.


ఆ ఊర్లో బావుల్లో నీళ్లు చాలా కిందికి ఉండేవి. నీళ్లు తోడటానికి గిలక మీద తాడు వేసి బకెట్ తో పైకి లాగాలి .


ఆ బావుల్లో నీళ్లు తోడటం చాలా సరదాగా ఉండేది. ఆ వంట బామ్మ గారితో మేము చిన్న బిందెలు తో తయారు

అయ్యేవాళ్ళము .


అమ్మమ్మ వాళ్ళు వద్దు అన్నా సరే మా సరదా మాది. తాత గారికి వూరికి దగ్గర గా వున్న పొలం లో దోస కాయల పొలం ఉండేది. ఆ దోసకాయ ల తో రకరకాలుగా వంటలే కాకుండా అవీ ముక్కలుగా తరిగి వరుగుల్లగా

ఎండ పెట్టేవారు.


ఆ వరుగులు తో ఆ వంట బామ్మగారు పులుసు, కూర చేసేవారు.. వాటిని వడియాలు లాగా వేయించి ఉప్పు కారం

చల్లే వారు. చాలా రుచిగా ఉండేవి.. ఆ బామ్మ గారు చేసే కరివేపాకు పొడి కూడా చాలా బాగా చేసేవారు.


మేము వెళ్లి నపుడల్లా కుంపటి మీద బంగాళాదుంప కూర చేసే వారు , ఎంత రుచిగా ఉండేదో..

బహుశా కుంపటి మీద స్లో కుకింగ్ వల్ల నేమో.


పొట్టుపొయ్యి మా అక్కయ్య గారి ఇంట్లో చూసాను. కానీ ఆ పొట్టు కూరటం కష్ట ము కానీ

వంట త్వరగా అవుతుందిట.


ఇన్నీ రకాల కుంపట్లు పొయ్యిలు చూసినా నేను దేని మీద వంట చేయలేదు. కుంపటి మీద కాఫీ మాత్రం వెచ్చ పెట్టేదాన్ని


మా నాన్న గారు హైదరాబాద్ లో మా కజిన్ ఇంట్లో గ్యాస్ స్టవ్ చూసి చాలా ముచ్చట పడి మాకు వచ్చి చెప్పారు

కానీ అరోజుల్లో గ్యాస్ స్టవ్ బుక్ చేస్తే గాని దొరికేది కాదు.


మేము పంజాబ్ వెళ్ళినప్పుడు కూడా గ్యాస్ దొరికేది కాదు. అక్కడ కిరోసిన్ స్టవ్ మీద వంట


అక్కడ కొత్త గా చూసింది ఛు లా అనీ రాక్షసి బొగ్గు తో పొయ్యి చూసాను . అదీ అయితే ఒక బకెట్ లాగా

ఉండేది. వాళ్ళు దాన్లోనే వంట అంతా చేయటమే కాకుండా , చలి కాలము లో ఒక హీటర్ లాగా కూడా

ఉపయోగించే వారు.


ఇంకొక విశేషం గోడ లోనే ఒక గూడు లాంటి దాన్లో పిడకలు వేసి దాన్లో ఒక కుండ లో పాలు కాగపెట్టేవారు

ఎర్రగా కాగి చిక్కగా మీగడ కట్టేది. దాన్ని దాలి అంటారుట.

నేను ఆ పొయ్యి అక్కడే మొదటి సారి చూసాను. మావారు మాత్రం పల్లెటూరు పెరిగారు కాబట్టి అక్కడ చూసారుట.

ఒక్క రధ సప్తమి నాడు నాయనమ్మ పిడకల మీద పరమాన్నం చేయటం చూసాను.


మా ఆబ్బాయి రెండు ఏళ్ల క్రితం మా పల్లెటూరు వెళ్లి రెండు రోజులు వున్నాడు. అక్కడ బంధువులు ఇంట్లో దోస కాయ, గగోంగూర పప్పు తిని , మన ఇంట్లో ఆ రుచి రాదే అనీ అడిగాడు.


ఆది స్లోకుకింగ్ మహిమ రా నాయనా , మనం ఇప్పుడు జెట్ యుగం లో వున్నాము కదా అనీ చెప్పాను..

బ్లాగ్ లో ఇవ్వన్నీ రాయటంలో నా ఉద్దేశ్యం అరోజుల్లో వంటలు ఎలా చేసే వారో చెప్పటమే.


మన చిన్న తనంలో మనకు అంత రుచిగా, శుచి గా , ఓపికగా వండి వడ్డీంచిన వాళ్ళని తలుచుకుని .

వాళ్లకి మనం ఇప్పుడైనా కొంత కృ త జ్ఞ త లు చెప్పుకుందాం అనీ .


ఇప్పుడు ఇన్నీ కిచెన్ గాడజెట్స్ వున్నా వంటలు చేయటం మాత్రం తగ్గి పోతున్నది.

ఆ హోటల్స్ ఆ రష్ చూస్తే అసలు వంట చేస్తున్నారా అనుకుంటాను.


మళ్ళీ ఇంకా కొన్ని కబుర్లు తో ఇంకొక సారి

శుభ రాత్రి


















































 
 
 

Recent Posts

See All
ఫోటో షూట్

ఇదివరకు అయితే ఈ మాట ఎవరైనా ఆంటే ఏమిటో అనుకునే వాళ్ళము. ఇప్పుడు అయితే ఈ మాట సాధారణం అయిపోయింది. మొన్న మాకు తెలిసిన వాళ్ళు పెళ్ళికి పిలవటానికి వచ్చారు. వాళ్ళ అమ్మాయి ఏదో కంపెనీ లో మ

 
 
 
నా లైబ్రరీ 2

నా సో త్కర్ష తో మిమ్మల్ని బోర్ కొట్టిస్తూ ఉన్నానేమో , కానీ కొన్ని పుస్తకాలు చదివాక మన దృక్పధం లో చాలా మార్పులు వస్తూ వుంటాయి. అలాంటి పుస్తకాలు లో మొదట జగద్గురు బోధలు , క

 
 
 
నా లైబ్రరీ

చిన్నపుడు ఎలా అలవాటు ఆయిందో తెలియదు, పుస్తకాలు చదవటం , పుస్తకాల పురుగు అనే వాళ్లు ఆ రోజుల్లో చందమామ, బాల మిత్ర, తో మొదలు అయ్యి , అన్నయ్య తో డిటెక్టివ్ నవలలు అలవాటు అయ్యాయి..

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page