top of page
Search

నవ రాత్రుల లో ఆమ్మ వారి పాటలు

murthydeviv
4 days ago
2 min read

నవరాత్రుల సందర్భంగా పాతకాలంలో సినిమా లలో ఉన్న అమ్మవారి పాటలు గుర్తు చేసుకుందాము .

కొన్ని పాటలు ఇప్పటికీ రోజూ పూజ అయ్యాక పాడు కుంటూ ఉంటాను.


జననీ శివ కామినీ అందరికీ తెలిసిన పాట .జయ మంగళ గౌరీ దేవీ ముద్దుబిడ్డ అను కుంటా సినిమా పేర్లు అంతగా గుర్తు లేకపోయినా. పాటలు బాగా గుర్తు ఉన్నాయి


జగదేక వీరుడి కథలో శివ శంకరీ. చక్కటి పాట ఆ సినిమాలో నే ఇంకొక పాట కూడా అమ్మవారిని వేడుకునే పాట ఇంకొకటి వున్నద

రుషేంద్ర మణి పాడిన పాట . అంతగా గుర్తు లేదు కానీ చాలా మంచి పాట


ఇంకా రహస్యం సినిమాలో. లలిత భావ నిలయా, శ్రీ లలితా శివ జ్యోతి , మల్లాది గారు రాసినవి. ఎంత చక్కటి పాటలు అంటే ఎప్పుడు విన్నా , పాడినా తనతో పాటు. మనకు కూడా. అమ్మవారి

దర్శనం చేయించారు శాస్త్రి గారు. అనిపిస్తుంది .


అందులో యక్ష గానం గిరిజా కళ్యాణం కూడా వింటూనే ఆనందం కలుగుతుంది .


చాలా పాత సినిమా గుణ సుందరి కథ లో. కల్పకం అమ్మవారి మీద చక్కటి పాట వున్నది

మా చిన్న తనంలో. అమ్మ గారు అత్తయ్య లు పాడే వారు అలా

మా పాటల పుస్తకం లో చేరి పోయింది

సినిమా పాట అని కూడా తెలియదు .a సినిమాలో నే

తులసి దేవి మీద పాట , అదే కాక ఉపకార గుణాలయవై ఉన్నావు

కదే మాతా అనే. పాట ఎంత చక్కటి సాహిత్యం మనుషుల్లో ఉండే అహంకారం నీ అణిచి వేయమని ప్రార్థన .


కల్పక మ. తల్లివై ఘనత వెలసిన గౌరీ కళ్యాణ హారతి కి

కళ వు నీవే దేవి. ఇలవేల్పువై వుంటివే. ఇల్లె ల. శుభ కళల

దీ వింపవే అని. ప్రార్ధిస్తూ. పెద్ద ముత్తైదువ. గా. పేరంటానికి వచ్చి

శుభము గా దీవిం చ వే అని ప్రార్థన. ఎంత చక్కటి భావన .

ఇప్పుడే గూగుల్ గారు చెప్పారు పింగళి గారు రాసారు .

ఓగిరా ల. రామచంద్ర రావు గారి అద్దె పల్లి రామారావు గారు సంగీతం అందించారుట నేను ఈ టీ వీ లో.

గుణసుందరి. సినిమా చూసినప్పుడే అవి సినిమా పాటలు అని తెలిసింది

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయా మం. గౌరీ. సప్త పది సినిమా లో. అమరావతి. అమ్మవారు బాల చాముండేశ్వరి మీద రాసింది చక్కటి పాట .


శ్రీ పార్వతి దేవీ చేకోవే శై ల కుమారి, మా పూజలే తల్లీ, మంగళ గౌరీ మహేశ్వరీ మది శారద దేవీ మందిరమే

జయమీయవే జగదీశ్వ రీ కావ్య గా న కళా సాగరీ .

సీతారామ కళ్యాణం సినిమా లో సీతా రామ కళ్యాణం అనే అజరా మరమైన పాటతో పాటు

ఆమ్మ వారి మీద కూడా పాట వున్నది , జగదేక మాతా గౌరీ భవాని కరుణించవే అనే పాట కూడా బాగుంటుంది .

మండో దరి పాడ్తుంది కాబట్టి లంకా పతిని కరుణించి బ్రోవ మంటుంది . ఆ చరణం వదిలేస్తే మంచి పాట

ఇలా గుర్తు చేసుకుంటే ఏన్నో మంచి పాటలు విన వచ్చు , నేర్చుకో వచ్చు .


కాళహస్తి మహత్యం లో. మధురం. శివ మంత్రం మహేష పాప వినాశ

కూడా చక్కటి పాట .

నాగుల చవితి పాట సినిమా నాకు అంతగా గుర్తు లేదు కానీ

శివుడి మీద పాట మేము శివ రాత్రి రోజు పాడే వాళ్ళము

ఇంకా భుకైలాస్ , చెంచులక్ష్మి లొ కూడా భక్తి పాటలు

చాలా ఉండేవి .


పాత సినిమాల్లో ఇలాంటి పాటలు ఎన్నో ఉండేవి .

ఇంకో పండగ కు. ఇంకా కొన్ని పాటలు గుర్తు చేసుకుందాము .


ఈ పాటలు అన్ని యూ ట్యూబ్ లో ఉన్నాయి .

ఇప్పుడు మంచి సినిమా లేదు సరే ఇంక పాటలా అంటే

 
 
 

Recent Posts

See All
తిధి నిత్యా దేవతలు

ప్రతి తిధికి ఒక దేవత ఆ దేవత కి ఒక మంత్రం ధ్యాన శ్లోకాలు వుంటాయి . ఈ విషయం దేవీ భాగవతం లో వుంటుంది. ఏవీ చదివినా ఏవో కొత్త విషయాలు తెలుస్తూ వుంటాయి. శ్రీ విద్యా ఉపాసన చేసే వారు ఈ నవ రాత

 
 
 
ఆర్యా ద్విశతి

ఆర్యాద్విశతి పూర్వకాలంలో ఆస్తికులు ఉదయం స్నానం చేయగానే ఆర్యాద్విశతిని మననం చేసేవారుట. అదే వారికి కంఠాభరణంగా వుండేది. అని చంద్రశేఖరస్వామి వారి పలుకులు. తెలుగులో శ్రీచక్ర నగర వర్ణనమే దుర్వాస మహర్షి రాసి

 
 
 
మూక పంచ శతి లో ని కొన్ని శ్లోకాలు నవరాత్రుల సందర్భంగా

నవరాత్రులు శుభాకాంక్షలు మూక పంచ శతి లోని అమ్మవారిని కొన్ని రూపాల్లో స్తుతి చేసిన శ్లోకాలు. మహానుభావులు ఎవరో గుర్తించి పలానా దేవత రూపం వర్ణించి రాసినవి అనీ నాకు చెప్పితే నేను శుక్రవారాల్లో

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page