అనగ అనగా
ఈ హెడ్డింగ్ చూసి నేను ఏదో కథ చెప్తాను అనుకోకండి , మా మనవరాలు పుట్టిన రోజు అనీ మా కొండలు దిగుతుంటే
దిగి మా అమ్మాయి యింటికి వెళ్తూ ఉంటే మధ్యలో తళ తళ లాడే లైట్స్ తో ఈ పేరు ఒక బిల్డింగ్ మీద కన్పించింది .
ఆ రోడ్డు లోనే ఒక ఇట్లు, ఒక ఐదు , ఇంకేదో అమెరికన్ పేరు తో ఇంకో రెస్టారెంట్ వున్నాయి.. ఇదేదో సినిమా ఆఫీస్ ఆనుకుని మా మనవడిని అడిగితే అదీ కొత్త రెస్టారెంట్ అమ్మమ్మా అన్నాడు. ఒకే రోడ్డు లో ఇది నాలుగోదో తర్వాత సంఖ్య దో ఆనుకున్నాను.
ఒక అరునెల ల క్రితం ఈ రోడ్డు పక్క లైన్ లోనే తెలుగు మీడియం అనే రెస్టారెంట్ కీ వెళ్ళి డాల్ మాఖాని కుల్చా లు తిని వచ్చాము. తెలుగు మీడియం లో ఈ పంజాబీ వంటలు ఏమిటో ఆనుకున్నాను.
ఈ ట్రాఫిక్ లో ఈ దుకుంటూ అర్థం కానీ తెలుగు పాటలు వింటూ కోకా పేట వెళ్ళాలి , కాస్త పాత పాట లు పెట్టండిరా అని రిక్వెస్ట్ చేస్తే సామజ వర గమనా నిను చూసి ఆగ గలనా అనే పాట పెట్టారు ..
అయ్యో త్యాగ బ్రహ్మ గారు మీరు రాసిన చక్కటి కీర్తన కు ఏమీ తిప్పలు అనుకున్నా ..
రోడ్డు కిరువైపులా వున్న ఆకాశ హా ర్మా లు చూసి ముంబై ఎందుకూ పనికి రాదు కదా ఆనుకున్నాను .
మొన్న ఎవరో ఫేస్ బుక్ లో ఈ ఏడాది నీటికి కరువు వస్తుంది , వాటర్ ఫిల్టర్ లు వాడకండి , ఫిల్టర్ వాటర్ కొనుక్కోండి
లేకపోతే గ్యాస్ మీద కాచి వాడుకోండి అని రాశారు..
గండి పేట కీ క్యాచ్ ఏరియా అయిన ఈ కోకా పేట , నార్సింగి , ఏకంగా గండి పేట కబ్జా లు చేసి ఇలా విల్లాలు ,
ఆకాశ లోకి ఇళ్ళు కడుతూ ఉంటే ఇంకా నీళ్లు ఎక్కడ వుంటాయి. ఆల్రెడీ మా జూబ్లీహిల్స్ లో రోజూ ట్యాంకులు కొనటమే .
ఏమిటో మనం బాధ పడితే ఈ ప్రపంచం మారుతుందా అనుకుంటూ పాట వినటం మొదలు పెట్టాను. రాములో రాములో అంటున్నాడు అల్లు అర్జున్ పాడేది ఎవరో నాకు తెలియదు. నా నోలెడ్జి బాలు గారి తో ఆగి పోయింది.
మా అల్లుడు గారు తమిళ్ , అందుకుని మా అమ్మాయి బొమ్మలు కొలువు పెట్టింది. ఆత్త గారి ఊరు శ్రీరంగం వెళ్ళినప్పుడల్లా రక రకాల బొమ్మలు తెస్తుంది.
అందులో కోకా పేట లో మంచి ఒరియా పని అమ్మాయి దొరికింది బొమ్మలు కొలువు చక్కగా పెట్టింది. నవ దుర్గలు,
త్యాగ బ్రహ్మ , ముత్తు స్వామి గారు , శ్యామ్ శాస్త్రి గారు , కూడా కొలువు తీరారు. ఓపికగా అన్నీ గుడుల్లో దేవుళ్ళు , ఇంకా ఏటి కొప్పాక , కొండ పల్లి బొమ్మలు అన్నీ పెట్టింది.
మనవ రాలు పుట్టిన రోజు కూడా కదా , ఏవో కొత్త ఐటమ్స్ తో పాటు మాకు మామూలు భోజనం .
మొన్న ఫ్యాక్టరీ లో ఆయుధ పూజ కీ వెళ్ళి వస్తూ ఉంటే లంచ్ కీ ఎప్పుడూ ఆగే మినర్వా హోటల్ కాకుండా
హిమాయత్ నగర్ లో మా పిల్లలు ఏదో కొత్త హోటల్ కీ తీసుకుని వెళ్లారు .
దాని పేరు మీరెల్ అనుకుంటా . నాకు ఎప్పుడూ ఒకటే మెనూ వుంటుంది సూప్, రోటి డాల్ .
ఇప్పుడు పిజ్జా కూడా పాత మెనూ అయిపోయింది. ఏమిటో అవకాడో షాట్స్ ట పానీ పూరీ లాంటి దాన్లో ఏవో పోసి చాలా అందంగా అమర్చి తెచ్చారు. తర్వాత అందరూ ఏదో సూషి అని తెప్పించారు ఏమిటీ అంటే అన్నమే రౌండ్స్ కాయిన్స్ లాగా చేసి మధ్యలో ఏవో కూరలు , అయితే అన్నీ అలంకరణ బాగా చేసారు .
అవ్వన్నీ జాపనీస్ డిష్ , వాళ్ళు, చైనా అన్నమే గా తినే ది. మన ఆవకాయ కూడా అలా రౌండ్స్ గా చేసి అలంకరించి
పెడితే వదలకుండా తింటారు అనుకున్నా , మంచి నెయ్యి వేసి కలిపి పక్కనే వెన్న ముద్ద మీద రెండు కొతి మెర తో డెకొరేషన్ చేస్తే ఏమిటో మన ఆంధ్ర వాళ్లకు ఇన్నవే షన్ తెలియదు అని బాధ పడ్డాను. మన కంది పొడి , ఆవకాయ గోంగూరపచ్చడి ఇలా చేసి ఒక హోటల్ పెడితే అనే ఆలోచన వచ్చింది.
అవీ దసరా పండగ కబుర్లు
Comments