మొదట వెళ్లిన కొత్తల్లో తెలుగు వాళ్ళు తో నే స్నేహంగా వున్నా నేను టీచర్ గా చేసిన చోట కొలీగ్స్ తో స్నేహం కుదిరి వాళ్ళు అపుడపుడూ యింటికి వచ్చేవాళ్ళు. ఇంకా యూనివర్సిటీలో మావారి తో డిపార్టుమెంటు లో కొలీగ్స్ కూడా ఎపుడూ ఇంటికి వస్తూ వుండేవారు. ఎపుడూ ఏవో గెట్ టుగెదర్ వుంటూ వుండేవి. నేను ఎపుడూ వెజిటబుల్స్ అన్నీ వేసి ఉప్మా కొబ్బరి పెరుగు పచ్చడి, రవ్వ లడ్డు లాంటి ఈజీ వే తీసుకొని వెళ్ళే దాన్ని . అమ్మ ఇచ్చిన ఊరగాయలు, ముఖ్యంగా గోంగూర పచ్చడి అందరికీ బాగా నచ్చేది . వాళ్ళందరూ యింటికి రాగానే పిట్టువా కి. చట్నీ అని అడిగి మరీ తినేవాళ్ళు. యూని వర్శిటీలో రిలీజియన్ స్టడీస్ అని ఒక డిపార్టుమెంటు వుండేది . అందులో హిందూ రిలీజియన్ ఒక తమిళ్ ఆయన వర్క్ చేసేవాడు.
క్రిస్టియన్ రిలీజియన్ కు ఒక ఫాదర్ కేరళ నుంచి వచ్చారు. ఇద్దరూ చాలా కలుపు గోలు గా వుండేవారు.a ఫాదర్ కి ఒక వంట వాడు వుండే వాడు.మాకు అతని వల్ల మాకు గెట్ టుగెదర్ లో వంట బెడద తప్పింది. ఆ తమిళ ఫ్రెండ్ అయితే చండీఘర్ నుంచి కాఫీ పొడి తెప్పించుకొనేవాడు. వాళ్ళింటికి వెళితే మంచి కాఫీ ఇస్తానని చెప్పే వాడు. అపుడు నాకు కాఫీ అలవాటు లేదు కాబట్టి ఏమిటో కాఫీ కి ఇంత క్రేజ్ అనుకునేదాన్ని. యింకా మద్రాసు లో మాంచి ఇడ్లీ దోశ ఎక్కడ దొరుకుతాయో చెప్పే వాడు.సో న్యాచురల్ గా మిగతా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ వెళ్ళగానే ఈ రోజు మాంబళం ఇడ్లీ,, టీ నగర్ దోశ నా అని అడుగుతూ వుండేవారు. నాకు పాపం అనిపించేది. ఇంక ఆ ఫాదర్ అయితే గంటలు గంటలు బ్రిడ్జ్ అడుతూ వుండేవాడు. మనిషి చాలా మంచి వాడు . కానీ చర్చ్ ఫాదర్ అని అలా కార్డ్స్ ఆడుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా వుండేది. ఆ తమిళ ప్రొఫెసర్ ఆరు నెలల తర్వాత అమెరికా వెళ్ళారు.ఇంకో నాలుగు నెలల తర్వాత అక్కడ ఒక అమెరికన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని తెలిసింది. ఆ అమ్మాయికి ఇడ్లీ దోశ వేయటం నేర్పు తున్నాడేమో అని ఇక్కడ జోక్స్ వేసుకుంటూ వుండే వారు అక్కడ అన్నిటికన్నా నాకు నచ్చింది. గులాబీ తోట లు అందరి ఇళ్ళలో బాగా గులాబీ చెట్లు వుండేవి కానీ , ఎస్కోర్ట్స్ జిఎమ్ గారు అందర్నీ అక్కడ రాజు గారి గార్డెన్ కు గులాబీ తోటకు పిక్నిక్ తీసుకొని వెళ్ళారు .అన్నీ రకాల గులాబీలు చూస్తుంటే, సినిమాల్లో చూస్తున్నట్లు , చాలా విచిత్రంగా అనిపించేది. మా పాప పుట్టిన తర్వాత మా పెద్దమ్మ నాతో వూరు వచ్చింది అపుడు ఆ అనుభవా ల తో రేపు మరల కలుసుకుందాము.
Comments