సౌందర్య లహరి 3
- murthydeviv
- Dec 22, 2024
- 2 min read
ఈ స్తోత్రము నందు మూడు పవిత్రములైన హారతులు మూడు శ్లోకముల నందు తెలుపబడినవి ఓమ్ అను దానిని
బ్రహ్మ ప్రణవ మందురు. ఇది ఆ, ఉ, మ, అను మూడు అక్షరముల కలయికతో ఏర్పడినది.. ఇందలి అక్షరములను
స్వల్పముగా మార్పు చేసినచో ఉమ అను దేవి ప్రణవ ము ఏర్పడును. ఆ అను అక్షరము సృష్టి కిని, ఉ అను అక్షరం
స్థితి కి నీ, మ అను అక్షరం లయమునకు సంకేతము. సౌందర్య లహరి స్తోత్రము దేవి, విషయ గ్రంథము కావున
ఇందు దేవీ ప్రణవ పదమైన ఉమా లోని అక్షరముల వరుస క్రమంలో నే శ్లోకములు స్థానము నిర్దేశించ బడింది.
అనగా మొదట ఉ, సంబంధ స్థితి పూర్వక శ్లోకములను , మధ్యలో మ సంబంధ లయ పూర్వక శ్లోకములు చివర ఆ,
సంబంధ సృష్టి పూర్వక శ్లోకములు ఈ క్రింది విధము గా అమర్చబడినవి.
భవానీ త్వం దా సే మయి వితర దృష్టి స కరుణామ్ అను 22శ్లోకము న , ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నిరాజిత
ప దాం అని స్థితి పూర్వక నిరాజనమున్నది.. ఇది బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మున్నగు దేవతలు ప్రకాశించు కిరీటములతో
దేవి పా ద పద్మంములకు కీయబడు మొదటి పవిత్ర నీరాజనం.
స్వదేహోద్భుత ఖిర్ ఘ్రి ణి భి రణి మా ధ్యా భి రభితో ,అను 30 వ శ్లోకమున
మహా సంవర్తా గ్ని ర్ విరచ యతి నిరాజన విధిమ్ అను లయ పూర్వక , మహా ప్రళయ నిరాజాన మున్నది
ఇది దేవీ కినీ తనకూ ఎట్టి భేదము లేదు అను భావనతో ఉపాసించే సాధకునకు ప్రళ యాగ్ని ఇచ్చు రెండవ పవిత్ర నీరాజనము
ప్రదీప జ్వాలా భిర్ దివసకర నిరజాన విధిం అను 100శ్లోకము లో ఆచార్యుల వారు దేవికి సమర్పించు సృష్టి పూర్వక
నీరాజనము . ఇందు ఆచార్యుల వారు అత్యంత వినయ సంపదతో దేవి కి వాక్పూర్వకము గా సమర్పించిన మూడవ పవిత్ర నీరాజనం.
సౌందర్య లహరి యంత్ర మంత్ర తంత్ర శాస్త్ర ములను వివరించు గ్రంథము.దీనికి సుమారు 36 వ్యాఖ్య నములు వున్నవి
వీటిలో ఖై వల్యశ్రయుడు వ్రాసిన సౌ భాగ్య వర్థని,, లొల్ల లక్ష్మీ ధరుడు వ్రాసిన లక్ష్మీధ రము ప్రథమ గణ్యం గా వున్నవి
వేదములకు సాయణ భాష్యము వలనే మంత్ర శాస్త్రం మునకు లక్ష్మీ ధర పండితుడు ఫ్రా మిణు కుడు . ఈయన కొండవీటి రాజుల ఆస్థానంలో పండితుడు. వారి పతనానంతరము న శ్రీ కృష్ణ దేవరాయలు వారి అస్థానము ను అలంకరించిన ఆంధ్ర పండితుడు. ఈయన వంశము వారు నేటికినీ కృష్ణ గుంటూరు మండములందు కానవచ్చు చున్నారు .
లొల్లా గ్రామము కృష్ణా మండములో వున్నది సౌందర్య లహరి యందు కొన్ని శ్లోకం లను గురించి రేపు తెలుసుకుందాము
శ్రీ మాత్రే నమః
Comments