మన ఆంధ్రా లో తూఫాన్ చాలా సామాన్యముగా వస్తూనే వుంటాయి. విపరీతమైన చలి గాలులు అలవాటు. కానీ పంజాబ్ కు రాజస్థాన్ దగ్గర కాబట్టి అక్కడ ఎండా కాలంలో ఇసుక తూఫాను లాగా వస్తుంది. నేను మొదట వెళ్ళినపుడు ఆ చలి కి విసుగు పడుతుంటే ఫ్రెండ్స్ అందరూ అబ్బ ఈ చలి కాలం బాగుంటుంది. వేసవి ఎండలు అసలు భరించలేము. ఆపుడు కూరలు కూడా దొరకవు అని చెప్పే వారు. మొదటి వేసవి సెలవలలో మేము ఆంధ్రా వెళ్ళాము. మరలా జూన్ లో రావటం తో అంత ఎండలు లేవు. మామూలుగా పాప ను ముందు డ్రాయింగ్ రూమ్ లో పడుకోబెట్టి ఇంటివాళ్ళ బాబు ను కూర్చో పెట్టీ పక్కన ట్రాన్సిస్టర్ పెడితే పాప ఆడుకుంటూ వుండేది. నేను వంట ఇంట్లో కి వెళ్ళాను అక్కడవంటిళ్ళు బయటికి కడతారు మధ్య లో ఖాళీగా ఓపెన్ గా వదిలి పెడతారు. చలికాలం లో ఎండకోసం అనుకుంటాను.కానీ వర్షా కాలం లో చాలా గొడవ గా వుంటుంది. నేను ఇలా ఒక పదినిమిషాలు వంటింట్లో వున్నానో లేదో, పెద్ద శబ్దంతో గాలీ దుమ్ము తో సుడులు తిరుగుతూ వచ్చింది. ఆ శబ్దం కే నేను భయపడిపోయి పరుగెత్తుతూ పాప దగ్గరకు వచ్చాను. వంటిల్లు తలుపు వేయాలని కూడా ఆలోచన రాలేదు . పాపం ఇంటివాళ్ల బాబుకు ఏడు, ఎనిమిదేళ్ల వయసు వుంటుందేమో ఆంధి అంటూ తలుపు మూయటానికి ట్రై చేశాడు కానీ, ఆ బలమైన గాలీ ముందు మన బలం ఎంత, నేనే అతి కష్టము మీద తలుపు మూసాను. ఒక రెండు మూడు గంటల దాకా అసలు ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. పెద్ద శబ్దంతో గాలీ వా న మెరుపులు. ఆ పిల్ల వాడిని , పాపను చెరొక చేత్తో పట్టుకొని అలా కుర్చీలో. కూర్చున్నాను. ఒక రెండు మూడు గంటల తర్వాత ఇంటావిడ, బాబు వాళ్ళ బామ్మ తలుపు తట్టి పిలిచింది. తలుపు తెరిస్తే ఏముంది, అంతా భీభత్సం గా ఇసుకతో నిండి పోయి వుంది. వాళ్ళ కు అదంతా అలవాటు ఏమో అంధి ఆయా ఆప్ రసోయి బంధ్ నహి కీయా అన్నది. అసలు ముందు మైండ్ బ్లాంక్ అయివున్న నేను ముందు పాప, బాబు బాగున్నారు, అదేచాలు అనుకుంటూ పర్వా నహీ అన్నాను. మెల్లగా పాపను ఎత్తుకుని వంట ఇంటివైపు వెళ్ల గానే అక్కడ సీన్ చూసి ఏమనుకోవాలో, ఏంచేయాలో అర్థం కాలేదు. వంటిల్లు అంతా ఇసుక, డబ్బాలు, గిన్నెలు, అంతా ఇసుకతో నిండి పోయి వున్నాయి. పాప పాల డబ్బాలు, ఫ్లాస్క్స్ బెడ్ రూము లో వున్నాయి కదా అని సంతోషించాను. ఒక ఐదు, ఆరు గంటల తర్వాత వాతావరణం కొంచెం ప్రశాంతముగా అయింది. ఆ పంజాబీ ఆడవాళ్ళ కు నిజముగా జోహార్లు అర్పించాలి. ఆవిడ కోడలు కూతురు కలిసి సాయంత్రం అయ్యేటప్పటికి మొత్తం ఆ కాలి స్థలం అంతా క్లీన్ చేశారు. ఆవిడ నా వంట ఇంటి పరిస్థితి చూసి రెండు పుల్కాలు కూర యిచ్చింది. నేను మాత్రం మా వారు వచ్చిన దాకా ఆ వంటిల్లు జోలికివెళ్లకూడదని డ్రాయింగ్ రూమ్ లోనే పాప తో కూర్చున్నాను. ఈ హంగామా అంతా అయనకు కూడా కొత్త కదా, ఇంటి దగ్గర నేనూ పాప ఎలా వున్నామో అని బస్ లు స్టార్ట్ అవగానే వచ్చారు. ఆ సుడి గాలి వుంటే బస్సు లు కూడా ఎక్కడి వి అక్కడ ఆపేస్తారు ట. ఆ రోజు రాత్రీ సూరి, వాళ్ళ అన్నయ్య వచ్చి మా పరిస్థితి చూసి డిన్నర్ తెచ్చి ఇచ్చారు. నిజం గా ఆ జి ఎమ్ గారి అభిమానం మాత్రం ఎప్పటికీ మరచి పోలేము. భార్యా భర్తలిద్దరూ తెలుగు వాళ్ళందరికీ పెద్ద దిక్కు లాగా వుండేవాళ్ళు. మర్నాడు ఉదయం మావారు సెలవు పెట్టీ ఇంట్లో వుంటే,మా హంజీ పనిమనిషి గుడ్డీ గారిని బ్రతిమిలాడి ఆ వంట ఇల్లు బాగుచేయటానికి ఒక రోజు పట్టింది. ఇంక అక్కడ వున్నన్నీ రోజులు వంటిల్లు తలుపు ఎపుడూ వేసే వుంచే దాన్ని. కానీ అక్కడ ప్రతి వేసవి కాలంలో అలా ఆథీ లు వస్తూనే వుండేవి. అయితే మొదటి సారిగా చూడటంవలన చాలా భయపడిపోయి ఒక పదిహేను రోజులు ఏదో భయము గా వుండేది. అలా ఒక యుద్దం,ఒక ఇసుక తూఫాను చూశాను ఇంకా కొన్ని విశేషాలు తో రేపు
సుడి గాలి, ఆంధి
murthydeviv
అవును భయంకరముగా వుంటుంది
ఇసక సుడిగాలి భయంకరం . బయట ఉంటే ఇసక వళ్లంతా కొట్టుకుంటుంది . నేను ఒక సారి ఢీల్లీ వెళ్ళినప్పుడు అనుభవమయినది .