top of page
Search

వరుగులు

murthydeviv
40 minutes ago
4 min read

ఈ పండగలు హడావిడి లో అసలు వంటిల్లు చాలా జిడ్డుగా అయింది

ఫ్రిడ్జ్ లు కూడా సర్ది క్లీన్ చేయండి నా చెలికత్తె లకు చెప్పాను. పూర్వం లాగా నడుం కట్టుకుని చేసే ఓపిక లేదు, ఏదో చదువుతూ లేక పొతే ఫేస్ బుక్ చూసుకుంటూ వాళ్లతో పని చేయించటం.

చెలికత్తె లు ఆంటే మా పని అమ్మాయిలు, ఒక అమ్మాయి చిన్నదే , కర్ణాటక నుంచీ వచ్చారు. అక్క దగ్గర ఉండి

పనికి వస్తుంది. ఇంకా పట్నం పోకడలు వంట బట్ట లేదు . సిన్సియర్ గా పని చేస్తూ వుంటుంది..


రెండు ఫ్రిడ్జ్ లు క్లీన్ చేయాలా అనే ప్రశ్న తో వచ్చింది చిన్న చెలీ, మా ఆబ్బాయి వేసవిలో పాత ఫ్రిడ్జ్ సరిగ్గా పని చేయటం లేదు అనీ కొత్తది కొన్నాడు. కొత్తది రాగానే ఏదో బుద్ది వచ్చినట్లు పాతది కూడా బాగానే పని చేస్తున్నది. ఎవరైనా అడిగితే ఇచ్చేయి అ న్నాడు కానీ ఇంకా ఎవరూ అడగలేదు..


ఇంక మావాళ్లు కనిపించిన వన్నీ అందులో తోసేస్తూ వుంటారు. వెనకటి రోజుల భోషాణం లాగా అందులో , ఒక వారం నాటి పచ్చళ్లు, పిల్లలు స్విగ్జీ లో తెప్పించుకుని తినగా మిగిలిన పిజ్జాలు నూడుల్స్ అబ్బో అవన్నీ బయటకు తీస్తే ఒక ఫుడ్ కోర్ట్ పెట్టచ్చు..


ఇంక నేనే నడుం కట్టుకుని అన్నీ తీసి చెత్త బుట్ట లో పడేసి ఫ్రీజర్ ఓపెన్ చేస్తే ఒక ప్లాస్టిక్ బాక్స్ నిండా పచ్చ గా ఐస్ లో మునిగి పోయి వున్న పదార్దాలు కనిపించాయి.

ఫ్రిడ్జ్ ఆపి కొంచెం వేన్నీళ్లు పోసి లాగితే కానీ ఆ బాక్స్ రాలేదు. తీరా ఏమిటా అనీ చూస్తే మాగాయ ముక్కలు కోసాక మిగిలిన టెంకలు.

ఎందుకే ఇంత భద్రం గా దాచారు అనీ అడిగితే , మామిడికాయ కండ అంతా సరిగ్గా తీయలేదు, వీటితో పులుసు, చారు చేయచ్చు ఉంచండి, అనీ వంట అక్క చెప్పింది అంటూ సమాధానం వచ్చింది.


మన చిన్నప్పుడు ఆవకాయ, మాగా య కాకుండా ఉప్పు ఊరగాయ అనీ మిగిలిన మామిడికాయ ముక్కలు అన్నీ పసుపు ఉప్పు వేసి ఎండ లో పెట్టే వారు..

తర్వాత పప్పుల్లో వేసే వారు.

మా అమ్మమ్మ గారింట్లో ఒక మామిడికాయ కాకుండా, దోస కాయ తో , వంకాయలు తో వరుగులు , చేసే వారు.


తాత గారికి వూరి చివర దోస తోట ఉండేది, కాయలు విరివిగా వస్తే ఇలా వరుగులు చేసేవాళ్ళు.

ఆ రోజుల్లో కూరలు కూడా తక్కువగా దొరికేవేమో.


అమ్మమ్మ గారింట్లో ఆదోస వరుగులతో పులుసు, కూర కూడా చేసేవాళ్ళు. ఆ వరుగులు వూరికే వేయించి ఉప్పు కారం చల్లినా చిప్స్ లాగా మంచి రుచిగా ఉండేవి.


మేము ఎప్పుడన్నా ఈ కూర మా ఊళ్ళో చేయరు ఆంటే మా పెద్దమ్మ మీ నాన్న వాళ్ళు మద్రాస్ నుండీ కూర లు తె స్తారు

మాకు ఇక్కడ అన్నీ కూరలు దొరకవు అనీ సరదా గా చెప్తూ ఉండేది.


ఆ రోజుల్లో ఊర్లలో అన్నీ కూరలు దొరికేవి కావు. నాన్న గారు, పెద్ద నాన్న మద్రాస్ పని మీద వెళ్ళితే క్యారెట్, బీట్ రూట్,

కాబేజ్, కాప్సికం తెచ్చే వారు.

మా పిన్ని పిల్లలు ఢిల్లీ నుండీ వచ్చే వారు , వాళ్లకు ఆ కూరలు తింటం సరదాగా ఉండేది. అసలే దోస కాయ

కూర తినటం ఇష్టం ఉండని మాకు ఈ కూర నచ్చేది కాదు. వంకాయ వరుగుల తో పులుసు అయితే బాగానే ఉండేది.


అన్నిటి కన్నా అమ్మమ్మ గారింట్లో మాకు నచ్చే కూర కాకరకాయ వేపుడు. వంట బామ్మ గారు ఏవో రకాల పొడులు పెట్టీ రుచి గా చేసే వారు.. కాకరకాయ వరుగులు కూడా ఉండేవి.

అన్నిటి కన్నా హై లైట్ ఆ బామ్మ గారు కజ్జి కాయలు పొడి ఒక వారం రోజుల వరకు తయారు గా పెట్టీ పిల్లలు వచ్చారు అంటూ రోజూ వేడిగా చేసి పెట్టే వారు.

ఆ ఓపిక కి నిజం గా జోహార్లు చెప్పాలి.


అలా ఆ మామిడికాయ టెంకలు చూడగానే మనసు ఆంధ్ర కి వెళ్ళి అన్నీ చుట్టి వచ్చింది.

ఆ రోజుల్లో కాప్సికం తో కూర చేయచ్చు అనీ తెలియదు. అమ్మా వాళ్ళు సెనగ పిండిలో ముంచి బజ్జిలాగా చేసే వారు.


ఇపుడు కిచెన్ గార్డెన్ అనీ మనము మోడరన్ గా చెప్పే మాట, ఆరోజుల్లో ప్రతి ఇంట్లో కూర పాదులు ఉండేవి


ఆ రోజుల్లో దొండ , కాకర, చిక్కుడు, పాదులు ప్రతి ఇంట్లో ఉండేవి. మా అమ్మగారు ఏ చెట్టు వేసినా విరివిగా కాసేవి

పిల్లలు, మగ వాళ్ళు ఆ పాదుల దగ్గర స్నానము చేసే వాళ్ళు.


ఒక ఏడాది పొట్లకాయ వేసింది అబ్బా ఇంక పొట్ల కాయలు తెగ కాసాయి.. మా ఆమ్మ వాటితో బజ్జీలు కూడా చేస్తూ ఉండేది.

ఇంకొక సారి నేతి బీర కాయలు., ఇప్పుడు ఆ కాయలు నేను ఏ మార్కెట్ లో చూడ లేదు.


ఒకసారి తమ్మ కాయలు వాటికీ అసలు రుచే ఉండదు కానీ రక రకాలుగా వండే వాళ్ళు ఎలాంటి కూర అయినా తినాలిసిందే .

ఇప్పుడు పిల్లలు అయితే ఆలా తింటారో లేదో తెలియదు. ఆ తమ్మ కాయలు కూడా నేను ఈ హైదరాబాద్ లో చూడ లేదు.


చిక్కుడు పాదు అయితే తప్పకుండా వేసేవాళ్ళు , మాఘ మాసం లో రధ సప్తమి కి ఆ చిక్కుడు ఆకులతో స్నానము,

పరమాన్నం వండి ఆకుల్లో వేసి సూర్య భగవానుడికి నైవేద్యం తప్ప కుండా పెట్టే వాళ్ళు.


వంకాయ

వరుగులు తో కూడా కూర పులుసు రుచి గానే ఉంటుంది. ఏమిటో మనం పెద్ద వాళ్లము అవుతున్న కొద్దీ చిన్నప్పుడు సంగతులు గుర్తు వస్తూ వుంటాయి.


ఇంత కి ఈ మామిడికాయ టెంకలు ఏమీ చేయాలి అనీ చిన్న చెలీ అడగగానే పుట్టిల్లు, అమ్మమ్మ గారిల్లు, దోస తోట, చెట్ల పాదులు మధ్యలో తిరుగుతూ వున్న నా మనసు మా పాత ఫ్రీడ్జ్ దగ్గరికి వచ్చింది.


ఆహా ఈ మనసుకు ఎంత స్వేచ్ఛ కదా ఆలా ఎగురుకుంటూ అన్నీ తిరిగి వస్తూ ఉంటుంది ఆనుకున్నాన


అదేమిటో మా ఆమ్మ గారిలా కూర పాదులు పెట్ట లేదు ఎప్పుడూ పూల చెట్ల మీదే మనసు.


చిక్కుడు పాదు మాత్రం వేయిస్తాను, రధ సప్తమి కోసమే, కాయలు వచ్చినా రక పోయినా ఆకులు వుంటాయి కదా.

ఒక సారి మెంతులు చల్లి తే చాలా బాగా వచ్చింది. విసుగు వచ్చే వరకు ఆలూ మెంతి , మెంతి పరోటాలు చేసుకున్నాము.

మేము వుండే ఏరియా లో ఎవరికీ ఇవ్వ లేము కూడా , పని వాళ్ళు కూడ రెండు సార్లు తీసుకుని ఇంక చాలు అనీ చెప్తారు..


మొన్న నే మా అమ్మా యి వాళ్ళింట్లో పూర్వం దిల్ బహార్ అనే వారు, వాళ్ళు ఏదో సెంటు మల్లె అన్నాడు, గుత్తులుగా పూస్తుంది, మొక్క పీకుతుంటే మన ఇంట్లో వున్న చెట్లు పూలు చాలవా అంటున్నాడు మా పుత్ర రత్నం


ఈ పూలు మా చిన్నప్పుడు అంటూ నేను కథ చెప్ప పొతే తీసుకో నాకు ఇపుడు ఆ చరిత్ర వద్దు అంటూ కారు స్టార్ట్ చేసాడు..

అలా కాసేపు విహారం చేసి

మరలా మనసుని వెనక్కి లాగి ఎండ వస్తే ఎండలో పెట్టు , లేకపోతే నాలుగు రోజులు చారు లో వేయమని చెప్తాలే అన్నాను.

అయితే అవీ ఇన్నీ రోజులు ఫ్రీజర్ లో వున్న టెంకలు నాలుగు రోజుల్లో ఎట్లాగు డస్ట్ బిన్ లోకే ,


మేము తీసుకోమా అంటూ వాళ్ళు డ్యూయెట్ పాడారు అంతకన్నా నా అంటూ నేను గొంతు కలిపాను.

ఇంక గబ గబా ఫ్రిడ్జ్ క్లీన్ చేయండి అంటూ నేను మరలా ఫేస్ బుక్ లో కి దూరి పోయాను.


అవీ ఈ నాటి కబుర్లు మీకు బోర్ కొడితే వెంటనే ఉందిగా ముఖ పుస్తకం


శుభ రాత్రి










 
 
 

Recent Posts

See All
నేనూ నా మనవరాలు

ఈ రోజు శుక్రవారం అష్టమి ఘడియలు అనుకుంటూ రాత్రి ఏడింటికి పారాయణ మొదలు పెట్టాను. ఇంత లోకే మా ముద్దుల మనవరాలు వచ్చి ఎదురుగా కూర్చుని నేను ఏదో చెప్తూ వుంటాను, నీవు విను అనీ మొదలు పెట్టింది. పారాయణం అప

 
 
 
వీర తాడు

ఈ రోజు ఉదయాన్నే మెలుకువ వచ్చింది. లేవగానే భావుక మెంబర్ అయినప్పటినుంచి వీర తాడు టైమ్ అయిపోయిందా, ఉందా అని చూసుకోవటం , ఒక వేళ టైమ్ అయిపోతే ఆన్సర్ చూడకుండా, ఒకసారి మన తెలివి తేటలు పరీక్ష చేస

 
 
 
కృష్ణా అష్టమి

కృష్ణా అష్టమి నిన్న పూజలు, పారాయణం అయ్యేటప్పటికీ చాలా ఆలస్యం అయిపోయింది. ఇంక శుభాకాంక్షలుపెట్టే ఓపిక కూడా లేక పోయింది. మా పుట్టింటిలో అమ్మా వాళ్ళు కృష్ణ అష్టమి వేడుక గా సాయంత్రం పూజలు తులసి క

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page