top of page
Search

కృష్ణా అష్టమి

murthydeviv
3 days ago
2 min read

కృష్ణా అష్టమి నిన్న పూజలు, పారాయణం అయ్యేటప్పటికీ చాలా ఆలస్యం అయిపోయింది. ఇంక శుభాకాంక్షలుపెట్టే ఓపిక కూడా లేక పోయింది.


మా పుట్టింటిలో అమ్మా వాళ్ళు కృష్ణ అష్టమి వేడుక గా సాయంత్రం పూజలు తులసి కోట దగ్గర చేసే వారు. వెన్న, పాలు పెరుగు, అటుకులు కాకుండా పాల కాయలు చెగోడీలు, రవ్వలడ్డు , పూరీలు ఇలా చాలా పిండివంటలు చేసేవారు.


ఆ తులసి కోట దగ్గర పూజలు ఆంటే ఏమిటో చాలా ఇష్టం ఉండేది..బామ్మ గారు, అమ్మ చేస్తుంటే శ్రద్ద గా కూర్చొని చూసే వాళ్లము. మా నాయనమ్మ గారికి కృష్ణుడు ఆంటే చాలా ఇష్టం ట , అందుకే మా ఇంట్లో ఎన్నోరకాల కృష్ణుడు బొమ్మలు ఉండేవి.


బొమ్మల కొలువు పెట్టే టప్పుడు కూడా అన్నీ అవే బొమ్మలు. మేము పెట్టేటప్పుడు విసుక్కుంటే అమ్మగారు బామ్మకి కృష్ణుడు ఆంటే ఇష్టం అచ్చి వచ్చిన బొమ్మలు అనేది..


ఆలా మా బామ్మ గారు మద్రాస్ వెళ్ళినప్పుడు చక్కటి కంచు రుక్మిణి కృష్ణులు విగ్రహాలు తెచ్చికొని రోజూ పూజలు చేసేవారుట.


అలాగే రామ పరివారము కి ఒక మందిరం లో ఉంచి పక్కనే ఉయ్యాల లో

పవలింపు సేవ చేసేవారు .


కృష్ణా అష్టమి నాడు రుక్మిణి కృష్ణయ్య పుట్టినరోజు నాడు పూజలు చేయించుకునేవాడు.


ఇప్పటికీ హైదరాబాద్ లో అన్నయ్య దగ్గర రుక్మిణి కృష్ణులు పూజలో , రాములు వారు

హల్లో సేవ లు అందుకుంటున్నారు.


ఇంక మా అత్తగారు అయితే ఈ కృష్ణాష్టమి కి ఉపవాసం ఉండి కలశం పెట్టి తొమ్మిది

రకాల పిండివంటలు తో రాత్రి తొమ్మిది దాకా పూజలు చేసేవారు.

మా ఆత్త గారి దగ్గర దోగాడే కృష్ణుడు వున్నాడు ..

కలశం మీద కొత్త ధోవతి పెట్టి ఆ కృష్ణయ్య కి పూజలు చేసేవారు.

మర్నాడు గాని ద్వాదశి నాడు కానీ బ్రాహ్మణ డికి భోజనం పెట్టి ఆ ధోవతి ఇచ్చే వారు.


మా మామగారు అప్పుడు పోతన భాగవతం లో కృష్ణ జననం చదివే వారు.

ఆయన బాగా పెద్దవారు అయ్యూక నేను కానీ మా మరిది గాని చదివే వాళ్లము.

మర్నాడు పెరుగు అన్నం పులిహోర తో నైవేద్యం పెట్టే వారు.


మా ఇంట్లో ఎవరు రాసారో కానీ కృష్ణుడి మీద చాలా పాటలు మా అమ్మగారు పాడుతూ ఉండేవారు. యశోదమ్మ మన్ను తిన వద్దు నీకు ఎన్నో పిండివంటలు చేశాను అంటూ ఈ రోజుల పిండివంటలు లిస్ట్ అంతా వుంటుంది ఆ పాట లో


ఈ పండగ నాడు మా పిల్లలు ఈ పాట ని మా అమ్మ గారిని తప్పకుండా తల్చుకుంటారు


ఎప్పుడూ మా అమ్మ, ఆత్త గారుల కబుర్లే వుంటాయి అనుకుంటారేమో

ఈ హైదరాబాద్ లో దాదాపు గా 50 ఏండ్లు మా అమ్మ, పెద్దమ్మ, అత్తగార్ల మధ్య గడిపాను.


నా అదృష్టం ఏమిటంటే ముగ్గురూ చాలా స ఖ్యం గా ఉండేవారు, కానీ డబ్బు ఖర్చు విషయం లో ముగ్గురూ కలిసి చివాట్లు పెడుతూ ఉండేవారు.


అందుకే ఇప్పుడు ఏ పండగ వచ్చినా ఆ రోజులు, ఆ మాటలు గుర్తు వస్తూ వుంటాయి..

మన చిన్నప్పుడు పెద్ద వాళ్ళు కబుర్లు చెపితే మనం వినేవాళ్ళము.

అందుకే ఇప్పుడు ఈ ఫేస్ బుక్ అనే ఈ అరుగు మీద ఈ కబుర్లు


పెద్దవాళ్ళని తలచుకుంటే పుణ్యం, పురుషార్థం.


అమ్మ, అత్త గారు అంత చేయక పోయినా ఏదో కొద్దిగా పూజలు చేయటం అలవాటు అయిపోయింది.


పిల్లలు, మనవరాలు, మనవడు చిన్నగా వున్నప్పుడు వాళ్లకి రాధ కృష్ణులుగా అలంకరణ చేసి పాదాలు అద్దించటం , పేరంటం హంగామా గా ఉండేది..


ఇప్పుడు ఆ హడావిడి ఏమీ లేకపోయినా ఆ కాస్త పూజలు కే అలిసిపోయి

ఆమ్మో వచ్చే ఏడాది చేయగలనా అనుకుంటూ వుంటాను.


మా అమ్మాయి వాళ్ళ కమ్యూనిటీ లో బాగా చేస్తున్నారు రమ్మని ఫోన్ చేసింది.

కానీ మనకు సాయంత్రం పూజలు కదా అని వెళ్ళ లేదు.

అవీ కృష్ణా అష్టమి కబుర్లు.

.

ఇంకోసారి ఆ పాటలు పంచుకుందాం


శుభ రాత్రి

 
 
 

Recent Posts

See All
నేనూ నా మనవరాలు

ఈ రోజు శుక్రవారం అష్టమి ఘడియలు అనుకుంటూ రాత్రి ఏడింటికి పారాయణ మొదలు పెట్టాను. ఇంత లోకే మా ముద్దుల మనవరాలు వచ్చి ఎదురుగా కూర్చుని నేను ఏదో చెప్తూ వుంటాను, నీవు విను అనీ మొదలు పెట్టింది. పారాయణం అప

 
 
 
వీర తాడు

ఈ రోజు ఉదయాన్నే మెలుకువ వచ్చింది. లేవగానే భావుక మెంబర్ అయినప్పటినుంచి వీర తాడు టైమ్ అయిపోయిందా, ఉందా అని చూసుకోవటం , ఒక వేళ టైమ్ అయిపోతే ఆన్సర్ చూడకుండా, ఒకసారి మన తెలివి తేటలు పరీక్ష చేస

 
 
 
చవితి ముచ్చట్లు

భావుక మిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు పండుగ అయిపోయాక శుభాకాంక్షలు ఏమిటీ అనుకోకండి, ఇక్కడ గణపతి పూజలు రాత్రికే ఎక్కువగా చేస్తారు కదా . మా ఆత్త గారు ఇలాంటి పండుగలు అన్నింటికి పూజలు చేయిం

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page