నేనూ నా మనవరాలు
ఈ రోజు శుక్రవారం అష్టమి ఘడియలు అనుకుంటూ రాత్రి ఏడింటికి పారాయణ మొదలు పెట్టాను. ఇంత లోకే మా ముద్దుల మనవరాలు వచ్చి ఎదురుగా కూర్చుని నేను ఏదో చెప్తూ వుంటాను, నీవు విను అనీ మొదలు పెట్టింది.
పారాయణం అప్పుడు మాట్లాడనని తెలుసు, అందుకే సుత్తి మొదలు పెట్టింది. ఈ మధ్య స్కూల్లో సోషల్ సర్వీస్ డివిజన్ కి లీడర్ అయింది..
ఇప్పుడు దానికి బడ్జెట్, ఏమీ ఖర్చు చేయాలి, మనీ తక్కువ అయితే ఈ చేయాలి అంటూ సోది మొదలు పెట్టింది.
నేను చాలా సేపు విని తక్కువ అయితే ఈ చేస్తవు అన్నాను. అదే ఏమి చేయాలి థింక్ చేస్తున్నా అన్నది.
నేను వెంటనే కంపిటిటివ్ గేమ్స్ పెట్టు పిల్లలు ని, పేరెంట్స్ పిలిచి గేమ్స్ కి డబ్బులు వసూలు చేయి, చిన్న గిఫ్ట్స్ పెట్టు
అన్నాను.
మీ కార్పొరేట్ స్కూల్స్ లో పేరెంట్స్ కి బోలెడు డబ్బులు కదా అన్నాను. ఈ రోజుల్లో పిల్లలు కి నాలిక చివర వుండే ఊత
పదాలు ఒహ్ యూ ర్ కూల్ అమ్మమ్మా అన్నది
బ్రో ఆంటే ఒక్క దెబ్బ పడుతుందని తెలుసు.. కూల్ ఆంటే ఏమిటే అన్నాను. కాసేపు ఎక్సప్లయిన్ చేయటానికి
ట్రై చేసి నీకు ఇవ్వన్నీ ఎలా తెలుసు అంది.
ఇంకేముంది పారాయణం పక్కన పెట్టీ నోము కథలు చెప్పిన్నట్లు మొదలు పెట్టాను.
స్కూల్లో కాలేజీ లో చదువుకునే టప్పుడు మహిళా మండలి లో చేసిన ఎక్సబిషన్ గేమ్స్ పెట్టీ చేసిన కలెక్షన్,
గ్రాడ్యుయేషన్ అప్పుడు నేషనల్ డిఫెన్స్ ఫండ్ కి ప్రోగ్రామ్ లు చేసి టికెట్స్ అమ్మి ఓపెన్ ఎయిర్ థియేటర్ లో కండక్ట్ చేసిన రోజులు గుర్తుకి వచ్చాయి.
లేడీస్ క్లబ్ లో వేసిన డ్రామాలు , పాడిన పాటలు గురించీ చెప్పాను. భారత మాత గా ఒక అమ్మాయిని నిలపెట్టి అన్నీ స్టేట్స్ డ్రెస్సులు వేసి ఒక పాట ఆ పిల్లలు చేతుల్లో ప్రమిదలు పెట్టీ దీపాలు పెట్టీ వెనక నుంచీ ఒక దేశ భక్తి పాట పాడటం, ఆ
ఆ రోజుల్లో చాలా పాపులర్ చాలా సార్లు చేయించాము.
ఒక సారి పుష్ప విలాపం కూడా డాన్స్ డ్రామా చేసాము. నేను వెనక పాడుతూ ఉంటే ముందు వాళ్ళు ఏనాక్ట్ చేయటం.
లేడీస్ క్లబ్ లో చేసిన గుర్తు..
పంజాబ్ లో టీచర్ గా పని చేస్తూ వున్నప్పుడు , బీ ఎడ్ లేదు అనీ మిగతా టీచర్స్ నసుగుతూ ఉంటే ఆ ప్రిన్సిపాల్
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో ఏదయినా ప్రోగ్రామ్ చేయమంటే, నేను ప్లాన్ చేసి వేయించిన భారత మాత
డాన్స్ డ్రామా వాళ్లకు చాలా నచ్చింది.
అందులో ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు అవటం తో చాలా ముద్దుగా వున్నారు. అందులో పంజాబీస్ కి అరోజుల్లో దేశ భక్తి చాలా ఉండేది..
నేను స్కూల్లో మానేసాక కూడా 1971 లో బంగ్లాదేశ్ వార్ గెలిచాక మరలా పిలిచి ఆ డ్రామా చేయించారు.
హైదరాబాద్ వచ్చాక కొత్త గా లయన్స్ క్లబ్ వాళ్ళు లేడీస్ కి ప్రత్యేకంగా లయనెస్ క్లబ్ అనీ మొదలు పెట్టారు.
సికింద్రాబాద్ లో మా వారి ఆడిటర్ మా దగ్గర అంత చదువుకున్న వాళ్ళు లేరు , మీ మిస్సెస్ ని ప్రెసిడెంట్ గా
చేయండి అనీ అడిగితే మొహమాటానికి ఒప్పుకుని , ఒక పది, పదిహేనేళ్ళు తీరిక లేకుండా తిరిగి చేసిన
ప్రోగ్రామ్ లు.గుర్తు వచ్చాయి.
ఏవో ప్రోగ్రామ్ లు చేయటానికి డబ్బులు కలెక్ట్ చేయటానికి , డ్రామా లు, డాన్స్ లు అరేంజ్ చేసి టికెట్స్
అమ్మి , మరలా ఆ డబ్బుతో సోషల్ సర్వీస్ కోసం ఆ స్లమ్స్ కి తిరగటం మొదట్లో సరదాగా వున్నా తర్వాత
మాత్రం కంచి గరుడ సేవ అనిపించేది..
ఒక బ్లైండ్ స్కూల్ కి వెళ్ళినప్పుడు మాత్రం చాలా feel అయ్యాను. ఒక వారం రోజులు నిద్ర పట్ట లేదు.
ఇప్పటికీ ఆ స్కూల్ కి మాత్రం మా పిల్లలు ని సహాయం చేయమంటూ వుంటాను.
ఇప్పుడు మాత్రం ఇంట్లో వున్న పని వాళ్లకు, ఎవరైనా వచ్చి అడిగితే కాదు అనకుండా సహాయం చేయటం తో నా సోషల్ సర్వీస్ నడుస్తూ వున్నది.
ఇవ్వన్నీ చెప్తూ ఉంటే మా బంగారు తల్లి ఓహ్ యూ ఆర్ కూల్ అంటూ వుంటుంది. ఆ కూల్ కి అర్థం వాళ్లకు నాకూ ఇద్దరికీ తెలియదు..
మధ్య మధ్యలో మీరు ఇవ్వన్నీ చేసారా అనీ ఆశ్చర్యం ప్రకటిస్తూ వుంటుంది..
మనకూ అప్పుడప్పుడు ఓహో మనము కూడా ఇలా తిరిగాము, ఏన్నో ఘన కార్యాలు చేసాము అనుకుంటే
నమ్మకం కుదరదు.
ఇలా ఈ రోజు నా మనవరాలు నేను మరచిపోయిన ప్రోగ్రాములు గుర్తు చేసింది.
ఆ రోజుల్లో ఇన్నీ ఫోటోలు లేవు కదా. ఎప్పుడో లేడీస్ క్లబ్ లో వేసిన డ్రామా లో ఒక మగ వేషం కి ఒక ఫోటో ఉండాలి
అదీ ఎక్కడ వున్నదో వెతకాలి మా కూల్ పిల్లలు కి చూపటానికి.
నా ప్రజా సేవ మీకు బోర్ కొట్టి ఉంటే ఏమీ చేయలేను
సో శుభరాత్రి అవీ ఈ నాటి విశేషాలు , పారాయణం కాస్తా హుష్ కాకి అయింది.
,
Comments