top of page
Search

వీర తాడు

murthydeviv
3 days ago
2 min read

ఈ రోజు ఉదయాన్నే మెలుకువ వచ్చింది. లేవగానే భావుక మెంబర్ అయినప్పటినుంచి వీర తాడు టైమ్ అయిపోయిందా, ఉందా అని చూసుకోవటం , ఒక వేళ టైమ్ అయిపోతే ఆన్సర్ చూడకుండా, ఒకసారి మన తెలివి తేటలు పరీక్ష చేసుకుని అప్పుడు ఫలితం చూడటం, కరెక్టు వస్తే మనకు మనమే వీర తాడు వేసుకోవటం, మురిసి పోవటం, బాగుంది కదూ..


ఈ రోజు మొదటి పద్యం చదవగానే ఆన్సర్ అర్ధం అయిపోయింది. అయినా ఒకసారి చెక్ చేసుకుని ఆన్సర్ 7.1 నిముషాలు కి పెట్టాను.

చాలా ఉత్సాహంగా ఫలితాలు లిస్ట్ చూస్తే 72 నెంబర్ లో వున్నాను.


ఆంటే ఒక్క నిమిషం లో ఇంత మంది పెట్టారా అనుకున్నాను.

నిన్న కూడా తెలిసిన ఆన్సర్ కానీ టైమ్ అప్.


ఈ వీర తాడులు అలవాటు అయినప్పటినుండి ఊహల ఉయ్యాల లాగా

చిన్నప్పుడు స్కూల్లో శ్రీ, చుక్క పెట్టించుకోవటం కోసం ఎలా పరుగులు తీసే వాళ్లమో గుర్తు వస్తున్నది.


ఆ రోజుల్లో ఎలిమెంటరీ స్కూల్ దగ్గర లోనే ఉండేది. అయినా అన్నయ్య తోనో.

పక్కన వుండే పిల్ల ల తోనో వెళ్ళమనేవారు.


మా ఇంటి పక్కననే వున్న మా చిన్న తాతయ్య కూతురు తో వెళ్ళమనే వారు.

ఇద్దరం ఒకటే క్లాస్, శ్రీ లు ఇద్దరికీ రావు కదా ,


స్కూలు కి వెళ్ళే దారిలో మా మేనత్త ఉండేది. చూసిందంటే పిలిచి ఏదో ఒక చిరు తిండి ఇచ్చేది. నేను మాత్రం ఆ శ్రీ కోసం అత్తయ్య వాళ్ళింటి ముందుకు రాగానే

పరిగెత్తుతూ వెళ్లిపోయేదాన్ని.


స్కూల్ 11గంటలకు అయిపోయాక అప్పుడు తీరికగా అత్తయ్య దగ్గరికి వెళ్ళి

కబుర్లు చెప్పుతూ ఆవిడ పెట్టే చివాట్లు తో పాటు అన్నీ తిని తీరికగా ఇంటికి వచ్చే వాళ్లము.


ఇప్పుడు భావుక లో వున్న హేమా హేమీల ముందు నాకు శ్రీ వచ్చే ఛాన్స్ లేదు.


ఈ రోజు మను చరిత్ర గురించి చదవ గానే ఇంకొక ఊహ ల ఉయ్యాల లో

జ్ఞాపకం, మాకు ఏస్. ఏస్. ఎల్ సీ లో మను చరిత్ర లో వీ తెలుగు లో కొన్ని పద్యాలు ఉండేవి.

పెద్దన గారు వినాయకుడిని ప్రార్ధన చేస్తూ రాసిన పద్యం తెలుగు టీచర్ గారు

ఎంత చక్కగా ఎక్సప్లయిన్ చేసారంటే ఇప్పటికీ మనసులో ఆలా నిలిచి పోయింది.


శివ కుటుంబం ఫోటో లో అమ్మవారి పక్కన వినాయకుడు గనక ఉంటే ఆ పద్యం గుర్తు వస్తుంది.


సామ వేదం షణ్ముఖ శర్మ గా రు దేవీ సప్త శతి ప్రవచనం చెప్తూ

రాయలు వారు పెద్దన గారిని మనువు ల చరిత్ర రాయమని ప్రా ర్ధించి నట్లు

చెప్పారు.


ఆలా ఈ రోజు మను చరిత్ర చూడ గానే ఇవ్వన్నీ గుర్తు వచ్చాయి.


Forgotten empire అనే పుస్తకం లో ఎవరు రాసారో గుర్తు లేదు కానీ

అందులో రాయల వారిని గురించి చదివి హంపి వెళ్ళాము.


కానీ అవన్నీ చూస్తే గత వైభవం గురించి గర్వం కలిగినా ఇప్పటి అక్కడి పరిస్థితి చూస్తే బాధ కూడా వస్తుంది.


అవీ ఈ రోజు ఊహల ఉయ్యాల.... శుభ రాత్రి

 
 
 

Recent Posts

See All
నేనూ నా మనవరాలు

ఈ రోజు శుక్రవారం అష్టమి ఘడియలు అనుకుంటూ రాత్రి ఏడింటికి పారాయణ మొదలు పెట్టాను. ఇంత లోకే మా ముద్దుల మనవరాలు వచ్చి ఎదురుగా కూర్చుని నేను ఏదో చెప్తూ వుంటాను, నీవు విను అనీ మొదలు పెట్టింది. పారాయణం అప

 
 
 
కృష్ణా అష్టమి

కృష్ణా అష్టమి నిన్న పూజలు, పారాయణం అయ్యేటప్పటికీ చాలా ఆలస్యం అయిపోయింది. ఇంక శుభాకాంక్షలుపెట్టే ఓపిక కూడా లేక పోయింది. మా పుట్టింటిలో అమ్మా వాళ్ళు కృష్ణ అష్టమి వేడుక గా సాయంత్రం పూజలు తులసి క

 
 
 
చవితి ముచ్చట్లు

భావుక మిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు పండుగ అయిపోయాక శుభాకాంక్షలు ఏమిటీ అనుకోకండి, ఇక్కడ గణపతి పూజలు రాత్రికే ఎక్కువగా చేస్తారు కదా . మా ఆత్త గారు ఇలాంటి పండుగలు అన్నింటికి పూజలు చేయిం

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page