చవితి ముచ్చట్లు
భావుక మిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు పండుగ అయిపోయాక శుభాకాంక్షలు ఏమిటీ అనుకోకండి, ఇక్కడ గణపతి పూజలు రాత్రికే ఎక్కువగా చేస్తారు కదా .
మా ఆత్త గారు ఇలాంటి పండుగలు అన్నింటికి పూజలు చేయించే భాద్యత నాకు అప్పగించి వెళ్ళి పోయారు. అందువలన ఉదయం అంతా బిజీ అనమాట.
మా పుట్టింట్లో వినాయక చవితికి ఉదయం తొమ్మిది కల్లా తయారు అయిపోయే వాళ్లము .
అరోజుల్లో బ్రాహ్మణులు కొంచెం అందుబాటులో ఉండేవారు. ఆయన వచ్చే సమయానికి మేము రెడీ గా ఉండేవాళ్ళము.
అన్నయ్య వాళ్ళు ఏ తెల్లవారుఝాము నే లేచి పత్రి కోసం పరిగెత్తే వాళ్ళు ..
అరోజుల్లో చెట్ల నుండీ కోసుకు రావటమే , ఇలా కొనటం లేదు కదా.
వాళ్ళు తెచ్చిన పత్రీ అంతా విడదీసి పళ్ళాల్లో సర్థ టం ఆడపిల్లలు పని.
ఇంకా ఇంట్లో వుండే మరువం, దానిమ్మ, బిల్వం, గన్నేరు, జాజి కొమ్మలు అన్నీ తెచ్చి చిన్న చిన్న కొమ్మలుగా తుంచి సర్డె వాళ్లము.
పూజ అవగానే పుస్తకాలుకి కాసిని పూలు వేసి ఇంక పద్యాలు వో బొజ్జ గణపయ్య అంటూ ఒకరి కంటే ఒకరము పెద్దగా చదివి పురోహితుడి గారి కి
నమస్కారం చేసే వాళ్లము.
ఆ తర్వాత గుంజిళ్ళు తీసే కార్యక్రమం ఉండేది. ఆలా కాలేజీ కి వచ్చిందాక గుంజిళ్ళు తీసాము . ఇంక ఆ తర్వాత ఏదో చాలా పెద్ద వాళ్లము అయిపోయిన
ఫీలింగ్ .
పంజాబ్ లో వున్నప్పుడు వాళ్ళు ఇంటి నిండా పెంచుకున్న మొక్కలు జొన్న పొత్తులు నాలుగు కోసుకుని కాస్త లాన్ లో పెంచుకున్న గడ్డితో పూజ అయిపోయేది.
అక్కడ వాళ్లకు అప్పట్లో ఈ పండగ అంత తెలియదు .
హైదరాబాద్ వచ్చాక పురోహితులు దొరకడం కష్టం , మా అత్తగారు ఎక్కువగా పూజలు చేస్తూ ఉండేవారు. ఇంక మా వారు, మరుదులు ఆవిడ నే పూజ చెప్పమనేవారు.
మా పిల్లలు చిన్నగా వున్నప్పుడు కొంచెం త్వరగా లేస్తే మావారు దూరం గా వున్న ఫ్యాక్టరీ కి తీసుకుని వెళ్ళి అన్నీ రకాల పత్రీ కోసుకుని వచ్చేవారు.
ఇంట్లో వున్న గన్నేరు, జాజి మరువం అన్నీ కోసే వారు. బంక మట్టితో విగ్రహాలు చేయటం కూడా వాళ్లకు సరదాగా ఉండేది. తలా ఒక విగ్రహం చేసుకుని పెట్టుకునే వారు..
మా మనవరాళ్లు, మనవడు వాళ్లకి కూడా చిన్నతనము లో ఫ్యాక్టరీ కి వెళ్ళి పత్రి కోసుకు రావటం , విగ్రహాలు చేయటం చాలా సరదాగా ఉండేది.
వాటికీ రంగులు కూడా పులుము తూ ఉండేవారు.
ఒక్కకొక్కరి వినాయకుడు ఒక్కొక్క ఆకారం లో , ఎలుక వాహనాలు కూడా ఎక్కి
వచ్చేవారు.
ఒక్క చవితి పండగ మాత్రం మా పిల్లలు ముగ్గురు మా ఇంట్లోనే చేసుకుంటారు.
ఇంట్లో వినాయకుడిని పెట్టీ వచ్చి అడపిల్లలు ఇక్కడికే వస్తారు.
ఇంక గ్రాండ్ చిల్డ్రన్ ఎలా చేసినా ఆ విగ్రహాలు అన్నీ చాలా బాగున్నాయి అని
నేను మార్కులు ఇవ్వాలి.
ఇప్పుడు కమ్యూనిటీ ల్లో కూడా పిల్లలు కు బంక మట్టి ఇచ్చి మట్టి విగ్రహాలు చేయమని, వాడమని ప్రోతహిస్తున్నారు కదా, ఆలా మా పిల్లలు చవితి కి
వున్న నలుగురు పేరు పేరున ఇంట్లో వున్న ఆందరికీ తలా ఒకటి చేసి పట్టుకొచ్చే వారు.
వాళ్ళ కళా కౌశలం అంతా వినాయకుడిని వాహనాలు చేయటం లో చూపించే వారు..
పోయిన ఏడాది నుంచీ ఆ గొడవ తప్పింది, ఎందుకంటే ఇద్దరు కాలేజీ కి వెళ్లారు,
కాంపిటిషన్ తగ్గే టప్పటికి మిగతా ఇద్దరికీ శ్రద్ద తగ్గింది.
అందువలన ఇప్పుడు ఆందరికీ బజారు నుంచీ తెచ్చిన ఒకటే వినాయకుడు.
ఇదివరకు అయితే ఒక్కక్కరికి ఒక చిన్న పీట , తెచ్చిన పత్రి విడ దీసి ఇవ్వటం పోటీలు పడకుండా చూడటం హంగామా గా ఉండేది.
ఇప్పుడు అయితే కథ గురించి , గుంజిళ్ళ గూర్చి, పద్యాలు గురించి ఎదురు ప్రశ్న లు వేయకుండా పూజ ప్రశాంతంగా సాగితే అమ్మయ్య అనుకోవటమే .
వాళ్లకు వచ్చే అనుమానాలు ఎలా ఆంటే శివుడు పొట్ట లో ఎలా ఉంటాడు,
చంద్రుడు నవ్వితే అమ్మవారు కదా పార్వతి దేవికి కోపం ఎందుకు వచ్చింది అనీ
శివుడికి అంత కోపం ఎందుకు అనీ .
కుమార స్వామి అమ్మా నాన్న చెప్పినట్లు చేసాడు కదా అనీ ఇలా అనుమానాలు
తీరుస్తూ కధ చదివే టప్పటికి ఒంటిగంట అయిపోతుంది.
ఏమిటో మనకు చిన్నప్పుడు అక్షింతలు చేతిలో పట్టుకుని కధ వినటం తప్పితే ఇన్నీ అనుమానాలు వచ్చాయా అనే అనుమానం వస్తుంది నాకు..
నేనే ఆలోచించుకుని ఇలా అనుకుంటాను, ఆరోజుల్లో పెద్దవాళ్ళు చెప్పింది వింటం
తప్పితే ఎలా ఎందుకు అనే ఆలోచన వచ్చేది కాదు..
దసరాకు అమ్మవారు రాక్షసులను సంహారం చేసింది ఆంటే ఓహో అనుకోవటమే.
నరక చతుర్థి నాడు తెల్లవారుజామున నువ్వులు నూనె తో తలంటుకుని, నరకుడిని
చంపినట్లు ఒక కాకర పువ్వొత్తి వెలిగించి ఉదయాన్నే ఏ కజ్జికాయో, అరిస ముక్కో
తినే వాళ్లము. పెద్దయ్యాక కూడా అదే పద్దతి.
ఏ ప్రశ్న లు వుండవు, రావు.
ఇ
ఇ ప్పుడు అయితే అదేదో సినిమా లో లాగా ఎందుకు ఏమిటీ అనే ప్రశ
స్వీట్ కూడా ఏ కేక్ కానీ, బ్రేడ్ జాం తినకూడదా అనీ అడుగుతారు ఏమో
మా ఆత్త గారు అన్నట్లు యుగం మారిపోయిందేమో
అవీ చవితి కబుర్లు , సాయంత్రం అందరూ వెళ్ళి ఫ్యాక్టరీ లో వినాయకుడి పూజ చేసారు. తాత గారు మొదలు పెట్టారు అనీ చెప్ప గానే ఇంక ఎదురు ప్రశ్నలు ఉండవు.
చంద్రుడిని చూసాము ఎలా అన్నది మా సివంగి, కథ విన్నావు కదా రెండు సార్లు భయం లేదులే అని అభయం ఇచ్చాను.
శుభాకాంక్షలతో
శుభరాత్రి
Comments