1.. భావనోపనిషత్.. అమ్మ వారి నీ మనసు లో భావన చేస్తూ సర్వ ఉపచారములు భావన చేస్తూ పూజ చేయటం, దీనినే అంతర్యాగము లేక మానసిక పూజ అంటారు. ఈ పూజ సామాన్యులకు చేయటం కష్టము.
2 సౌభాగ్య భాష్కరము... భాస్కర రాయ కృతము ఇందులో లలితా సహస్ర నామము స్తోత్రము నకు సమగ్రమైన వ్యాఖ్యానము. సకల శాస్త్ర సంప్రదాయములను వివరించి చెప్పుట, ప్రతి నామమునకు విశేష అర్థములు తెలుపుట, మొదలైన విషయముల చే ఇతర వాఖ్యాతల కన్నా విషయ నిరూపణలో అగ్రగణ్యుడు అనిపించుకున్నాడు. అందు వలన వీరి వ్యాఖ్యానము ఒక శాస్త్ర గ్రంథముగా విఖ్యాతి నొందినది. వీరి భాష్యము లో తెలుపబడిన వ్యాకరణ, అలంకార, విషయముల పరిశీలించిన, సహస్రనామ రచన మహకావ్య శైలిలో సాగినదని వక్త్యమగుచున్నది. ఈ గ్రంధము నకు రెండు తెలుగు అనువాదములు వున్నవి.
భాస్కర రాయలు ఆంధ్ర దేశమున జన్మించినట్లు తెలుపబడింది. నారాయణ పేట సమీప గ్రామములో దీక్ష ను పొంది, పిమ్మట
ఆ రోజులలో ఘూ ర్జర దేశము నందలి ఉపాసనా మార్గ ప్రవర్తకులైన ప్రకాశానంద నాథ అను పండితుని వద్ద పూర్ణాభిషేక దీక్షను పొందెను.
భాస్కర రాయలు కాశీ క్షేత్రము నకు వచ్చి అచట లలిత సహస్ర నామ స్తోత్రము నకు పర దేవతా అజ్ఞ చే వ్యాఖ్యానము రచించెను. ఆనాటి కాశీ క్షేత్రము నందలి పండితులు వీరి భాష్యవ్యాఖ్యాన విషయమై సందేహము గల వారై ఇతనిని పరిక్షింప దలచిరి. మహా చతుష్షష్టి కోటి యోగిని గణ సేవితా అను నామము లో చెప్పబడిన అరువది నాలుగు కోట్ల దేవతల నామములు, వారి చరిత్ర లను చెప్పగలరా అని ప్రశ్నించారు.. ఆపుడు భాస్కర రాయలు ఆ పండితులను తాను నిర్ణయించిన కాలమునకు గంగ ఒడ్డునకు రమ్మెనెను. భాస్కర రాయలు గంగ ఒడ్డున యోగినుల చరిత్ర చెప్పుట మొదలు పెట్టెను. ఆపుడు అనేక కంఠ స్వరములతో అనేక యోగిను ల చరితమును, నామములను ఒక్కసారిగా చెప్ప గలిగెను. ఆ వాఖ్యానము విని పండితులు ఆశ్చర్య చకితులు అయినారు. వారికి గంగా నది లో ఆకాశ భాగమునందు వారి వారి వాహనముల అధిష్ఠించిన, అరువది నాలుగు కోట్ల దేవతలు తమ తమ చరిత్రలను వారే చెప్పుచున్నట్లు దర్శనమైనది. భాస్కర రాయలు వారి కుడి భుజము పై లలితాదేవి, ఎడమ భుజము పై శ్యామల దేవి కూర్చుని ఉన్నట్లు దర్శనం అయింది.. అపుడా పండితులు అతని అందలి అనుమానం ను విడచి, లలితా సహస్ర నామ భాష్యము ను, ప్రమాణ గ్రంథము గా స్వీకరించిరి. భాస్కర రాయలు వేదాంత, మీమాంస, కావ్య, మంత్ర శాస్త్రం విషయముల పై 42 పై గా గ్రంథములు రచించిరి. ఈ గ్రంథము లు మన లాంటి సామాన్యులకు అర్థము కావు, కాబట్టి ఆ మహానుభావులను తలచుకొని , అమ్మ వారి దయ, కరుణ మన అందరికి లభించాలని కోరుకుంటూ, ఎందరో మహానుభావులు అందరికి వందనములు.
అమ్మ వారి గురించిన గ్రంథములు లో మనము చదివి అర్థం చేసుకోగలిగిన ఇంకొక కొన్ని గ్రంథములు.
1 .. ఆర్యా ద్విసతి .
ద్వి సతి. అంటే రెండు వందలు, అంటే రెండు వందల శ్లోకములు లో అమ్మవారి గురించిన వర్ణన, దుర్వాస మహాముని రచించిన గ్రంథము. ఇందులో శ్రీ పురం, శ్రీ చక్ర వర్ణన ఉంటుంది.
దుర్వాస మహాముని రచించిన ఇంకొక గ్రంథము దేవి మహిమ్న స్తుతి ఇందులో బాలా త్రిపురసుందరీ మంత్రము యొక్క రహస్యములు వర్ణింప బడింది.
2 .... మూక పంచ సతి
ఈ గ్రంథములో 500 శ్లోకములు ఉన్నాయి. మూక కవి విరచిత ము, ఈయన కంచి కామకోటి పీఠాధిపతి. ఈయన కు కామాక్షి అమ్మవారి అనుగ్రహం వలన ఈయన ఐదు శతకములు రాశారు
1. ఆర్యా శతకము ...2 , పాదా రావింద శతకము,, కామాక్షి దేవి పాదముల వర్ణన...3,, స్తుతి శతకము.. దేవి స్తుతి..
4. కటాక్ష శతకము.. దేవి క్రీగంటి చూపు యొక్క విశిష్టత,, , వర్ణన..5,, మందస్మిత శతకము.. దేవి మందహస వదన వర్ణన.
అన్ని శ్లోకములు చదవటానికీ చాలా మధురము గా వుంటాయి కొన్ని ముఖ్యమైన శ్లోకములను రోజూ పారాయణ లాగా చేసుకోవచ్చు. అమ్మ వారి అనుగ్రహం వుంటే కొన్ని ఇందులో రాస్తాను.
3,.. దేవి పంచ స్తవి .. కాళిదాస కవి విరచితము. ఇందులో ఐదు స్తవములు వున్నాయి. కాళిదాసు మహా కవి గొప్ప దేవి భక్తుడు. మనకు తెలిసిన శ్యామల దండకము ఆ మహా కవి వ్రాసినదే. ఈ పంచ స్త వి నేను చ దవలేదు.
ఇంతటితో శ్రీ లలితా త్రిపుర సుందరి దేవీ సహస్ర నామ స్తోత్రము యొక్క విశిష్టత గురించి నేను చదివిన పుస్తకంలోని విషయాలను, అందరితో పంచుకోగలిగిన అవకాశము వచ్చినందుకు అమ్మ వారికి నమస్కృతులతో
శ్రీ మాత్రే నమః.
Comments