top of page
Search

మధుర గీతాలు ఎస్ జానకి

murthydeviv
Jul 26
2 min read

నేను సురయ్యా, గీతా దత్ గురించి చదివి వాళ్ళ గురించి రాశాను. సురయ్యా గురించి రాస్తూ ఉంటే తలత్ మెహమ్మోద్ గారితో ఆవిడ పాటలు విని ఆయన్ని గురించి రాస్తూ ఉంటే, సుమన్ కళ్యాణ్ పూర్ గారు ఇక లేరు అని తెలిసీ చాలా బాధ వచ్చింది.


ఇప్పుడు జానకి గారి గురించి ఇలా రాయాల్సి వచ్చినందుకు అరే ఇలా ఒక రెండు మూడు నెలల తేడా లో నే మంచి గాయకి మణులను కోల్పోవటం చాలా విషాదం.

జానకి గారి వక్తిత్వం గురించి మనం చెప్పగలిగేది ఏముంటుంది. ఆవిడ సిసలైన తెలుగింటి ఆడబడుచు , అయినా మన ఆంధ్రులకు మన వాళ్లను ఎలా గౌరవించుకోవాలో తెలియదు కదా, అందుకే ఆవిడ తమిళ చిత్రంలో తన సినీ ప్రస్థానం మొదలు పెట్టారు.


జానకి గారి గాత్రం ఒక విలక్షణమైన స్వరం, ఆవిడ పాట లో పలికించే వంపులు వినాలే కానీ వర్ణించలేము.

నీ లీల పాడే ద దేవా లో ఆవిడ సన్నాయి తో పాటు పలికించిన రాగాలు న భూతో న భవిష్యతి.


ఆవిడ దాదాపు 50 వేల పాటలు పాడారుట , ఇవే కాకుండా కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ కూడ వున్నాయి.

ఆవిడ దాదాపు అన్నీ భాషల్లో ను పాటలు పాడారు.

ఆవిడ కి వచ్చిన అవార్డు లు , బిరుదులు వీటి అన్నిటి గురించి చాలా చోట్ల చదివే వుంటారు.


మా వారికీ , ఆవిడకు ఒక కామన్ ఫ్రైండ్ అప్పటి మద్రాస్ లో వుండే వారు. అరోజుల్లో తరచుగా చెన్నయ్ వెళ్తూ వుండే వాళ్లము.

ఒకసారి ఆ ఫ్రెండ్ తో జానకి గారి యింటికి వెళ్ళాము. ఆ తర్వాత ఆవిడ తో స్నేహం ఏర్పడి చాలా సార్లు కలుసుకున్నాము.

జానకి గారితో ఒకటి రెండు మలయాళం, తమిళ్ డబ్బింగ్ మూవీ ప్రివ్యూ లకు వెళ్ళాము.


ఆవిడ చాలా స్నేహ శీలి , నాకు ఆవిడ పాడిన త్యాగ రాజా కీర్తనలు, మీరా భజనలు కేసెట్ లు ఇచ్చారు.


హైదరాబాద్ లో ఆవిడ ప్రోగ్రామ్ లు కొన్ని మా వారు మా కంపెనీ తరపున స్పాన్సర్ చేసారు.

అలా ఆవిడ తో పర్సనల్ గా కొద్దీ పరిచయం వున్నది కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా బాధ గా అనిపించింది.

జానకి గారు సంపూర్ణ జీవితం ఉండటమే కాకుండా గాయని గా కూడా పరిపూర్ణ త ను సాధించారు.


ఏ పాట అయినా ఎంత ఈజీ గా పాడారు అనిపిస్తుంది. ఎన్నో మైలు రాళ్లు లాంటి , అపూర్వమైన పాటలు వున్నాయి.

నీ లీల పాడేదా దేవా, పగలే వెన్నెలా, నెమలికి నేర్పిన నడకలు, గోవులు తెల్లన , రామ చిలుక , పదహారు ఏళ్ల వయసు సినిమా లో కట్టు కధలు పాట లో ఆవిడ చేసిన మిమిక్రి అపూర్వ ము. సిరి మల్లె పువ్వు కూడా మంచి పాట.

ఇలా రాస్తూ ఉంటే ఎన్నో పాటలు గుర్తు వస్తాయి.


త్యాగ రాజు కీర్తనలు లో , బాల కనక మయ చేలా కీర్తన లో ఎలా నీ దయ రాదు అనటం లో ఎన్నో చక్కని వంపులు

పలికించారు, న గుమోము, సామజ వర గమన అన్నీ చక్కటి కీర్తనలు వున్నాయి ఆ కేసెట్ లో


ఇప్పుడు యూ ట్యూబ్ లో వున్నాయి.. కొమ్మ లో కోకిల కూ అన్నట్లే గాన కోకిలమ్మ జానకి గారు ఆవిడ పాడిన పాటలు అన్నీ సుమధుర గీతాలే

ఆవిడ గురించి మనం చెప్పేది ఏముంటుంది , సన్నాయి తో వంపులు పలికించిన మధుర గాయ ని కి శిర స్సు వంచి వందనం చేయటం తప్పితే










 
 
 

Recent Posts

See All
వరుగులు

ఈ పండగలు హడావిడి లో అసలు వంటిల్లు చాలా జిడ్డుగా అయింది ఫ్రిడ్జ్ లు కూడా సర్ది క్లీన్ చేయండి నా చెలికత్తె లకు చెప్పాను. పూర్వం లాగా నడుం కట్టుకుని చేసే ఓపిక లేదు, ఏదో చదువుతూ లేక పొతే ఫేస్

 
 
 
నేనూ నా మనవరాలు

ఈ రోజు శుక్రవారం అష్టమి ఘడియలు అనుకుంటూ రాత్రి ఏడింటికి పారాయణ మొదలు పెట్టాను. ఇంత లోకే మా ముద్దుల మనవరాలు వచ్చి ఎదురుగా కూర్చుని నేను ఏదో చెప్తూ వుంటాను, నీవు విను అనీ మొదలు పెట్టింది. పారాయణం అప

 
 
 
వీర తాడు

ఈ రోజు ఉదయాన్నే మెలుకువ వచ్చింది. లేవగానే భావుక మెంబర్ అయినప్పటినుంచి వీర తాడు టైమ్ అయిపోయిందా, ఉందా అని చూసుకోవటం , ఒక వేళ టైమ్ అయిపోతే ఆన్సర్ చూడకుండా, ఒకసారి మన తెలివి తేటలు పరీక్ష చేస

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page