top of page

మా తాత గారి గురించి నాకు తెలిసినంత 2

murthydeviv

నాకు ఊహ తెలిసినప్పటి కే మా తాతగారు యాక్టివ్ గానే వున్నా బట్టల షాప్ కి వెళ్ళేవారు కాదు. మా చిన్న నాయనమ్మ యింకా అత్తయ్య లు దగ్గర నుండీ తెలుసుకున్న విషయాలతో , ఇది రాస్తున్నాను. నాకు ఆయన ఒక సూపర్ మ్యాన్ లాగా అనిపిస్తారు. మా ఊహ తెలిశాక కూడా మా యింటి వరుసగా మా తాత గారి కజిన్ బ్రదర్స్ ఇళ్ళు వుండేవి. ఆ తాతగారు లు కూడా స్కూల్ టీచర్స్ గా పనిచేసే వారు. మా తాతగారు బహుశ ఎలిమెంటరి స్కూల్ అయివుండవచ్చు నడిపేవారు. అయన తమ్ముళ్లు కూడా ఆయన తో పనిచేసే వారు. తాతగారు ఉదయం స్కూలు నడిపినా సాయంత్రం పూట బట్టల దుకాణాల లో లెక్కలు రాస్తూ వుండే వారుట. అలా రాస్తూ వుండగా ఆయనకు బహుశ తను కూడా వ్యాపారము చేయాలని ఆలోచన వచ్చి వుండవచ్చు. మా అమ్మ గారు చెపుతూ వుండేవారు, మా తాత గారు మా మ్మ గారి బంగారపు కంటే అమ్మి వ్యాపారము మొదలు పెట్టారని. మా పెద్దనాన్న గారు తొమ్మిదో క్లాసు వరకు చదువుకున్నారుట. మొదట్లో మా పెదనాన్న గారితో, మా తాత గారి చిన్న తమ్ముడు తో కొన్ని అధ్డకం చీరలతో అప్పటి చెన్నపట్నం పంపేవారు. వాళ్ళు వుదయం చెన్నపట్నం వెళ్ళి మర్నాడో కో, మూడో రోజుకో మరలా వచ్చే వారు. అలా మొదలు పెట్టిన వ్యాపారము సొంత ఊరిలో హోల్ సేల్ దుకాణము తెరవటమే కాకుండా, చెన్న పట్నం లో కూడా దుకాణము తెరిచారు అప్పటికి ఇప్పటికి మా వూరిలో చేనేత చీరలు, అద్దకం చీరెలు బాగా తయారు అవుతాయి. కోరా బట్ట మీద రంగులతో అద్దకం చేసి చీరెలు తయారు చేస్తారు. తాత గారు తర్వాత ఈ అద్దకం చీరెలు కూడా సొంతంగా తయారు చేయించే వారు . మేము బాగా పెద్ద వాళ్ళం అయినదాక కూడా ఆ అద్దకం వేసే కార్కాన వుండేది. మా పెదనాన్న గారు సిలోన్, అప్పటి బర్మా,లు కూడా వెళ్ళి ఈ చీరెలు అమ్మే వారు ట. మా పెద్దనాన్న గారితో మా నాన్న గారు కూడా చెన్నపట్నం, మదురై, కోయంబత్తూర్ అన్నీ ఊర్ల లో ఈ చీరెలు అమ్మే వారు.మా నాన్న గారు జరీ లేకుండా మధుర చుక్క చీరెలు మా కార్కన లో తయారు చేయించేవారు. మా ఊరిలో వర్తకులు చాలా మంది అప్పటి బొంబాయి నుండి మిల్లు బట్టలు కొని తెచ్చేవారు. అది చూసి మా తాత గారు బొంబాయి లో ఒక కమిషన్ వ్యాపారము కోసం ఒక దుకాణం పెట్టించారు. ఆ వ్యాపారము కూడా చాలా బాగా నడిచేది. నాకు ఇపుడు ఆలోచిస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. నేను ఒక బిజినెస్ మేన్ మనవరాలిని, కూతురుని, భార్యని, తల్లిని, కూడా, వ్యాపారాలలో వుండే కష్టనష్టాలు, సుఖదుఃఖాలు, అన్నీ మూడు తరాల నుండీ చూస్తున్నాను. నాకు ఎపుడూ అంత సాధారణ స్థాయిలో వున్న తాతగారికి అలా వ్యాపారము చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది అని సందేహం కలుగుతూ ఉంటుంది. ఆ రోజుల్లో ఇప్పటి లాగా పేపర్లు, ఇంటర్నెట్లు కమ్యూనికేషన్ టెక్నాలజీ లేదు. పైగా ఒక పక్క స్వాతంత్ర్య ఉద్యమ హడావిడి, యింకో పక్క యుద్ధ వాతావరణం. ఈ పరిస్థితుల్లో కూడా ఆ వున్న కొద్దిపాటి వనరులతోనే, చుట్టూ వున్న వాతావరణం లోనే కొత్త దోవలను కనుకున్న తాతయ్య కు ఏ లోకము లో వున్నా జోహార్లు. ఈ రోజు నీ మనవళ్లు ముది మనవళ్లు ఈ విశాల ప్రపంచంలో ఎంతో హాయిగా ఉన్నారంటే అది నీ చలవే కదా. అయితే నీవు వెలిగించిన ఈ జ్యోతినీ ఆరకుండా మేము అందరమూ కూడా ప్రయత్నించి నట్లయితే యింకా కొత్త వ్యాపారాలు చేయగలిగి వుండే వాళ్లమేమో. నీవు వేసిన బీజము వృక్షం అయింది. కానీ పెద్ద తోట లాగా కాలేక పోయింది. నీ తర్వాత నీ లాంటి తోటమాలి రాలేదేమో. యింకా కొన్ని విశేషాలు తో రేపు.

48 views0 comments

Recent Posts

See All

రథ సప్తమి జ్ఞాపకాలు

. కొంచెం పెద్ద వాళ్ళం అయ్యాక గడిచి పోయిన రోజులు గుర్తు వస్తూ ఉంటాయి చిన్నతనంలో చదువు తర్వాత పెళ్లి పిల్లలు, బాధ్యతలు జీవితము మనం ఆలోచించ...

అమ్మమ్మ అమెరికా యాత్ర 4

1995లో మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ కి వెళ్ళాక 2006లో మా అమ్మాయి పురిటికి మరలా అమెరికా యాత్ర కు బయలుదేరాను ఈ 11 సంవత్సరాలలో చాలా మార్పులు...

అమ్మమ్మ అమెరికా యాత్ర 3

అలా మొదలైన నా యాత్ర బహుశ రెండు నెలలు వున్నాను అనుకుంటా అమెరికాలో. మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ బాగా అయింది. నేను వెళ్ళిన ఒక పది...

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page