మాగాయ మహిమలు
- murthydeviv
- 7 days ago
- 2 min read
రెండు రోజుల క్రితం మా అమ్మాయి చెట్టు కాయలు అంటూ మామిడి కాయలు పంపింది. మామూలుగా ఆవకాయ అయితే నేను ఎక్స్పరిమెంట్ ఏమీ చేయకుండా కాయలు ఒకే రకం ఒకే చోట తెస్తాను అతను కూడా నమ్మకం గా ఇస్తాడు. మా ఇంట్లో చెట్టు అయితే తియ్యటి కాయ అన్ని చెట్లు కాయటం అయిపోయాక తీరిగ్గా కాస్తుంది. పండు లాగా తినేయటమే. ఈ కాయలతో మాగాయ పెట్టా లీ అని తరగ మని అంటే మా పని రాణులు చాకులు బాగాలేవు చెక్కు రావటం లేదు అంటూ ఒక పాతిక కాయలు తరిగారు , కండ చాలా గట్టిగా ఉంది అవకాయ పెట్టండి అంటూ ఉచిత సలహా కూడా ఒకటి ఇచ్చారు. సరే నేను కొంచెం గట్టిగా చెప్పితే ఇంకా కొన్ని కాయలు తరిగారు. ఉప్పు కారం కలపటానికి లెక్క తెలియాలి అని ఆ టెంకలు అలా పక్కన పెట్టాను ఉదయాన్నే మా కుక్ రాణి గారు వచ్చారు ఆ టెంకలు చూసి అయ్యో సరిగా తరగలేదండి చాలా కండ ఉంది. ఈ కండ ఏమిటో నాకు కండ పోయేటట్లు వున్నది అనుకున్నాను. మామూలుగా వంట చెప్పాను పులుసు ఈ టెంకలతో పెడతా లెండి వేస్ట్ అవకుండా అన్నది. ఓహో నా ఇన్నేళ్ల జీవితము లో ఇలా టెంకలు వాడటం నాకు తెలియదు. బాగుంటుందా అని అనుమానం గా అడిగాను. ఈ రోజు తినండి రేపట్నుంచి ఇలాగే పెట్టమంటారు అన్నది అవిడ మాటల తో నా మనసు గతం లోకి వెళ్ళింది. దానికి పనేమీ ఉంది ఎపుడు పడితే అపుడే గతం లోకి వెళ్తుంది. మా చిన్నప్పుడు మా చిన్న బామ్మ గారు మాకు ఒక కథ చెపుతూ వుండేది. మేము పెరుగు అన్నం లో కొంచెం వదిలి పెడితే ఈ కథ చెప్తూ ఆ అన్నం మా చేత మింగిచేది. మా అసలు బామ్మ గారు గురించి నాకు అంతగా గుర్తు లేదు ఆవిడ మా చిన్నతనం లోనే వెళ్ళి పోయారు అనుకుంటాను. మా చిన్న బామ్మ గారు మాత్రం మాకు ఆ లోటు తెలియకుండా చాలా ఆప్యాయంగా చూసేవారు. ఏదో ఒక సందర్భము లో ఆవిడ ను తలచుకుంటాము. ఆవిడ చెప్పిన కథ ఆరోజుల్లో రెండు రోజుల కొకసారి ఎవరో ఒక బ్రాహ్మణ డు భోజనం కి వస్తూ ఉండే వారు. అలా ఎవరో ఒక బ్రాహ్మణ డు ఒకరింటి కి అన్నం పెట్టమని వచ్చాడుట ఆ ఇంటి ఆవిడ అన్నంలోకి ఆదరవు లేదు మజ్జిగ కొంచెం నిమ్మకాయ ఉంది అందిట. ఆ రోజుల్లో బావి దగ్గర స్నానం చేసి వచ్చి అన్నం తినే వారు. అతను కూడా స్నానం చేసి వచ్చి కూర్చుని ఆవిడ పెట్టిన అన్నం లో బొడ్లో దోపుకొని వచ్చిన మాగాయ టెంక తో అన్నము కలుపుకుని మొత్తం అన్నం తినేసాడుట పాపం ఆ ఇంటావిడ మాగాయ టెంక తో మానే డు అన్నం తిన్నావు కదా అనుకుంది ట. ఈ కథ చెప్తూ మా చేత అన్నం తిని పించేది. ఇపుడు తలచుకుంటే నవ్వు వస్తుంది. మామిడి కాయలు వచ్చినప్పుడు చింత పండు బదులుగా పప్పులో మా అత్తగారు కూడా వే సే వారు. కానీ ఇలా టెంక లు కూడా వాడతారని తెలియదు. టెంక లు వేస్తే నూనె ఎక్కువగా పీలుస్తుంది అని నేను వేయను. మా కుక్ రాణి గారు ఆ టెంకలు అన్నీ వెంటనే ఫ్రిడ్జ్ lo పెట్టించింది. మా అమ్మమ్మ గారింట్లో దోస కాయలు ఎక్కువ గా వచ్చేవి తోట లోనుండి మా అమ్మమ్మ వరుగులు లాగా చేసేది. ఆ వరుగులు తో కూర, పులుసు పెట్టే వారు . అవి కొంచెం నూనె లో వేయించి ఉప్పు కారం వేసి తింటే చాల బాగుంటాయి. ఒక రోజు మా డ్రైవర్ ఎక్కువ గా దోసకాయలు తెస్తే నేనూ ఇలాగే వరుగులు లాగా చేసి వేయించాను. మా చిన్న బ్యాచ్ అంతా ఆఫీసు నుండి రాగానే ఎవో కొత్త రకం చిప్స్ అనుకుంటూ తినేశారు. మనం ఇవ్వన్నీ చెపితే వాళ్ళ కు కొత్త గా వుంటుంది కానీ, మా బుల్లి బ్యాచ్ స్టోర్స్ కి వెళితే వాళ్ళు అందరి చేతుల్లో రకరకాలు ఫ్లేవర్ తో చేసే చిప్స్ పాకెట్ తప్పక వుంటుంది. మొన్న మాగాయ పప్పు చెప్పాను కదా అలా ఈ రోజు టెంకల తో చారులు, పులుసు లు చెప్పాను కదా. ఇంకా ఆకు కూరలతో పులుసు కూరలు కూడా చేయవచ్చని మా కుక్ రాణి గారు ఉదయాన్నే నాకు గీతోపదేశం చేసింది అన్నీ వంటలే చెప్పానని అనుకోకండి. మధ్య మద్యలో మన వంటలు గుర్తు చేసుకోక పోతే ఈ పిజ్జా లలో పడి మరచి పోతాం కదా
అసలు వేసవి అంటేనే కొత్త ఆవకాయ మల్లేలు మామిడి పండ్లు కదా so మీరు కూడా ట్రై చేయండి మామిడి కాయ పులుసు
మా ఇంట్లోనూ వరుగులు పెట్టేవారు . దేనితో పెట్టేవారో నాకు గుర్తులేదు . కానీ కూరగాయలు లేనప్పుడు అన్నంలోకి వీటితో అధరువులు చేసేవారు .