మా ఇంటి అరుగు
- murthydeviv
- 2 hours ago
- 2 min read
ఈ మధ్య ఫేస్ బుక్ కి ఒక వారం ప ది రోజుల నుండి దూరంగా వున్నాను.. త్వరగా లేచిన రోజు వీర తాడులు వేయించుకోవటానికి ట్రై చేయటం , లేకపోతే అరే నిద్ర లేవ లేదు అయ్యో అనుకోవటం సరి పోయింది.
ఇంట్లో ఏవో ఫంక్షన్స్ ,చుట్టాలు ఆలా గడిచి పోయింది. ఈ రోజు రజని గారి ఫేస్ బుక్ ముచ్చట్లు చదువుతూ ఉంటే నాకు చిన్నప్పుడు మన ఇళ్ల ముందు వుండే అరుగులు గుర్తుకి వచ్చాయి.
మా ఊహ తెలిసేటప్పటికే తాత గారు పాత పెంకుటిల్లు పక్కన పెద్ద మేడ కట్టించినా ఎక్కువగా భోజనాలు, వంటలు పాత ఇంటిలోనే జరిగేవి.
ఆ పాత యింటికి ముందు పెద్ద అరుగులు ఉండేవి, ఇంటి ముందు ఎప్పుడూ తాటాకు పందిరి ఉండేది. తాతగారు ఉదయాన్నే పూజ అయ్యాక ఒక గంట పురోహితుల చేత రామాయణం, భాగవతం చదివించుకునే వారు.
ఆయన కార్యక్రమం అయి భోజనాలు అవగానే , ఆ అరుగులు మీద ఇరుగు పొరుగు ఆడవాళ్లు
వచ్చి, కబుర్లు చెప్పుకుంటూ బియ్యం, పప్పులు బాగుచేసుకునే వారు.
వీలు అయితే అక్కడే ఒక కునుకు తీసే వారు.
మూడు గంటల నుండీ అందరూ ఆ అరుగుల మీదే రాసులుగా పూలు పోసుకుని మాలలు కడుతూ వుండే వారు. ఆరోజుల్లో ఏ రోజు అయినా అందరం సాయంత్రం జడ వేసుకుని పూలు పెట్టుకోవాల్సిందే , కాలేజీ లో చదుకునే టప్పుడు కూడా పూలు పెట్టుకునే వెళ్ళే వాళ్లము.
ఇంకా సాయంత్రం పిల్లలము ఆ పందిరి కింద ఆ అరుగుల మీద రక రకాల ఆటలు
ఆడే వాళ్లము. కొంచెం పెద్ద మొగ వాళ్ళు అక్కడే కూర్చుని ఏవో కబుర్లు చెప్ప్పుకునే వాళ్లు.
ఇంక రాత్రి ఏడు గంటలకు ఒక ప్రైవేట్ మాస్టర్ గారు వచ్చే వారు, చుట్టు పక్కల పిల్లలు కూడా వచ్చి అక్కడే చదువు కునే వారు.
కరెంటు బల్బ్ లు లేని రోజుల్లో లాంతర్లు పెట్టుకుని చదువుకునే వారు.
ఆలా ఆ అరుగులు మీద చదువుకుని ఐ ఐ టి లో చదువుకుని యూ ఎస్ లో సెటిల్
అయిన మా పురోహితుడి గారి ఆబ్బాయి ఈ మధ్య వచ్చి ఆ అరుగుల మీద చదువు , ఆటలు తలచుకుని తెగ మురిసిపోయాడు
తాత గారు మేడ కూడా అరుగులు కట్టించారు కానీ అవీ అంత విశాలం గా ఉండేవి కాదు. మా నాయనమ్మ గారు మాత్రం సాయంత్రం ఆ అరుగు మీద కూర్చుని వచ్చే పోయే వాళ్ళ ను పలకరిస్తూ పండ్లో పూలో ఇస్తూ ఉండేదిట .
ఇంతకీ ఆ అరుగులకి ఈ ఫేస్ బుక్ కి పోలిక ఏమిటీ అనుకుంటున్నారు కదా .
వాళ్లు ఆ రోజుల్లో ఏదో పనులు చేసుకుంటూ లోకాభి రామాయణం మాట్లాడు కునే వారు.
మనము మన పని అయ్యాక ఈ ఫేస్ బుక్ లో కబుర్లు మొదలు పెడతాము.
ఇందులోనే లైక్స్ , వాదన లు , ఎన్నో నడుస్తూ వుంటాయి..
మనిషి ఎప్పుడూ సంఘ జీవి కదా, ఇప్పటికీ కొన్ని కాలనీ ల్లో, అపార్ట్మెంట్స్ లో సాయంత్రం అయ్యే సరికి వాకింగ్ పేరుతొ వచ్చి కబుర్లు చెప్పుకుంటూ వుంటారు.
స్థలం మారింది కానీ మనిషి తత్వం మారలేదు. అనేది నా ఊహ అదీ ఫేస్ బుక్, వాట్సాప్ ఇంస్టా కావచ్చు .
Comments