ఆబ్బాయి పెళ్లి
- murthydeviv
- 4 hours ago
- 2 min read
అదే పనిగా ఫోన్ మోగుతూ ఉంటే చూస్తే మా కజిన్ చాలా కంగారుగా నాలుగు గంటలకు పెళ్లివారు వస్తారే బాబూ , నీవు బావగారు త్వరగా రండి ఇక్కడే భోజనాలు అన్నది.
కంగారు పడకు మేము లంచ్ కి రాము, 3 గంటలకు అక్కడ ఉంటాము అంటే మీరు లేట్ అయితే , అసలే శనివారం హైదరాబాద్ ట్రాఫిక్, మా బుద్ధా వతారం కి ఏమీ తెలియదు అంటూ గొడవ .
నా కజిన్ తన శ్రీవారు కి పెట్టుకున్న ముద్దు పేరు, నేను నవ్వుతూ లేదులే మూడు గంటలకు అక్కడ ఉంటాము అన్నాను.
మా కజిన్ కి ఒక్కడే కొడుకు ఇంజినీరింగ్ ఎమ్ బి ఏ చేసి ఐ సీ ఐ సీ బ్యాంకు లో మంచి పొజిషన్ లోనే వున్నాడు.
ఈ రోజుల్లో మగ పిల్లలు తల్లి తండ్రులు కష్టాలు చెప్పేదేముంది. సంబంధం కోసం ఎవరికైయినా ఫోన్ చేస్తే , మేము సాఫ్ట్ వేర్ వాళ్లనే చూస్తున్నాము ఆ ని ఫోన్ పెట్టేస్తారు.
ఒక వేళ ఎవరైనా కొంచెం మర్యాద గా మాట్లాడినా ,మా అమ్మాయి బయట హోటల్ లో కలిసి మాట్లాడుతుంది అనటం ఒక ఫాషన్ అయిపోయింది.
మా కజిన్ అతి కష్టం మీద కొడుకు ని వప్పించి ఒకటి రెండు సార్లు పంపాక
ఇంక వాడు నేను వెళ్ళను,అసలు నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు ఆని గొడవ.
ఇప్పుడు అయినా ఆ అమ్మాయి ఎవరో బ్యాంకు కి ఏదో పని మీద వచ్చిందిట,
కొంత పరిచయం అయ్యాక పెళ్లి ప్రొపోజ్ ల్ చేసిందిట..
ఈ రోజు తన పేరెంట్స్ వీళ్ళ యింటికి వస్తామన్నారు. ఒక వారం రోజులు నుండీ నా కజిన్ నానా కంగారు పడుతూ , అన్నీ రకాల మొక్కులు మొక్కుతూ రోజు కు రెండు మూడు సార్లు నాకు ఫోన్ చేస్తూ ఒకటే హడావిడి.
మేము వెళ్ళాక మా అత్తగారికి చెప్పవే వాళ్ళని యక్ష ప్రశ్న లు వేయద్దు ఆని రిక్వెస్ట్ చేసింది . కానీ ఆ కాలం వాళ్ళు మన మాట వింటారా.
పెళ్లి వారు రావటం మర్యాద లు అన్నీ సవ్యంగా జరిగాయి, ఆ అమ్మాయి తల్లి మా కజిన్ భర్త ను, వాళ్ళ అమ్మగారి ని తే రి పారా
చూస్తూ మీది విజయవాడ కదా
ఆని అడిగింది.
వెంటనే మా కజిన్ అవును మా వారు బ్యాంకు ఆఫీసర్ రిటైర్ అయ్యాక ఇక్కడికి వచ్చాము అన్నది.
మంచి రోజు చూసి ముహుర్తాలు పెట్టుకుందాం అని వెళ్తూ నా ఫోన్ నెంబర్ అడ్రెస్ తీసుకున్నది.
మర్నాడే ఆవిడ దగ్గర నుండీ ఫోన్ , కాసేపు పిచ్చా పాటి అయ్యాక మీ కజిన్ అత్తగారు ఏమయినా మారిందా అన్నది.
అసలు సంగతి ఏమిటీ అంటే మా బుద్ధా వ తారం ఆ రోజుల్లో ఈవిడను చూసాడు.
ఈవిడ అన్నయ్యలు వెళ్ళితే ఆవిడ చెప్పిన లాంచనాలు లిస్ట్ కి భయ పడి వచ్చేసారుట. అందులో పెళ్లి కొడుకుకి వెండి కంచము చెంబు కాకుండా , ఆడపడుచులకు, అత్తగారికి పట్టు చీరలు, వెండి బిందెలు ఇలా ఎంతో లిస్ట్ చెప్పింది.
నేను వెంటనే అలా ఈ రోజుల్లో అబ్బాయిలు తీసుకోటానికి ఇష్టం పడరు కదండీ అన్నాను.
మా అమ్మాయి కూడా ఇవ్వటానికి వప్పు కోదండి అంటూ మీ కజిన్ అలా ఇష్టం మే కదా అంటూ ఆయన ఎక్కువ గా మాట్లాడడు అని తెలుసులెండి అన్నది.
ఓహో అందుకే ఆయనకు బుద్ధావతారం అనే పేరు పెట్టింది నా కజిన్ అనుకున్నాను.
భూమి గుండ్రంగా ఉండును అంటే ఇదే కదా అనుకున్నాను. ఆ అమ్మాయి ఏదో స్ట్రాటప్ కోసం బ్యాంకు కు వచ్చింది.
అలా కుదిరిన పెళ్లి కట్నాల గొడవ లేకుండా బాగా జరిగింది. బామ్మ గారి కి మాత్రం ఒక మంచి పట్టుచీర , వెండితో చుట్టిన పగడాల జప మాల ఇచ్చారు.
తన కొడుకుకి పెళ్లి అయితే చాలు అనే తపన తో మా కజిన్ ఏమీ అడగలేదు.
తర్వాత మాత్రం మా కజిన్ కి ఈ స్టోరీ అంతా చెప్పాను. అందుకే కదా ఈయనకి
ఆ పేరు పెట్టాను అన్నది.
ఈ రోజుల్లో అబ్బాయిలకు పెళ్లిళ్ళు అంటే నే ఇలా వున్నాయి. ఈ మధ్య ఏదో సంభందం ఇంకో కజిన్ కొడుకు కి చెప్తే హెచ్ 1 వీసా వున్న వాళ్లను చూస్తున్నా అంటుంది.
మా కు తెలిసిన వాళ్ళ ఆడపిల్లలు చక్కగా వుంటారు. ఇద్దరూ యూ ఎస్ లో , సింగపూర్ లో ఉద్యోగం చేస్తున్నారు. కానీ వాళ్ళ నాన్నగారు బామ్మగారు ఇంకా
అదే శాఖ లో జాతకం కలిసి మంచి ఫ్యామిలీ లో ఉండాలి అని మూడు ఏళ్లనుంచి
చూస్తున్నారు.
వాళ్లకు వంటరిగా అలవాటు అయిపోయి ఇంక పెళ్లి అక్కర్లేదు అనే స్టేట్ కి వస్తున్నారు.
ఏమిటో ఈ చక్ర భ్రమణం.
Comments