top of page
Search

మధుర గీతాలు ఏ ఎమ్ రాజా జిక్కి

  • murthydeviv
  • 4 hours ago
  • 3 min read

This site was designed with the

.com

website builder. Create your website today.

Start Now

T.B.L


Home

About

Subscribe

Search...

Facebook

Twitter

All Posts

మధుర గీతాలు ఏ ఎమ్ రాజా, జిక్కి

murthydeviv

23 hours ago

2 min read


పాత పాట లు వినే వాళ్లకు ఈ ఇద్దరి సింగర్స్ పేర్లు తెలుస్తాయి , బహుశా ఇప్పటి వాళ్లకి వీళ్ల పేర్లు తెలియవు.


నా కు కూడా ఇప్పుడు తెలుగు సినిమాల్లో పాటలు పాడే వాళ్ళ పేర్లు తెలియవు.


ఈ మధ్య ఎప్పుడో జిక్కి పాట యూట్యూబ్ లో విన్నాను కొంచెం ఫాస్ట్ గా వున్నది. జిక్కి అనగానే మనకు గుర్తు వచ్చేది పులకించని మది పులకించు , ఏరు వాకా సాగా రో, జీవితమే సఫలము



జిక్కి అనగానే ఏ ఎమ్ రాజా గారు గుర్తు వస్తారు, రాజా గ్గారు పదివేల పాటలు అన్నీ భాషల్లో పాడారుట


వంద సినిమాలు కు మ్యూజిక్ డైరెక్షన్ చేసారుట


మద్రాస్ పచ్చయప్ప కాలేజీ లో చదువుకున్న ఈయన ఆ రోజుల్లో నే సంగీతం నేర్చుకున్నారుట కళాశాల పోటిల్లో ప్రథమ బహుమతి కూడా పొందారుట.



రాజా గారు తెలుగులో తమిళం లో అనేక హిట్ సాంగ్స్ పాడారు పాత ప్రేమలేఖలు సినిమాలో అన్నీ పాటలు


రాజా , జిక్కి పాడారు , అరోజుల్లో హిందీ ఆహ్ పాటల తో సమానంగా తెలుగు ప్రేమ లేఖలు పాటలు


మారుమోగుతూ ఉండేవి.



ముఖ్యం గా జిక్కి పాడిన ఏకాంతము సాయంత్రము , పందిట్లో పెళ్లి అవుతున్నది ఇప్పుడు విన్నా మధురంగా వుంటాయి.


రాజా గారు పెళ్లి కానుక , శోభ, అమర సందేశం సినిమాలు మ్యూజిక్ డైరెక్షన్ చేసారుట .



పెళ్లి కానుక లో డ్యూయెట్స్ సుశీల గారు పాడినా , జిక్కి గారు పాడిన పులకించని మది పులకించు ఇప్పటికీ


నిత్య నూతనమ్ గా ఉంటుంది.


జిక్కి గారి మధుర మైన పాటలు చాలా వున్నాయి , అనా ర్కలి లో రాజా శేఖరా, జీవితమే సఫలము, శాంతి నివాసం లో రాధ రావే , కమ్ కమ్ , పాటలు, మిస్సమ్మ సినిమాలో రాగసుధ రస , లీల గారితో పాడిన త్యా గ రాజ కీర్తన


అన్నిటి కన్నా మిన్న అయిన ఆ రోజుల్లో గొప్ప హిట్ సాంగ్ ఏరువాక సాగా రో రోజులు మారాయి సినిమాలో


ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో మధుర మైన పాట లు వున్నాయి.



చెంచు లక్ష్మి సినిమా లో చెట్టు లెక్క గలవా పాట కూడా జిక్కి గారి గొంతు అనిపించింది


పాత ప్రేమ లేఖలు సినిమాలో జిక్కి గారి పాటలు అన్నీ ఆ రోజుల్లో చాలా ఫేమస్ అయినాయి.


ఏకాంతము సాయంత్రం పాట లో జిక్కి గారి స్వరంలో చాలా బాగా విషాదం నిండి వున్నట్లు అనిపిస్తుంది.



శోభ సినిమాలో అందాల చిందు తార రాజా గారితో పాడిన పాట దొంగ రాముడు లో ఘంటసాల గారితో చివురాకు లలో చిలకమ్మ ఎప్పటికీ నిత్య నూతనం గా వుంటాయి. ఆవిడ వి ఎన్నో సినిమాల్లో మధురమైన పాటలు వున్నాయి


లేటెస్ట్ గా సీతారామయ్య మనవరాలు , ఆదిత్య 369 లో కొన్ని పాటలు వున్నాయి .



ఇంక రాజా గారు పాడిన పాటల్లో విప్ర నారాయణ , చూ డు మదే చెలియా పాట వింటూ ఉంటే రాస క్రీడ చూస్తూ వున్నట్లు వుంటుంది, మిస్సమ్మ లో ప్రతి పాట ఒక ఆణిముత్యమే.


బంగారు పాప లో సుశీల గారితో పాడిన పాట పండు వెన్నెల , వెన్నెల లో విహరించినట్లే వుంటుంది.


అదే సినిమాలో యువ్వన మధువనిలో పాట కూడా చా లా బాగుంటుంది.



పాత పక్కింటి అమ్మాయి లో రేలంగి హీరో గా నటించిన సినిమాలో రాజా గారు యాక్ట్ చేసారుట ,


అశ్వద్దామ మ్యూజిక్ డైరెక్టర్ ట , అందులో పాట లు మొన్న ఎవరో రాజా గారి పుట్టినరోజు అని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు. నేను అంతకు ముందు వినలేదు , చాలా బాగుంది .



బంగారు పాప సినిమా కు మ్యూజిక్ డైరెక్షన్ అద్దే పల్లి రామారావు గారుట ఆయన పేరు ఎప్పుడూ వినలేదు ..


రాజా గారు శోభ సినిమా కు మ్యూజిక్ డైరెక్షన్ చేసారుట , అమర సందేశం అనే సినిమా పాటలు కూడా ఈయనకు మంచి పేరు తెచ్చాయిట ఆ సినిమా లో పాటలు ఎప్పుడూ విన లేదు


యూ ట్యూబ్ లో వున్నాయేమో చూడాలి.


అప్పు చేసి పప్పు కూడు లో జగ్గయ్య గారి పాటలు రాజా గారు పాడారు అనుకుంటా .



చండీ రాణి సినిమాలో ఘంటసాల భానుమతి వో తారక అనే పాట , శోభ సినిమాలో అందాలు చిందు తార రెండూ


ఎన్ని సార్లు విన్నా కొత్తగానే వుంటాయి.


అలాంటి స్లో పాట హేమంత్ , లతగారి ఆ నీలి గగన్ కే తలే సినిమా పేరు తెలియదు వింటూ ఉంటే ఎంతో హాయి గా వుంటుంది


రాజా గారు కొన్ని ఎంకి పాటలు కూడా పాడారు , యూ ట్యూబ్ లో వున్నాయి.



ఏ కాంతము అనుకోకుండా హాయిగా పాత పాట లు వింటూ ఎంజాయ్ చేయండి



శుభరాత్రి




 
 
 

Recent Posts

See All
ఆబ్బాయి పెళ్లి

అదే పనిగా ఫోన్ మోగుతూ ఉంటే చూస్తే మా కజిన్ చాలా కంగారుగా నాలుగు గంటలకు పెళ్లివారు వస్తారే బాబూ , నీవు బావగారు త్వరగా రండి ఇక్కడే భోజనాలు అన్నది. కంగారు పడకు మేము లంచ్ కి రాము, 3 గంటలకు అక్కడ ఉం

 
 
 
మధుర గీతాలు ఏ ఎమ్ రాజా, జిక్కి

పాత పాట లు వినే వాళ్లకు ఈ ఇద్దరి సింగర్స్ పేర్లు తెలుస్తాయి , బహుశా ఇప్పటి వాళ్లకి వీళ్ల పేర్లు తెలియవు. నా కు కూడా ఇప్పుడు తెలుగు సినిమాల్లో పాటలు పాడే వాళ్ళ పేర్లు తెలియవు. ఈ మధ్య ఎప్ప

 
 
 
వంట ల కబుర్లు

ఈ మధ్య మా అమ్మాయి వాళ్ళింటికి వెళ్ళాను. ఉదయాన్నే కాఫీ కోసం కిచెన్ లోకి వెళ్ళ గానే, అక్కడే వున్న కుక్ రాణి గారు అయ్యో నేను ఇస్తా కదండీ, అంటూ మర్యాద చేసింది. నా కాఫీ నేను కలుపుకుంటె కానీ నచ్చదు కదా అ

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page