బెజవాడ
- murthydeviv
- Mar 20
- 2 min read
నాలుగు రోజుల క్రితం మా మేన కోడలు ఆమెరికా నుంచి వచ్చి వాళ్ళ అబ్బాయికి ఉపనయనము చేశారు. వాళ్ళ అత్తగారు వాళ్ళ సొంత ఇంట్లో చేయాలి అని కోరితే బెజవాడలో పెట్టుకున్నారు. కొంచెం పెద్ద వయసు వచ్చాక మనం చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలు, ఊర్లు చూస్తుంటే ఏదో ఆనందం కలుగుతుంది. కారణం తెలియదు. ఆ వడుగు కోసం మేము కారులో హైదరాబాద్ నుండి కారు లో బయలుదేరాము. పూర్వము లాగా సింగిల్ రోడ్డు కాదు, ఆ రోజుల్లో ఏవో చిన్న కాకా హోటల్ వుంటే ఆగి ఒక కప్పు టీ లేక కాఫీ తాగి కుదుపుల తో ఒళ్లు హూనం అయ్యి బెజ్ వాడ చేరే వాళ్ళము. ఇపుడు మనం కాస్త కళ్లు మూసుకుంటే డ్రైవర్ నాలుగు గంటల్లో చేరుస్తాడు. రోడ్ కు రెండువైపులా కుంభకోణం కాఫీ చెన్నపట్నం కాఫీ ఇంకా కాఫీ డే లు , ఎందుకో కాఫీ పుట్టిల్లు కేరళ ను మర్చిపోయారు. యింకా ఫుడ్ కోర్టు లకు లెక్క లేదు. రాజు గారి రుచులు, గోదావరీ రుచులు అలా అన్నీ రుచులు చూడచ్చు. నాకు ఆంధ్రా కి ఎపుడు వెళ్ళినా చాలా బాధ వస్తుంది. ముందు చెన్న పట్నం మనది అనుకున్నాము. వాళ్ళు మనల్ని వెళ్ళ మన్నారు. అపుడయినా ఆంధ్రా లోకి రాకుండా హైద్రాబాదు మనది అనుకున్నాము. ఇపుడు మన గుంటూరు, బెజవాడ ఎపుడు డెవలప్ చేసుకుంటామో అని బాధ వస్తుంది. మా అమ్మాయి తో బేజ వాడ చూడగానే ఏదో ఆనందం వస్తుందని అనగానే ఇది మీ వూరు కాదు కదా అన్నది. సరే ఇంక మా మనవరాలు అక్కడ విజయ వాడ అని వుంది కదా నీవు ఎందుకూ బే జ వాడ అంటావు అని ప్రశ్న అడిగితే మరలా బ్రిటిష్ వాళ్ళని తలచుకొని వాళ్ళకి పలకని పేర్లు ఎలా మార్చారో చెప్పి, ఇక్కడ ఎండల, తీవ్రత గురించి చెప్పాను. అందరికీ హోటల్ రూమ్‌లు బుక్ చేశారు. కొంచెం ఫ్రెషప్ అయ్యి వాళ్ళింటికి వెళ్ళాము. ఆ ఇల్లు గవర్నరు పేట్ లో వున్నది ఆ ఇల్లు కట్టి 100ఏఏండ్లు ఆయింది ట యింకా స్ట్రాంగ్ గా ఉన్నది. చుట్టూ స్థలం పెద్ద చెట్లు చాలా హాయిగా అనిపించింది. నాకు ఏ పాత ఇళ్ళు చూసినా చాలా ఆనందం గా వుంటుంది. ఏ భవనం అయినా చిన్న ఇల్లు అయినా నాలుగు గోడలు పైన కప్పు కిటికీలు తలుపులు వుంటాయి. అయితే ప్రతి ఇంటికి ఒక చరిత్ర, అనురాగాలు, సుఖ దుఃఖాలు ఆ యింటి గోడలతో పెనవేసుకొని వుంటాయి. ఆ ఇల్లు ఒక మధురమైన జ్ఞాపకాల పందిరి లాగా అనిపిస్తుంది. ఆ ఇల్లు చరిత్ర గురించిన ఒక ప్రింటెడ్ పేపర్ రాసి అక్కడ గోడ కు వున్నది. విజయవాడకు వాళ్ళ పూర్వీకులు 1800 శతాబ్ది లోనే వచ్చారు. విజయ వాడ మున్సిపల్ చైర్మన్ గా వున్నారు. అఖిల భారత కాంగ్రెస్ మహా సభలు అయ్యదేవరకాళేశ్వరరావు గారి ఆధ్వర్యం లో జరిగినపుడు ఆ ఇంట్లో జాతీయ నాయకులకు ఆ ఇంట్లో నే ఆతిధ్యం యిచ్చారు అని కూడా వ్రాశారు. ఈ వివరాలన్నీ అయ్యదేవరకాళేశ్వరరావు గారి స్వీయ చరిత్ర లో వ్రాసివున్నట్లు ఆ పేపర్ లో వున్నది. ప్రస్తుతము మా మేనకోడలు మామగారు ఆ ఇంట్లో ఉపనయనము చేయాలనీ నిర్ణయించటం చాలా ఆనందంగా అనిపించింది. ఆ మర్నాడు చాలా మంది బంధువులు వచ్చారు. అందరూ అయింటితో తమ కు వున్న అనుబంధం గుఱించి మాట్లాడు కున్నారు. నేను కూడా ఒకళ్ళిద్దరిని వాళ్ళు ఎలా బంధువో అని అడిగాను. అవిడ ఆ యింటి యజమాని కి కజిన్ సిస్టర్ కానీ ఆవిడ పెళ్ళి, మూడు నిద్రలు అన్నీ ఇక్కడే జరిగాయి అని ఆనందంగా చెప్పింది. ఆ రోజుల్లో పెళ్ళిళ్ళ కు సత్రాలు ఉండవు కదా పెద్ద ఇళ్లు వున్న వాళ్ళ ఇంట్లో చేసే వారు. అందరూ పెద్దవాళ్ళు అయినా ఓపికగా వచ్చారు చాలామంది హైద్రాబాద్ నుంచి వచ్చారు. ఆ రోజుల్లో ఆ ఊర్లలలో చాలామంది బ్రాహ్మలు వుండే వారు. ఇపుడు ఆ సంఖ్య కూడా తగ్గి పోయింది. ఏ పాత ఇళ్ళు అయినా ఒక చరిత్ర వుంటుంది. ఈ రోజుల్లో ల్యాండ్ ధర ను కాకుండా ఆ ఇళ్ళు ఒక మాన్యుమెంట్ లాగా చూడాలి అనుకుంటాను.మా అమ్మాయి ఫిట్స్ బర్గ్ లో ఒక ఇంటికి తీసుకుని వెళ్ళింది.అది హెన్కో టొమాటో సాస్ వాళ్ళ ఇల్లుట, ఇపుడు ఆ సాస్ లేదు కానీ ఆ ఇల్లు మాత్రమ్ వారానికి రెండు సార్లు విజిటర్స్ కు చూపిస్తారు. అన్నింట్లో ఆమెరికా లో లాగా వుంటాము. కానీ ఇలాంటి వాటి గురించి పట్టించుకోము. ఆ ఇల్లు చూడగానే ఎందుకో ఇలా రాయాలి అనిపించింది. 👍 గుడ్ లక్ టూ సింగరాజు ఫ్యామిలీ
మీరూ వుంటే అలా జ్ణాపకాలు కలపోసు కుంటూ ఉండే వాళ్ళం
మీ బెజవాడ కబుర్లు బాగున్నాయి .