పంజాబ్ లో దసరా కు బెంగాల్ లో లాగా అంత హంగామా వుండదు. డిల్లీ లో ఒక్కసారి రాంలీలా మైదాన్ కి వెళ్ళాము. అక్కడ ఆ రష్ లో ఎక్కడ తప్పిపోతా మో అనే టెన్షన్ తో ఏమి ఎంజాయ్ చేయలేము. కానీ ఒక టవున్ లైఫ్ నుంచి వచ్చి అంత సిటీస్ లో అలా చూస్తుంటే చాలా ఆశ్చర్యం గా వుంటుంది. దీపావళి కి మాత్రం పంజాబ్ లో చాలా హడావిడి వుంటుంది. ముందు ఆ స్వీట్ షాపులు మనం సంక్రాంతి కి బొమ్మలు పెట్టినట్లుగా స్వీట్స్ అన్నీ అరలు అరలు గా పేర్చి పెడతారు. పండగ వచ్చింది అంటే చిన్న పెద్దా అందరూ ఒకరినొకరు హగ్ చేసికుంటూ ముబారక్ లు చెప్పుకోవాలిసిందే. ఇంక స్వీట్స్ పాకెట్స్ ఎలా వచ్చేవంటే ఒక నెలరోజులు కూర్చుని తినవచ్చు. ఇంక మా బ్రహ్మచారి హిందీ మరుదులు, మిలటరీ తమ్ముళ్ళ భోజనాలు సరే సరి. ఎక్కువ ఎక్సపెరిమెంట్స్ చేయకుండా నేను పులిహోర రవ్వ లడ్డు లాంటివి చేసేదాన్ని. ముందు రోజు, లేకపోతే ఆ పండగ ముందో వెనకో జి ఎమ్ గారు మాత్రం పార్టీ ఇచ్చే వారు. దీపావళి సందడి పౌర్ణమి దాకా వుండేది. కార్తీక పౌర్ణమి గురునానక్ జయంతి ఉత్సవాలు యూనివర్సిటీ లో. బాగా జరిగేవి. బాగా టపాకాయలు కూడా కాల్చేవారు.ఒక పదిహేను రోజులు హంగామా గా వుండేది. ఇంక హోలీ పండుగ గురించి చెప్పక్కర్లేదు. నాకు అసలు హోలీ అనే పండగ వుంటుందని కూడా తెలియదు. ముందు రోజు స్కూల్లో నే అందరూ రంగులు పూసి పెట్టారు. నీవు వద్దని చెప్పకపోయావా అని మావారు కామెంట్. మర్నాడు ఫ్రెండ్స్ రాగానే ఈయన నాకు ఇష్టం ఉండదు నాకు పూయకండి, అని గొడవ, వాళ్ళు మాత్రం నయా నయా షాది హువా అభతో హమ్ లాగనా హై అంటూ మమ్మల్ని రంగుల్లో ముంచి స్వీట్స్ పెట్టీ వెళ్ళారు. తర్వాత ఏడాది మాత్రము పాప వచ్చింది కదా, ఆ రంగుల్లో నన్ను పాపను ముంచి వెళ్ళారు. ఈయనకు మాత్రమ్ a పండగ అంటే ఎపుడూ విసుగూ కోపము. అక్కడ స్వీట్స్ లో బూడిద గుమ్మడి హల్వా షాపుల్లో అలా పేర్చి పెట్టీ వుంటే ఏమిటో అనుకున్నాను కానీ ఆ స్వీట్ అంటే వాళ్ళకు చాలా ఇష్టంట . అగ్రా లో ఒక వీధి అంతా ఆ స్వీట్ అమ్ముతారుట. అక్కడ మా పాపకు రెండు పుట్టినరోజులు చేశాము. కేరళ ఫాదర్ వాళ్ళ వంట వాడు వచ్చి వంటలు అన్నీ చేశాడు. రెండు పుట్టిన రోజులు చాలా బాగా జరిగాయి. వేరు వేరు రాష్ట్రాలు, నుంచి వచ్చినా, అందరం ఒక కుటుంబము లాగా కలిసి మెలసి వుండేవాళ్ళం. ఒకసారి కెమిస్ట్రీ రావు గారి అబ్బాయి బలే అల్లరి చేసేవాడు, స్కూల్ బస్ లో నుంచి దూకాడు చెయ్యి ఫ్రాక్చర్ అయి హాస్పిటల్ లో వుంటే, మేము పది రోజులు వాళ్ళింట్లో వుండి హెల్ప్ చేశాము. అంత అల్లరి చేసినవాడు మంచి కాలేజ్ లో ఇంజినీరింగ్ చేసి ఇపుడు దుబాయ్ లో పెద్ద జాబ్ లో వున్నాడు. ఒక మిలటరీ పనిచేసే అబ్బాయికి జబల్ పూర్ ట్రాన్సఫర్ అయి వెళ్తూ ఒకటే ఏడుపు, అక్కడ ఇంత మంచి కంపెనీ దొరుకుతుందో లేదో అని. ఉత్తర ప్రదేశ్ తివారీ భార్య చాలా అమాయకంగా వుండేది. హిందీ తప్ప వేరే భాష ఏది రాదు. ఫ్రాన్స్ వెళ్ళాక అసలు అడ్జెస్ట్ అవలేక పోతున్నదని లెటర్స్ రాసే వాడు. బహుశ పిల్లలు పుట్టాక అలవాటు అయి వుంటుంది. మావారు పిలా నీ వెళ్ళి వెళ్లి అక్కడ ఒక ప్రొఫెసర్ ప్రోద్బలంతో వ్యాపారము పురుష లక్షణము అనుకొని హైదరాబాదు వచ్చి ఇండస్ట్రీ పెట్టారు. ఆ ప్రొఫెసర్ ఢిల్లీ లో లైసెన్సులు అవీ రావటానికి సహాయము చేశారు. అలా ఆంధ్రా లో ఫస్ట్ టీ వి కంపోనెంట్స్ ఇండస్ట్రీ పెట్టారు. అలా మరల మేము ఉత్తర భారతం నుంచి దక్షిణ భారత దేశం కి తరలి వచ్చాము. కానీ ఏ వసతులు లేని ఆరోజుల్లో , ఆ రైలు ప్రయాణాలు, ఫోన్స్ లేకపోయినా ఉత్తరాల్లో ఒకరి కొకరం కమ్యూనికేట్ చేసుకుంటూ, ఆనందం గానే వున్నాము అనిపిస్తుంది. చండీ ఘడ్ వెళితే దొరికిన దోశ, ఇడ్లీ రుచి అమోఘం అనిపిస్తుంది. జీవితము ఒక ప్రవాహము. కొన్ని రోజలపాటు కలసి ప్రయాణం చేసినా ఎక్కడో, అక్కడ విడిపోవాల్సిందే. చివరకు మిగిలేది జ్ఞాపకాలు.అవి మధురముగా ఉన్నాయా లేవా అనేది మనం చూసే దృష్టి లో వుంటుంది. ఇంకా కొన్ని విశేషాలు తో రేపు
దీపావళి
murthydeviv
Comments