top of page
Search

టిఫిన్ బాక్స్

murthydeviv
11 minutes ago
3 min read

శ్రీశ్రీ గారు కాదేది కవిత కనర్హం అగ్గిపుల్ల, సబ్బు పెట్టే గురించి కూడా రాయచ్చు అన్నారు . అలాగే మొన్న ఎవరో ఫేస్ బుక్ లో పనిమనిషి తీసుకుని వెళ్లిన టిఫిన్ బాక్స్ గురించి కధ రాసారు .


ఆ కథ చదివితే నాకు కూడా ఏవో కొన్ని సంగతులు గుర్తు వచ్చాయి. చిన్నప్పుడు స్కూలుకి వెళ్ళేటప్పుడు లంచ్ కి రాలేము ఆంటే మా ఆమ్మ గారు ఒక మూడు గిన్నెలు క్యారేజ్ ఇచ్చేవారు.

అబ్బా ఇదీ మోయటం కంటే నడిచి లంచ్ కి యింటికి రావటం నయం ఆనుకుని యింటికి వచ్చే వాళ్లము.


కాలేజీ కి వచ్చాక యింటికి ఎలాగూ రాలేము , కాలేజీ ఐదు మైళ్లు దూరం లో వుంది . కాలేజీ కి బ్యాగ్ లు తీసుకెళ్లే వాళ్లము కాదు. బోటనీ, జూ అలజీ రికార్డ్స్ , ఈ బుక్స్ తో పాటు ఒక టిఫిన్ బాక్స్ ఇచ్చే వారు.


నేను క్యారెజ్ తీసుకుని వెళ్ళను అని గొడవ పెడితే ఒక స్టీల్ టిఫిన్ బాక్స్ తెచ్చారు మా నాన్న గారు.

ఆయన అసలు షాపింగ్ లు అవీ ఏమీ చేయరు , ఎలా తెచ్చారా అని ఇప్పుడు ఆలోచిస్తూ వుంటాను.


నేను మా ఆమ్మ గొడవ పడటం చూసి ఆయన ఊర్లు తిరుగుతూ వుండే వారు ఎక్కడయినా తెచ్చారేమో అని ఇప్పుడు అనుకుంటాను.

ఆ బాక్స్ చాలా పెద్దగా వుంది అని నసుగుతూ అలాగే తీసుకుని వెళ్లేదాన్ని. నా పెళ్లి అయి పంజాబ్ వెళ్ళేటప్పుడు అమ్మ పసుపు తో నింపిన స్టీల్ చెంబు ఇస్తూ , ఈ బాక్స్ కూడా నాన్న నీ కోసమే తెచ్చారు అంటూ మిగతా స్టీల్ సామాను తో ఇచ్చింది.


అదేమిటో కొన్ని వస్తువులు ఆంటే అనుకోకుండా మమకారం ఏర్పడి పోతుంది. మేము పంజాబ్ లో ఉండగానే నాన్న గారు వెళ్లిపోయారు. ఆ బాక్స్ ఎప్పుడూ నా బీరువా లోనే ఉండేది.


ఎప్పుడో ఒకసారి ఏవో గొలుసులు అవీ పెట్టుకుని మా అమ్మాయి తీసుకుని వెళ్ళింది , మర్నాడే నా బాక్స్ తెచ్చివ్వు అంటూ మా అమ్మాయికి నాలుగు సార్లు ఫోన్ చేశాను .

ఈ బాక్స్ లో ఏమీ పెట్టకు మిస్ అవుతుంది ,అని తిరిగి ఇస్తూ చెప్పింది. అలాగే మా నాన్న గారు అరోజుల్లో మా పెద్ద పాప పుట్టినప్పుడు కంచి నుంచీ నేను కోరితే తెల్లటి పట్టు చీర ఎర్రటి జరీ బోర్డర్ తో వున్న చీర తెచ్చారు


ఆ రోజుల్లో ఆ చీర ఖరీదు a150 రూపాయలు 50 ఏళ్లు అయినా జరీ మెరుస్తూ చక్కగా వున్నది. మొన్న

మా అమ్మాయికి ఇస్తూ ఉంటే తాతయ్య తెచ్చాడు కదా ఎందుకు ఇస్తున్నావు అన్నది .


నీవు పుట్టిన అప్పుడు తెచ్చాడు కదా తాతయ్య గుర్తుగా ఉంచుకో అన్నాను. మా పిల్లలు ఎవరూ మా నాన్నగారిని చూడనే లేదు .


హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో నేను మా వదిన పెద్ద ఫ్యామిలీ లు కదా అని స్టీల్ సామాన్లు కొంటూ ఉండేవాళ్ళము.

వాటి మీద మా వారి పేరు, అన్నయ్య పేరు వేయిస్తూ వుండే వాళ్లము .


సామాన్లు తీసుకుని వెళ్ళే దొంగలు మా పేర్లు చూసి వదిలేస్తారా అంటూ ఇద్దరూ జోక్స్ వేస్తూ ఉండేవారు..

అప్పుడే పిల్లలు కి సరదాగా చిన్న చిన్న చెంబులు మంచినీళ్లు కి అని కొన్నాము


చిన్నప్పుడు ఇది నా చెంబు నాపేరు వుంది , అంటూ భోజనం చేసే టప్పుడు పెట్టుకునే వాళ్ళు , అవీ జాగ్రత్తగా ఉంచి

మీ పిల్లలు కి పెట్టండి ఆంటే అవీ నీ మధుర స్మృతులు నీ దగ్గరే ఉంచుకో అంటారు .


ఇంక మా మనవరాలు అయితే ఇందులో వాటర్ తాగాలా ఇట్స్ ఫన్నీ అన్నది . ఫ్రిడ్జ్ లో బాటిల్ ఎత్తుకుని ఎంగిలి చేస్తూ తాగే వాళ్లకి ఈ చెంబులు గ్లాసులు ఎందుకు ఆనుకున్నాను.


మా చిన్న తనము లో అయితే పీటలు, కంచాలు గ్లాసులు ఎవరివి వాళ్ల వి సెపెరేట్ గా ఉండేవి.

ఎవరైనా కంచము , గ్లాస్ మారిస్తే గొడవ అయిపోయేది .


మా బాబాయి గారి ఆబ్బాయి మద్రాస్ లో ఉండేవారు , తన కు ఎంత పర్టికులర్ ఆంటే సెలవల్లో మా ఊరు వస్తే జేబులో మంచినీళ్లు గ్లాస్ తెచ్చుకునే వాడు.

తర్వాత పంజాబ్ లో మా యింటికి వస్తూ వుండే వాడు , ఎప్పుడు వచ్చినా ఒకటే గ్లాస్ కంచము దాచి అన్నయ్య కు పెట్టే దాన్ని .


అన్నయ్య నవ్వుతూ ఇప్పుడు అంత పిచ్చి లేదులే భయపడకు అనే వాడు .


అరోజుల్లో భోజనం చేసాక ఎవరి కంచం వాళ్ళు ఎత్తాలి , పీట ఎత్తాలి , పీట తీయక పొతే యముడు పీట కింద నుంచీ దూరమంటాడు అని భయ పెట్టేది మా చిన్న బామ్మ గారు.


మగ పిల్లలు ఎంగిలి కంచాలు తీయ కూడదు అనే రూల్ ఉండేది. ఆ రోజుల్లో అన్నీ ఆలా నమ్మే వాళ్లము .


ఇప్పుడు ఈ మాట చెపితే మా అమ్మాయిలే ఒప్పుకోరు ముందు , మా అత్తగారు అనే వారు యుగం మారింది అని ఆలా ఎన్ని మార్పులో.


మా పెద్ద పాప చిన్నప్పుడు చిన్న పూజ పాత్ర పట్టుకుని పూలు కొస్తూ ఉండేది , ఇప్పటికీ దేవుడి గదిలో అలాగే వున్నది

తీసుకోమంటే వాళ్ళ సమాధానం ఒకటే నీ తీయటి జ్ఞాపకాలు అంటూ వుంటారు.


మా అమ్మగారు రామ లక్ష్మణుల్లగా వుండే రెండు పెద్ద జాడీలు నీ కూతుర్లకు ఇవ్వ వే అంటూ ఇచ్చారు .


ఆ రెండు జాడిల్లో ఈ రోజుల్లో ఎ ఊర గాయ పెట్ట లేము , ఆలా అటక మీద కొన్ని ఏళ్ల నుండీ వున్నాయి.


మొన్న నే ఐడియా వచ్చింది , వాటి మీద ఏవో పూలు పెయింట్ చేసి ఫ్లవర్ వా జ్ లాగా పెట్టుకోండి అని ఇవ్వాలి


ఎప్పుడో చిన్నప్పుడు చేసిన ఫాబ్రిక్ పెయింటింగ్ , గ్లాస్ పెయింటింగ్ గుర్తు తెచ్చుకోవాలి.


మా చిన్నప్పుడు ఇంజెక్షన్స్ సీసా ల తో అరా ల్ డైట్ తో అతికించి మందిరాలు, ఇంకా రక రకాలుగా చేసే వాళ్లము.

ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరో చాలా బాగుంది ఎవరు చేసారు అని అడిగితే

మా నాన్న గారు మా పిల్లలు కి తోచక ఏవో చేస్తూ వుంటారు అని చెప్పారు.


ఆలా ఉండేది ఆ రోజుల్లో కళా పోషణ అవీ ఈ నాటి కబుర్లు


శుభ రాత్రి



I











 
 
 

Recent Posts

See All
,

: ‘ఈ కోరిక తీరేనా?’ ఉదయాన్నే నిద్రలేస్తూనే గుర్తు వచ్చింది. ఈ రోజు జులై రెండో తారీకు అనీ, ఈరోజున నాకు స్నేహితురాలు కమ్ మేనత్త కూతురు అయిన విజయ పుట్టినరోజు అని. వెంటనే నిద్ర మత్తు వదలించుక

 
 
 
పేరంటం

శ్రావణ మాసం అనగానే పేరెంటాలు గుర్తు వస్తాయి కదా. ఇప్పుడు కూడా శ్రావణ శుక్రవారం మంగళవారం పేరెంటాలు కమ్యూనిటీ ల్లో చాలా బాగా జరుగుతున్నాయి. ఆమ్మ వార్ల ను కూడా ఎంతో అందముగా చుట్టూ రంగు బల్

 
 
 
అమ్మ పాటల పుస్తకం

ఈ శ్రావణ మాసం , దసరాలు పండుగలు రోజుల్లో మా అమ్మ గారి పాటలు అలా మనసులో మెదులుతూ వుంటాయి. మా ఇంట్లో మా పెద్ద అత్తయ్య, మా పెద్దమ్మ గారు చాలా పాటలు రాశారు. మా అత్తయ్య గారు ఎక్కువగా శ

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page