top of page
Search

,

murthydeviv
3 days ago
3 min read




















: ‘ఈ కోరిక తీరేనా?’


ఉదయాన్నే నిద్రలేస్తూనే గుర్తు వచ్చింది. ఈ రోజు జులై రెండో తారీకు అనీ, ఈరోజున

నాకు స్నేహితురాలు కమ్ మేనత్త కూతురు అయిన విజయ పుట్టినరోజు అని. వెంటనే నిద్ర మత్తు వదలించుకుని కిందికి పరిగెత్తాను..


తనకి అందరికన్నా ముందు నేనే ఫోన్ చేసి చెప్పాలి. ఉదయాన్నే అయితే

అక్కడ మా మామయ్య , ఇక్కడ నాన్నగారు ఇంకా పూజలలో ఉండి ఫోన్ దగ్గరికి రారు.


ఫోన్ మోగగానే, మా బావ ఫోన్ ఎత్తాడు.

“హల్లో” అని నేను అనగానే,

“మీ కబుర్లకు తెల్లవారిందా? ఏమిటీ విశేషం అప్పుడే ఫోన్ చేసావు?” అన్నాడు.


“విజయని పిలు.” అంటూ నేను దబాయించాను ,


“సరేలే! ఎప్పుడో దొరుకుతావుగా!” అంటూ ఫోన్ విజయకి ఇచ్చాడు.


“పుట్టినరోజు శుభాకాంక్షలు విజయా! ఇవాళ మనం అనుకున్న ప్లాన్

వుందా?” అని చాలా చిన్నగా అడిగాను.


“పుట్టినరోజు నాడు సినిమా ఏమిటే? అమ్మ తిడుతుందేమో?, అయినా ట్రై చేస్తాను. నువ్వు మాత్రం త్వరగా వచ్చేయి” అంది.


“స్కూలు ఎగొట్టి సినిమాకి ప్లాన్ ఏమిటే?” అంటూ పక్కనే నిలబడ్డ మాఅన్నయ్య ఇంకొక విసురు.


నాన్నగారు వచ్చే లోపల

ఫ్రెండ్స్ తో ఫోన్స్ ముగించాలని ఉదయాన్నే అందరం ఫోన్ చుట్టూ చేరతాను.

.

నాన్నగారు తన బిజినెస్ పనిమీద ఏ బొంబాయో, మద్రాసో కానీ ట్రంక్ కాల్

బుక్ చేసారంటే మాత్రం ఇక ఎవరమూ ఫోన్ ముట్టుకోము.


అసలు విషయం ఏమిటంటే, స్కూల్లో ఏ ఫ్రెండ్ పుట్టినరోజు అయినా, క్లాసులో అందరికీ కొబ్బరిచాకోలెట్లు , కొంతమంది పాలకోవాలు ఏవో పంచేవారు. మర్నాడు వాళ్ళ అమ్మానాన్నలతో , తమ్ముళ్లతో

సినిమాకి వెళ్లామని చెప్పేవారు.

సినిమా నుంచీ వస్తూ, స్వీట్ షాపులో జిలేబిలు, పకోడీలు కొనుక్కుని తిన్నాము అని చెప్పేవారు.


అసలు మాఇంట్లో కానీ, మా మేనత్తగారింట్లో కానీ, అమ్మా నాన్నలు కలిసి సినిమాలు

చూడటం అనేదే లేదు. ఇంక వాళ్లతో మేము ఎలా వెడతాము?


ఏ బంధువులో, బాబాయి పిన్ని వాళ్ళో వచ్చినప్పుడు మాత్రం అమ్మ, అత్తయ్య ఏదయినా భక్తి సినిమా అయితే వెళ్లేవారు.

వాళ్ళతో మేము వెళ్ళేవాళ్లము. కానీ ఈ పుట్టినరోజు నాడు సినిమాకి వెళ్ళాలనే కోరిక ఎలా తీరాలి? అందుకే ఈ రోజు స్కూలు ఎగొట్టి మాట్నీకి వెళ్ళాలి అని ప్లాన్.


నేను తయారు అయ్యి, బ్యాగ్ తీసుకుని “ఈ రోజు విజయ పుట్టినరోజు కదా? టిఫిన్ బాక్స్ వద్దు. అత్తయ్య పులిహోర ఇస్తుందిలే” అంటూ బయలుదేరాను .


“విజయకి హారతి ఇవ్వటానికి, సాయంత్రం నేను అక్కడికి వస్తాను, నీవు స్కూలు నుంచీ అక్కడికే రా!” అంటూ అమ్మ పురమాయింపు.


‘అబ్బా! హైస్కూల్ కి వచ్చినా ఈ హారతులు ఏమిటో?’ అని నసుక్కుంటూ రిక్షా ఎక్కాను. స్కూలు దగ్గర దిగాక, రిక్షా అబ్బాయితో, “సాయంత్రం నువ్వు రావద్దు. నేను

విజయతో వెడతానులే” అని చెప్పాను.


‘సినిమాకి వెడితే కనుక, పుస్తకాలు, బ్యాగ్ లు ఏంచేయాలి?’ అని నాక ఒకటే ఆందోళన.


సినిమా ఐడియా ఇచ్చిన నా మరొక ఫ్రెండే, దీనికి కూడా ఒక సలహా ఇచ్చింది.


లీజర్ క్లాసులో చదవడానికి నేను నా బ్యాగ్ లో ఎప్పుడూ ఏవో కథల పుస్తకాలు పెట్టుకోవడం అలవాటు..


“మా బామ్మకి కథలు, పుస్తకాలు

ఆంటే చాలా ఇంట్రస్ట్. తనకి ఆ పుస్తకాలు ఇస్తే, వాటితో పాటు మన బ్యాగ్ లు కూడా

దాచిపెడుతుంది.” అంటూ నా ఫ్రెండ్ తన బామ్మగారికి కథల పుస్తకాలు ఇచ్చి,

బ్యాగ్ లు మంచము కింద దాచిపెట్టించింది..


అత్తయ్య పంపిన లడ్డూలు అందరికీ పంచి , ‘పుట్టినరోజు అని, అమ్మ త్వరగా రమ్మంది’ అంటూ,

ఎలాగో విజయవంతముగా మాట్నీ సినిమా చూసి అత్తయ్య ఇంటికి చేరాము.


అప్పటికే అమ్మ, అత్తయ్య కుర్చీల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.


“త్వరగా రమ్మని చెప్తే, ఇంత ఆలస్యం చేసారేంటే? మొహాలు కడుక్కుని రండి. హారతి ఇస్తాను” అంది అత్తయ్య.

.

మా అమ్మ మాత్రం, నా వైపు చూస్తూ “ మొహం ఆలా వాడిపోయిందేం? ఎక్కడికి వెళ్లారు?” అంటూ చురుకుగా చూసింది


ఇంటికి వచ్చాక, అసలు సంగతి తెలిసింది. మా బండారం బయటపడిపోయిందని.

నాన్నగారు కారు పంపారనీ,

అమ్మ మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి, స్కూలుకి వచ్చింది అని.


స్కూల్లో మనము ఉంటేగా? మా సినిమా కోరిక తీరినా అమ్మకు అలా పట్టుపడిపోయాము.


“నీ పుట్టినరోజు దీపావళినాడు కదా? అసలు ఆరోజు సినిమా కోరిక తీరే ఛాన్సే లేదు”

అంటూ, అన్నయ్య, విజయ నన్ను చాలా నిరాశ పరిచే వారు.


“అయినా, దీపావళినాడు సినిమాలు ఉంటాయిరా!” అనేదాన్ని అన్నయ్యతో


“అవి వుంటాయి, కానీ మనం వెళ్ళము అంతే!” అనేవాడు అన్నయ్య.


‘ఛ! నేను దీపావళి నాడు ఎందుకు పుట్టాను? సినిమాకి వెళ్ళలేను కదా!’ అని బాధపడుతూండగానే కాలేజీ చదువు, ఉద్యోగం, పెళ్లి వరుసగా జరిగిపోయాయి.


‘పెళ్లి అయాక, హాయిగా పంజాబ్ వెడుతున్నాను. అక్కడ దీపావళినాడు సినిమా చూడొచ్చు కదా!’ అనుకున్నాను. అక్కడ అంతకన్నా హంగామాగా… దీపావళి టపాసులు,

దివాలీ డిన్నర్స్ జరిగేవి యూనివర్సిటీలోనూ, మా ఫ్రెండ్స్ ఇళ్లల్లోనూ. వారం రోజులు ఒకటే హడావుడి.


“దీపావళి రోజు సినిమా ఏమిటీ? చిన్నపిల్లలాగా!” అంటూ మావారు జోక్ చేసేవారు.


“అయినా, నీ పుట్టినరోజు నవంబర్ ఒకటి కదా? ఆరోజు వీలు అయితే వెళ్దాంలే!” అనేవారు.


సినిమాలు అంటే, అసలు ఇంటరెస్ట్ లేని మావారు.

అలా పుట్టినరోజు నాడు సినిమా చూపించకుండానే, డెభై ఐదు వసంతాలు గడిచిపోయాయి.

***

ఇప్పటికీ. నా పుట్టినరోజు నాడు, ముందు విజయ, తర్వాత అన్నయ్య, వదిన ఫోన్లు శుభాకాంక్షలతోనే ఉదయం మొదలవుతుంది.

ఇప్పుడు అందరికీ అరచేతిలోనే ఫోన్ కదా!


“ఇంకా పుస్తకాల పురుగులాగా, కథలు, నవలలు చదువుతూనే ఉన్నావా?” అంటూ విజయ ప్రశ్న.

“అవునే బాబూ! ఇప్పుడు ఫేస్బుక్ నిండా కథలు, నవలలు

చదవడానికి రోజు సరిపోవటంలేదు” అన్నాను.


“చదవడమే కాదు, ఇప్పుడు కథలు, కాకరకాయలు కూడా రాసి పడేస్తోంది.” పక్కన సన్నాయి లాగా మావారి నొక్కులు.

“ఇప్పటికైనా, నీ కోరిక తీరిందా?” అంది.


“లేదు తల్లీ! నీ కోరిక నేను తీర్చాను కానీ, నా కోరిక తీరనే లేదు అని వాపోయాను

చిన్నప్పుడు మీరు కూడా స్కూలు ఎగొట్టి సినిమాలు చూసే వుంటారుగా .

ఎంజాయ్ చేయండి కాలేజీ ఎగొట్టి కూడా సినిమాలు చూసే వాళ్లము.


పంజాబ్ లో వున్నప్పుడు మా వారికీ సినిమాలు ఆంటే పెద్ద ఇంట్రస్ట్ ఉండేది కాదు ..

అక్కడ అడపిల్లలు సైకిల్ బాగా వాడే వారు ,


మేము అద్దె కు వున్న ఓనర్ గారి అమ్మాయికి సినిమాలు పిచ్చి నాకు లాగానే , ఇద్దరము కలిసి సైకిల్ మీద డబల్స్ వెళ్తూ వుండే వాళ్లము మాట్నీలకు .

పర్సు మనది అయితే ఆ అమ్మాయి ఎన్ని సినిమాలు అయినా చూపించేది .


ఎప్పుడో ఇద్దరూ పడతారు అని మా వారు దీవించే వారు కానీ ఎప్పుడూ పడలేదు .


ఇంక పాపాయి వచ్చాక సినిమాలు బంద్ ఆది కథ









 
 
 

Recent Posts

See All
టిఫిన్ బాక్స్

శ్రీశ్రీ గారు కాదేది కవిత కనర్హం అగ్గిపుల్ల, సబ్బు పెట్టే గురించి కూడా రాయచ్చు అన్నారు . అలాగే మొన్న ఎవరో ఫేస్ బుక్ లో పనిమనిషి తీసుకుని వెళ్లిన టిఫిన్ బాక్స్ గురించి కధ రాసారు . ఆ కథ

 
 
 
పేరంటం

శ్రావణ మాసం అనగానే పేరెంటాలు గుర్తు వస్తాయి కదా. ఇప్పుడు కూడా శ్రావణ శుక్రవారం మంగళవారం పేరెంటాలు కమ్యూనిటీ ల్లో చాలా బాగా జరుగుతున్నాయి. ఆమ్మ వార్ల ను కూడా ఎంతో అందముగా చుట్టూ రంగు బల్

 
 
 
అమ్మ పాటల పుస్తకం

ఈ శ్రావణ మాసం , దసరాలు పండుగలు రోజుల్లో మా అమ్మ గారి పాటలు అలా మనసులో మెదులుతూ వుంటాయి. మా ఇంట్లో మా పెద్ద అత్తయ్య, మా పెద్దమ్మ గారు చాలా పాటలు రాశారు. మా అత్తయ్య గారు ఎక్కువగా శ

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page