ఎస్ రాజేశ్వర రావు గారి ప్రైవేట్ పాటలు
రాజేశ్వర రావు గారి గురించి రాసే అంతటి సామ ర్థ్యం లేదు కానీ , యూ ట్యూబ్ లో ఏదో వెతుకుతూ ఉంటే ఆయన ప్రైవేట్ సాంగ్స్ కనిపించాయి లలిత సంగీతం గురించి రాసేటప్పుడు ఆయన పాటలు పాట పాడుమా కృష్ణ గురించి రాశాను . ఆ రోజూ నెట్ సరిగ్గా లేక పూర్తిగా రాయలేదు .
మన తెలుగులో చక్కటి భావ గీతాలు రాసిన కవులు చాలా మంది వున్నారు. అయితే వాళ్ళ గురించి రాయలంటే కొంచెం రీసెర్చ్ చేయాలి .. తప్పులు రాయటం ఇష్టం ఉండదు.
సినిమా పాటల్లోనే పాత సినిమా ల్లో ఎంత చక్కని పాటలు మల్లాది గారు , పింగళి గారు, కృష్ణ శాస్త్రి గారు అప్పటి
పాట లు వింటూ ఉంటే మన సాహిత్యం గురించి చాలా గర్వం కలుగుతుంది .
ఎన్నో సినిమాలు కు చక్కని సంగీతం అందించిన రాజేశ్వర రావు గారి ప్రైవేట్ సాంగ్స్ చాలా మధురం గా వుంటాయి.
ఆయన కొన్నాళ్ళు సినిమాల్లో కూడా పాడే వారుట , ఆ రికార్డ్స్ ఇపుడు దొరుకుతాయో లేదో తెలియదు , యూ ట్యూబ్ లో వెతికితే దొరుకుతాయేమో .
మేము స్కూల్ లో చదువుకునేటప్పుడు మా మాస్టర్ గారి భార్య పాట పాడుమా కృష్ణ , నల్లని వాడ నే గొల్ల పిల్ల నోయి
అనే పాటలు పాడే వారు , పనిలో పనిగా మాకు కూడా నేర్పే వారు. రేడియో లో కూడా వింటూ ఉండేవాళ్ళము.
అయితే అప్పుడు వాటి గురించి అంతగా తెలియదు , ఏదో కొత్త పాట నేర్చుకున్నాము అని తప్పితే.
ఆ రోజుల్లో పాట లు ఏదో రేడియో లో వినటం తప్పితే టేప్ రికార్డు లు అవీ అంత గా పాపులర్ అవలేదు కదా .
మా బావ గారి దగ్గర ఎన్నో రికార్డ్స్ ఉండేవి కానీ రాజేశ్వర రావుగారి పాటలు లేవు.
ఘంటసాల గారి ప్రైవేట్ రికార్డ్స్ రావోయి బంగారి మామ, బహు దూరపు బాటసారి, కుంతీ విలాపం అవీ ఉండేవి.
అవీ మంచి పాటలు.
రాజేశ్వర రావు గారి పాటలు అలా పుస్తకం లో ఉండిపోయాయి . చాలా రోజుల తర్వాత మా అమ్మాయి స్నేహితురాలు యింటికి వెళ్ళితే వాళ్ళ అమ్మగారి తో ఏవో మాటల సందర్బములో ఆవిడ కి ఓగి రాల రామ చంద్ర రావు గారు బంధువులు అని తెలిసింది.
వాళ్ళ పాటలు ఇంకా రాజేశ్వర రావు గారి పాటలు తన దగ్గర టేప్స్ వున్నాయి అని చెప్పారు .
ఇంకా అరోజుల్లో సీ డి లు అంతగా ప్రా చుర్యం లోకి రాలేదు . ఆ టేప్స్ తెచ్చుకుని సంగీత్ సాగర్ లో జాగ్రత్తగా కాపీ చేయించుకున్నాను.
టేప్ రికార్డులు వున్నన్ని రోజులు చాలా తరచుగా వింటూ ఉండేవాళ్ళము. ఆ తర్వాత సీడీ లాగా చేయిద్దాం ఆంటే
కష్టం అన్నారు . ఆలా అన్నీ టేప్స్ అటక మీదకు చేరిపోయాయి.
ఇన్నాల్టికి మరలా యూ ట్యూబ్ లో ఆ పాటలు వింటూ ఉంటే చాలా ఆనందం గా అనిపించింది. ఓహో విభావరి, పాట పాడుమా కృష్ణా ,, చల్లగాలిలో యమునా తటి పై , ఆన్ని విన సొంపయిన పాటలు .
రాజేశ్వర రావు గారు , రావు బాల సరస్వతి గారు పాడిన పాటలు కూడా వున్నాయి.
ఓగిరాల గారు గుణ సుందరి సినిమాకు సంగీత దర్శకత్వ ము చేసారుట . అందులో అమ్మవారి మీద రెండు చక్కటి పాటలు వున్నాయి. మా చిన్న తనము లో మా అక్కయ్యలు పాడుతూ ఉండేవారు. అప్పట్లో అవీ సినిమా పాటలు ఆన్ని తెలియదు. ఒకటి కల్పకమ్మ అమ్మవారి మీద రాసిన పాట , చాలా బాగుంటుంది..
ఎప్పుడు మైలాపూర్ గుడికి వెళ్లినా ఆ పాట అమ్మవారి దగ్గర పాడుకుంటాను.
ఇంకొకటి ఉపకార గుణాలయావై వున్నావు కదే మాతా ఆన్ని మనుషుల్లో వుండే అహంకారం గురించి చెప్పే పాట రెండూ ఆణిముత్యాల లాంటి పాటలు యూ ట్యూబ్ లో వున్నాయి..
రాజేశ్వర రావు గురించి రాస్తూ ఉంటే ఈ పాట లు కూడా గుర్తు వచ్చాయి.
ఆయన వి సినిమాల్లో పాడిన పాత పాటలు వున్నాయేమో వెతకాలి . ప్రస్తుతానికి ఈ పాటలు మళ్ళీ దొరికాయి అనే ఆనందం లో ఈ పోస్టు
ఆందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
శుభరాత్రి
Comments