గ్రాం ఫోన్ తో కొన్ని విశేషాలు
- murthydeviv
- Mar 27
- 2 min read
నిన్న యు ట్యూబ్ లో ఏవో సెర్చ్ చేస్తుంటే బాలి వుడ్ కా గోల్డెన్ ఎరా అంటూ రాజేశ్ ఠాకూర్ ప్రోగ్రామ్ ఎదో కనిపించింది. ఓల్డ్ ఈ జ్ గోల్డ్ విందాము అని పెట్టాను. అయన ఎవరో చాలా రీసెర్చ్ చేసి ఆరోజుల్లో ప్రపంచంలోని అనేక అంశాలుతో పాటు గా ఆరోజుల్లో వచ్చిన మంచి పాటలు పెట్టాడు. నేను రెండు విన్నాను 1955,1956 . తెలుగు లో ఇలాంటి రీసెర్చ్ వి ఏ కె రంగారావు గారు చేశారు. అయన ఆర్టికల్ ఆంధ్ర ప్రభ r పత్రిక లో వచ్చేది. సరగామాల పేరుతో, కస్తూరి మురళి కృష్ణ గారు కూడా అలాంటి రీసెర్చ్ హిందీ పాటల మీద రాసారు అయితే ఆ రెండూ పుస్తకాలు. ఈయన ప్రోగ్రామ్ వింటూ ఉంటే గ్రాంపోన్ గుర్తు వచ్చింది. ఈ 70ఏళ్ళ లో వచ్చిన మార్పులు ఒక్కొక్క సారి విచిత్రంగా అనిపిస్తుంది. మా చిన్నతనం లో గ్రామ్ పోన్ వుండేది. దానికి రికార్డు పెట్టినప్పుడు కీ ఇవ్వాలి. రికార్డు మీద పెట్టే హ్యాండిల్ కూడా మధ్య మధ్యలో పిన్ మార్చాలి. పిన్ అరిగి పోతే పాట సరిగ్గా రాదు. ఆ రికార్డులు కూడా చాలా బరువుగా ఉండేవి. మా ఇంట్లో ఉన్న రికార్డులు ఎక్కువగా క్లాసికల్ మ్యూజిక్ వుండేవి. మా పెద్దనాన్న గారు అవే వినే వాళ్ళు. ఏవో కొన్ని పాత తెలుగు సినిమా పాటలు కూడా వుండేవి. ఆ రికార్డులు పెట్టటానికి స్పెషల్ గా ఒక చెక్క పెట్టె కూడా చేయించారు. ఇంక మా అత్తయ్య గారింట్లో అయితే ఎక్కువ హిందీ పాటలు వుండేవి ఇపుడు కొన్ని పాటలు వింటుంటే ఆరోజుల్లో మా బావ గ్రాంఫొన్ ముందు కూర్చుని పాటలు పెట్టటం గుర్తు వస్తుంది. మా పెళ్ళి అపుడే మా బావ గారు పోర్టబుల్ రికార్డు ప్లేయర్ తెచ్చారు. అపుడే అలాంటి ప్లేయర్ చూడటం. అది బ్యాటరీతో పని చేస్తుంది అనుకుంటా. తర్వాత రికార్డు ప్లేయర్, ఒక ఫ్యాషన్ అయింది రికార్డ్స్ కూడా ఎల్ పి లు చిన్న రికార్డ్స్ ఎన్నో రకాలు. టేప్ రికార్డర్ వచ్చాక ఎన్నో పాత పాటలు టేప్స్ లో రికార్డు చేయించాను రోజూ పాటలు వినటం ఒక అలవాటు. అందుకే ఎన్నో పాటలు టేప్స్ లో రికార్డు చేయించాను. మా బావగారి దగ్గర కొన్ని వందలు రికార్డ్స్ ఉండేవి. తర్వాత మావారు సింగపూర్ నుంచి మ్యూజిక్ సిస్టమ్ తెచ్చారు. దాని కోసం ఒక అందమైన అల్మరా కూడా చేయించాను ఇంక ఆ తర్వాత సి డి ల యుగము మొదలు అయింది. మాకు తెలిసిన షాపు వాడు పాత సినిమాలు సి డి లు చవక గా వున్నాయని అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకుంటూ చాలా సి డి లు తీసుకున్నాము. కొన్నాళ్ళు వి సి ర్ తో వీడియో క్యాసెట్ టీవీ లో ఏదయినా మంచి ప్రోగ్రామ్ వేస్తే అది రికార్డ్ చేయటం. మా పెద్ద అమ్మాయి ఏ ఎలక్ట్రానిక్ వస్తువు అయినా చాలా చక్కగా హ్యాండిల్ చేసేది. పోర్టబుల్ టూ ఇన్ వన్లు, తర్వాత త్రీ ఇన్ వన్ లు. ఇంటి నిండా ఆవే పూజ గదిలో ఒకటి, ఇంకో గదిలో ఒకటి. స్మార్ట్ ఫోన్లు వచ్చాక అన్నీ మాయం అయిపోయాయి. మ్యూజిక్ వరల్డ్ షాపులు అసలు మాయం అయిపోయాయి. ఒక మూడేళ్ల క్రితం సంగీత సాగర్ షాపు కి వెళితే పాత క్యాసెట్లు క్లాసిక్స్ ఉన్నాయంటూ చాలా చవక గా ఆల్మోస్ట్ బ్రతిమలాడి ఇచ్చాడు. అందులో త్యాగయ్య గారి నౌకా చరితం కూడా వున్నది. మా అమ్మాయి సంగీతము నేర్చుకుంటుంది ఎవరికయినా ఇవ్వు అంటాను. ఆ రికార్డులు టేప్ లు అన్నీ బాక్సుల్లో భద్రంగా దాచి పెట్టాను. ప్రస్తుతం చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే అన్ని అవసరాలు తీరుస్తూ ఉంటుంది. అందుకే దాన్ని అరచేతిలో స్వర్గము అన్నాను. ఇంకా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఏమి మార్పులు వస్తాయో, మనము వినకుండా అదే విని పెడుతుందేమో
Comments