అలా మొదలైన నా యాత్ర బహుశ రెండు నెలలు వున్నాను అనుకుంటా అమెరికాలో. మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ బాగా అయింది. నేను వెళ్ళిన ఒక పది రోజులు మా స్నేహితురాలు వాళ్ళింట్లో నే వున్నాము. గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ కి వాళ్ళు కూడా వచ్చారు నేను నా ఫ్రెండ్ ఒక 30ఏళ్ళ తర్వాత అంత తీరికగా కలుసుకున్నాము. మా చిన్నతనం కబుర్లు, కాలేజీ కబుర్లు, ఇంకా మిగతా బంధువుల గురించి ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ చాలా హ్యాపీ గా గడిపాము. తర్వాత మా అమ్మాయి వుండే ఇంటికి వచ్చాము. మా అమ్మాయి తో పాటు యింకో ఇద్దరు అమ్మాయిలు వుండే వారు. సాయంత్రం పూట ఎవరో ఒక ఫ్రెండ్స్ వస్తూ వుండేవారు. నేను 1995లో వెళ్లినప్పిటికి, ఇప్పటికి ఎంతో తేడా ఉంది. అవూరులో రెండే ఇండియన్ స్టోర్స్ వుండేవి హోటల్స్ కూడా ఎనిమిది గంటలకు కల్లా మూసేసేవారు. ఎక్కువ నార్త్ ఇండియన్ ఫుడ్ దొరికేది. యూనివర్సిటీ లో ఒక పంజాబీ అతను ట్రక్కు పెట్టీ పరోటాలు అవి అమ్మేవాడు. చాలామంది స్టూడెంట్స్ బీన్స్ క్యారెట్ వున్న ఫ్రోజెన్ ప్యాకెట్ తీసుకొని అన్నం లో కలిపి వండి తినేవాళ్ళు. నేను తీసుకొని వెళ్లిన టిన్స్ ఓపెన్ చేయటానికి చాలా ప్రాబ్లెమ్ అయింది. మా అమ్మాయి అయితే తను తీసుకొని వెళ్లిన టిన్స్ అసలు ఓపెన్ చేయలేదు. నేను చాకు లాంటివి యూజ్ చేసి చాలా కష్టపడి
బాండి పెట్టీ కొట్టి ఎలాగో ఓపెన్ చేశాను అలాగా అక్కడ స్టూడెంట్స్ కు రోజూ చట్నీస్ తో విందు చేసేదాన్ని. ఆంధ్రా అబ్బాయిలు అయితే కంది పచ్చడి, పెసర పచ్చడి కూడా చేసిపెట్టమని అడిగే వాళ్ళు. అందరూ కలిసి మెలసి ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. వాళ్ళు అందరూ అక్కడ వంటరీతనం, తట్టుకొని, ఆ భాష అర్థం చేసుకొని కష్టపడి చదువుకుంటారు. కొంతమంది ఎపుడూ ఇండియా నీ మిస్ అవుతూవుంటారు. కొంతమంది మాత్రం ఇండియా లో ఏముంది.అని ఉద్యోగాలు రావు ఆమెరికా లో వుండటం చాలా గొప్ప ఆన్నట్లు మాట్లాడేవారు. నాకు ఎందుకో అలాంటి వాళ్ళను చూస్తే కోపము వచ్చేది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కలిసిన ఫ్యామిలి ఫ్రెండ్స్ కూడా అలాగే మాట్లాడేవారు. నాకు ఎందుకో నచ్చేదికాదు. మా అమ్మాయి కొంత మంది ఫ్రెండ్స్ తో కలిసి వాషింగ్టన్ వెళ్ళాము. అక్కడ ఎక్కడికెళ్ళినా మ్యాప్ చూసుకుంటూ వెళ్లాలి ఇపుడు ఇక్కడ కూడా అలాగే ఉంది అనుకోండి. మేము వాషింగ్టన్ నుంచి వచ్చే టపుడు ఎక్సిట్ తప్పు తీసుకున్నాము. నేను ఎవరి నన్నా అడగండి అనేదాన్ని. కానీ రోడ్డు మీద పురుగు కూడా కనిపించక పోతే ఎవర్ని అడుగుతారు. ఎంతసేపు మ్యాప్ చూసినా ఎక్సీట్ కనిపించదు. నాకు టెన్షన్ గా వున్నా ఏమి అడగలేము కదా. అర్ధరాత్రి అయింది. మా అదృష్టం కొద్దీ ఒక పెట్రోల్ బంక్ కనిపించింది. అక్కడ వాళ్ళు మీరు ఎక్సి ట్ దాటి చాలా ముందుకు వచ్చారు అని ఎలా వెళ్ళాలో చెప్పాడు. బ్రతుకు జీవుడా అనుకుంటూ తెల్లవారేక ఫిట్స్ బర్గ్ చేరాము. అక్కడ హైవేస్ చాలా బాగుంటాయి. రెస్టారెంట్ లు, బాత్ రూమ్ లు చాలా కన్వీనియెంట్ గా ఉంటాయి. ఇప్పటికీ ఇండియా లో హై వేస్ వున్నా బాత్ రూమ్ లు బాగు పడలేదు. ఒక నెలరోజులు తర్వాత చికాగో మా చెల్లెలు దగ్గర కి వెళ్ళాను. చికాగో గురించి స్కూల్లో చాలా చదువుకున్నాం కదా డౌన్ టౌన్ అంతా అలాగే పెద్ద బిల్డింగ్స్ చాలా గొప్ప గా ఉంటుంది. మా చెల్లెలు వాళ్ళు వుండేది సబర్బ్ కాబట్టి అసలు సందడి వుండదు. కనీసం పక్షి అరుపులు కూడా వినపించవు పెద్ద ఇళ్లు అన్నీ తలుపులు మూసి వుంటాయి. బయట కనిపిస్తే హాల్లో అని ఒక చిరునవ్వు నవ్వుతారు.మా చెల్లెలి పిల్లలతో కలిసి సినిమాలు చూడటం, ఏవో ఆటలు ఆడటం, వీకెండ్ కు బయటకు వెళ్ళటం. చికాగో లో వున్న గుడులు చూశాము. రోజూ ఒక ఐస్క్రీమ్ వాడు ఇంటి ముందు నుంచి గంట కొడుతూ వెళ్ళేవాడు. ఒక్కడు ఇంటి ముందు వచ్చాడు సో కొనుక్కోవాలి అని రోజూ ఐస్క్రీమ్ కొనుకున్నే వాళ్ళం. చికాగో లో సియర్స్ టవర్, న్యూ యార్క్ లో లిబర్టీ స్టాక్హ్యూ , ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చూసినా నాకు ఒకటే ఆలోచన వచ్చేది. ఏముంది పైకి ఎక్కి కిందకు చూడటం తప్పితే కొన్నిసార్లు ఆ హైట్ నుంచి కిందకి చూస్తే కళ్లు తిరుగుతాయోమో అనిపించేది. ఈ మాట అంటే అందరూ తిడతారు అని ఊరుకున్నాను. మన ఇండియాలో ఎన్నో వున్నా మెయింటేన్స్ లేదు కదా అని దిగులు వేస్తుంది. నాకు అమెరికా లో చాలా గొప్పగా అనిపించినవి నయాగరా ఫాల్స్, గోల్డెన్ గేట్ బ్రిడ్జి చూస్తే చాలా గొప్ప గా అనిపించింది. ఫిట్స్ బర్గ్ లో మా అమ్మాయి పనిచేసే కంపనీ వాళ్ళు చాలా ఫ్రెండ్లీ గా వుండే వారు.నేను కట్టుకునే చీరెలు అన్నీ వాళ్ళకు చాలా నచ్చేవి. ఒకరోజు వాళ్ళు నన్ను హౌ డు యు లైక్ యుఎస్ అనో ఏదో అడిగారు. నాకు అర్థం కాక ఎస్ ఐ యాం గోయింగ్ తో ఇండియా నెక్సట్ వీక్ అని చెప్పాను. మా అమ్మాయి వాళ్ళు ఏమీ అడిగారో అపుడు చెప్పింది. ఇప్పటికీ నాకు అది గుర్తు వస్తె నవ్వు వస్తుంది చిన్న టౌన్స్ నుండి వెళ్లిన మా ఫ్రెండ్,మా చెల్లెలు అక్కడ భాష అర్ధం చేసుకొని, చదువుకుని ఉద్యోగం కూడా చేశారు కదా ఎంత కష్టపడ్డారు అనిపిస్తుంది. అలా ఒక్కదాన్నే ఆరు సార్లు అమెరికా వెళ్ళాను. ఇంకా కొన్ని విశేషాలు రేపు
Comments