హాస్య వల్లరి
ఇదే పేరుతొ వున్న పుస్తకం లో మొక్కపాటి గారి బారిస్టర్ పార్వతీసం ఈ నవల ఈ కాలం వాళ్ళు చదివారో లేదో తెలియదు.
బ్రిటిష్ వాళ్ళ టైమ్ లో ఆంధ్ర , గోదావరి జిల్లా నుండీ లండన్ స్టీమర్ లో వెళ్ళి ఎడింబరో లో అగ్రికల్చర్ కోర్స్ చదివి పరిక్ష
రాయకుండా వచ్చారుట.
అసలు ఆయన దీపావళి కి అత్తగారింటికి వెళ్ళి అక్కడ తన ప్రయాణం పడవ లో, బండిలో వర్ణించి ఆందరికీ చెప్తూ ఉంటే
వాళ్ళు కథలా గా రాయ మన్నారుట .
ఆలా మొదలు అయిన ఆ యాత్ర కథనం ఏన్నో మలుపులు, సాహసాలతో, స్టీమర్ లో ప్రయాణం చేసి లండన్ చేరుతుంది.
ఆ రోజుల్లో పల్లెటూరు నుండీ వచ్చిన వాళ్ళు ఎంత అమాయకంగా వుండే వాళ్ళో , చెపుతూ అప్పటి పరిస్థితి కళ్ళ కు కట్టినట్లు చూపిస్తా రు.
ఆ నవల ఇప్పటికీ చాలా. పుస్తకాలు షాపుల్లో కనిపిస్తూ వుంటుంది. మొదటి భాగం రాసిన తర్వాత దాదాపు 50 ఏళ్ల తర్వాత రెండో భాగం రాశారుట.
ఈ పుస్తకము మొదటి సారి ఎప్పుడు చదివానో గుర్తు లేదు , కానీ నా లైబ్రరీ లో మాత్రం వున్నది .
ఏ పుస్తకం అయినా కొన గానే date వేసి చదివిన తర్వాత మరలా డేట్ వేస్తాను. కానీ మరీ. నచ్చినవి మరలా చదువుతూ వుంటాను.
మొదటి సారి యూ. ఎస్ వెళ్ళినప్పుడు అయితే ఈ బారిస్టర్ పార్వతీసమ్ బాగానే గుర్తు వచ్చాడు.
బ్యాగ్గేజ్ క్లైయిమ్ లో , హ్యాండ్ లగ్గెజ్ మోయలేక, ఇంగ్లీష్ అర్థం కాక , కన్ఫ్యూజ్ అవుతూ అప్పటికే ఈ నవల చదివాను
, అందుకే ఆయన్ని తలచుకున్నా ను.
స్టీమర్ లో ఆయన పడిన అవస్థలు సీ సిక్ నెస్ వల్ల ఏమీ సహించక చారు అన్నం తింటే బాగుండు అనుకుంటాడు.
లండన్ లో రైల్వే స్టేషన్ చూసి కూడా ఇంత పెద్ద స్టేషన్ కి కప్పు గా వేయటానికి గాజు పలకలు ఎక్కడ దొరికాయో
అనుకుంటూ ఆశ్చర్య పోతాడు.
మార్షెల్స్ లో
హోటల్ లో రూమ్ తీసుకు న్న పార్వతీశం హోటల్ బాయ్ లిఫ్ట్ లో సామాను పెట్టి ఎక్కమంటే అదే హోటలరూమ్
ఆనుకుని ఎక్కను అంటాడు..
నేను కూడా న్యూ యార్క్ ఎయిర్ పోర్ట్ లో దిగి ఒక్క దాన్నే మొదటి సారి యూ ఎస్ వెళ్ళినప్పుడు
పిట్స్ బర్గ్ కి ఇంకో ఫ్లైట్ కి వెళ్లాల్సి నప్పుడు ఇలాంటి కన్ఫ్యూషన్ చాలా ఫేస్ చేశాను.
ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు.
కాయిన్స్ వేసి ఫోన్ వాడా లి. అప్పుడు పక్కనే ఫోన్ చేస్తున్న అతనితో డూ యూ హావ్ ఛిల్లర్ అనీ అడిగాను.
పాపము వాడెవడో నా బాధ కానీ పెట్టీ డూ యూ మీన్ చేంజ్ అనీ చిల్లర ఇచ్చాడు .
ఇప్పటి వాళ్ళు ఈ నవల లు చదివి ఎంజాయ్ చేయగలరో లేదో తెలియదు.
కానీ మేము మాత్రం కనిపించిన నవల లు అన్నీ చదివే వాళ్లము.. మాలతీ చండూర్ గారు ఇంగ్లీష్ నవలలు కి
పరిచయం చేస్తూ పాత కెరటాలు అనీ రెండు మూడు భాగాలు రాశారు. తెలుగు వాటికీ కూడా రాశారేమో
తెలియదు..
మా అమ్మాయి ఈ నవలలు అబ్రిడ్జ్డ్ గా ఇంగ్లీష్ లో రాయి అంటూ వుంటుంది.. మీరు తెలుగు లో చదివితేనే ఎంజాయ్ చేయగలరు అనీ చెప్తూ వుంటాను.
చివరి గా బారిస్ట్ ర్ గారి రెండు లండన్ అనుభవాలు తో ముగిస్తాను. లండన్ స్టేషన్ చెన్న పట్నం స్టేషన్ కన్నా పెద్దగా ఉండి అనీ ఆశ్చర్య పోతూ , గాజు పలకల తో వేసిన టాపు మీద కొబ్బరికాయ పడితే, ఏ అల్లరి పిల్లలు రాయి తో కొడితే
అనే అనుమానం వస్తుంది పాపం
ఆయన పాపం కోన సీమ నుంచీ వచ్చారు అందుకే అయన కి కొబ్బరికాయ గుర్తు వస్తుంది.
ఆ యన యుద్ధం జరిగిన కాలం లో లండన్ లో వున్నారు.
ఒకరోజు ఇంటి బాల్కనీ లో నుంచుని బజార్ లో వెళ్తూ వీడుకోలు చెప్పుకుంటూ ముద్దులు పెట్టుకుంటున్న
జంటలు ని వింతగా చూస్తూ వుంటారు. ఇంతలోనే సైరన్ మోగుతుంది.. ఆంటే అందరూ లోపలికి వెళ్ళి
తలుపులు వేసుకోవాలి, ఈ జంటలను చూస్తూ వున్న మా బారిస్టర్ గారిని ఇంటి ఓనర్ వచ్చి లోపల కి లాగి
తలుపు వేస్తుంది..అప్పుడు అయన ఈ ఆడవాళ్లు ఇలా మగవాళ్ళు ని కూడా లాగేస్తారు అంటూ ఆశ్చర్య పోతారు.
ఆలా ఈ నవల అంతా అయన అనుభవాలు తో అరోజుల్లో మన వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి ఎలా ఫీల్ అయివుంటారు అనీ ఆలోచన వస్తుంది. ఎక్కడయినా దొరికితే చదవండి మంచి పుస్తకం మంచి నేస్తం లాంటిది.
శుభ రాత్రి
Comments