top of page
Search

యాత్ర కథనం

murthydeviv
5 days ago
3 min read

యాత్రలు చేయటం ఇష్టం లేని వాళ్ళు ఎవరు వుంటారు. అయితే యాత్రలు ఎక్కువగా చేయక పోయినా యాత్ర కథనాలు చదవటం ఇంకా ఇష్టం . నిన్న బారిస్టర్ పార్వతీసం కధ కూడా యాత్ర కథ లాంటిదే .


చిన్నప్పుడు గలివర్ ట్రావెల్స్ చదివాము. ఇప్పుడు అంతగా గుర్తు లేదు. తర్వాత ముళ్లపూడి గారి 80 రోజుల్లో భూ ప్రదక్షణం పుస్తకం చాలా ఉత్కంట తో నడుస్తుంది. చదివే టప్పుడు హీరో గెలుస్తాడో లేదో అనే టెన్షన్

అరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 డేస్ జూల్ వర్న్స్ రచయత అనుకుంటా . హీరో పేరు గుర్తు లేదు.


ఏనుగుల వీరాస్వామి అనే అయన చేసిన కాశీ యాత్ర పుస్తకం రాసారుట. అరోజుల్లో నడు చు కుంటూ , ఎడ్ల బండ్ల లో యాత్ర చేయటమే ఒక సాహసం , ఇంక విశేషాలు రికార్డ్ చేసి బుక్ రాయటం ఎంత గొప్ప , ఎందరో మహానుభావులు.

మా చిన్న తనము లో తన బంధువులు తో ఆ తాత గారు కూడా యాత్రలు చేసారుట.

మా చిన్న బామ్మ గారు చెప్పేవారు. హరిద్వార్ వరకు వెళ్లిన వాళ్ళు అక్కడ ఆశ్రమం లో ఒక బుక్ లో పేర్లు రాయచ్చుట

ఆంటే ఆ ఊరు వాళ్ళు వచ్చినట్లు రిజిస్టర్ చేసుకోవటం అన మాట..

మేము కొంచెం పెద్దవాళ్ళము అయ్యూక మా తాత గారు, అమ్మమ్మ కాశీ యాత్ర చేసి సమారాధన చేయటం గుర్తు .

అరోజుల్లో ఆలా చేసే వారుట , కుక్క మెడ లో గారెలు దండ లాగా వేసేవారు.

మా నాన్నగారితో అయితే ఒకటే యాత్ర తిరుపతి, కాళహస్తి కంచి గుర్తు. కంచిలో నాన్న గారు ఎత్తుకొని ఆ బల్లులు తాకించటం, తిరుపతి లో ఆకాశ గంగ కింద స్నానాలు లీలగా గుర్తు .


మా పెద్దనాన్న గారు, పెద్దమ్మ , ఆంటే మా ఆమ్మ అక్కయ్య , ఆవిడ కూతురు అల్లుడు తో సంపూర్ణ యాత్రలు చేసారు..

అరోజుల్లో బద్రీనాథ్ వరకు వెళ్ళే వారు.


మా అమ్మగారు, నేను కానీ మా అన్నయ్య లు కానీ లేకపోతే ఎక్కడికీ కదిలే వారు కాదు. మా అన్నయ్య తన స్నేహితుడు , ఫ్యామిలీ తో రైల్వే కంపార్ట్మెంట్ బుక్ చేసి తీసుకుని వెళ్తున్నాడు అనీ తెలిసీ మా అమ్మగారిని , వదిన ని

పంపాడు.

అసలు మా అమ్మగారు కేవలం మా వదిన కోసమే బయలు దేరింది . మా వదిన పెద్ద కోడలు మా అమ్మకు ప్రత్యేక మైన

అభిమానం ఉండేది.

ఆ స్నేహితుడు కూడా ఎప్పటి నుండో తెల్సిన వాడు అయినందుకు బయలు దేరింది.

వాళ్ళు తిరిగి వచ్చాక నేను చూడటానికి వెళ్ళితే , నన్ను చూడగానే కళ్ల నీళ్లతో నేను బ్రతికి ఉండగా మీరు ఎవరూ బద్రీనాథ్ వెళ్లకండి అన్నది.


మా వదిన మాత్రం అక్కడి అందాలు, ఆ ప్రకృతి , ఆ స్టల మహాత్య ము వర్ణించి చెప్పింది. ఏదయినా మనం చూసే

తీరు ల్లో వుంటుంది.

మా ఆత్త గారు కూడా బద్రీనాథ్ , మా పెద్దమ్మ వాళ్లతో వెళ్లారు , ఆవిడ కూడా బద్రీనాథ్ చూసినందుకు చాలా ఆనంద పడ్డారు.

తర్వాత మా అక్కయ్య వాళ్ళు కేదార్ నాద్ నడిచి, గుర్రాల మీద వెళ్లారు. అప్పుడు కూడా మా పెద్దమ్మ వాళ్ళు తిరిగి వచ్చిందాక ఒకటే భయం . ఆరోజుల్లో ఇన్నీ వసతులు లేవు. అవీ నిజమైన భక్తి తో చేసిన యాత్రలు.

బావగారు,అక్కయ్య వచ్చాక నేను వెళ్ళి వాళ్ళ కాళ్ళ కు నమస్కారం చేస్తూ ఉంటే ఏమీ తెలియనట్లు మోడ్రన్ గా ఉంటావు,కానీ నీకు అన్ని తెలుసు అన్నారు.

ఎవరైనా యాత్రలు చేసిన వాళ్ళ కాళ్ళ కు నమస్కారం చేస్తే మనకూ ఆ యాత్రా ఫలం దక్కుతుంది.

అమ్మగారు ఉండగా బద్రీనాథ్ వెళ్ళలేదు . ఇప్పుడు వెళ్లగలమా లేదో తెలియదు. .


అసలు ఈ రోజు ఈ యాత్రలు గురించీ ఎందుకూ ఆంటే నేను తిరిగిన దారులు అనీ వాడరేవు చిన్న వీర భద్రుడు అనే అయన రాసిన పుస్తకం చదివాను. చాలా రోజుల క్రితం చదివాను.

నచ్చిన పుస్తకం ఉంటే మరలా అపుడప్పుడు చదువుతూ వుంటాను. కొంతమంది రాసినవి చదువుతూ ఉంటే మనము కూడా ఆ దారుల్లో ప్రయాణం చేస్తాము.

అంతగా మనసుకు హత్తుకునే టట్లు రాస్తారు అయన రాసినవి అన్నీ రాయ లేను ఒక్క రోజులో, శహ్యాద్రి కొండలు గురించీ అయన రాసింది నా మనసులో ఎంతగా హత్తుకునే పోయింది ఆంటే ఎప్పుడు కకొల్హా పూర్ పండరి పూర్ వెళ్లినా , ఆ కొండ కోనల్లో ఎక్కడో దత్తాత్రేయుడు దర్శనం ఇస్తాడేమో అనే భావన వస్తుంది.


అయన నాసిక్ , త్ర యంబకం వెళ్ళినప్పుడు గోదావరి పుట్టిన చోటు కోసం కొండ చివరి దాకా ఎక్కి ఆ సన్నగా ప్ర వహించే నీరు చల్లుకుని వస్తారు.

ఆ మహారాష్ట్ర గ్రామాల్లో ప్రయాణం చేసేటప్పుడు ఆయనకు శాతవాహనులు, గాధ సప్తసతి నివృత్తినాధుడు, జ్ఞాన దేవ్ వారినే చూడ గలగుతాడు.

శహ్యాద్రి శ్రేణిలో ఆ శిఖరాల మీద దత్తత్రేయుడు దర్శనం ఇస్తాడని అంటారు. అసలుమొత్తం మహారాష్ట్ర అంతా ఒక దత్త భూమి అనీ రాసారు.

దత్తాత్రేయలు భారత దేశ మంతా ప్రకటిత మయ్యే రూపం అయినా మహారాష్ట్ర లో ఒక పరిపూర్ణ స్వరూప మ్ గా గోచరిస్తుంది, అనీ రాసారు.

ఒక ఇటలీయాన్ రాసిన దత్తాత్రేయ ది ఇమ్మోర్టల్ గురు అనే పుస్తకం చదివాక ఆయన కు అర్థం అయిందట .


పండరి పూర్, తుల్జా పూర్, కొల్హా పూర్ , నర్సొబా వాడి ఒక పది ఏళ్ల నుండీ ఒక ఐదు, ఆరు సార్లు వెళ్ళాము..


ఎప్పుడు వెళ్లినా ఏదో ఒక కొత్త అనుభవం తో ఆనందం గ దర్శనం చేసుకుని తిరిగి రావటం జరిగింది.

ఎన్నోసార్లు పండరి పూర్ ఆషాడం వారి యాత్రికుల ను కలవటం జరిగింది.


వాళ్లకు కేవలం భక్తి మాత్రమే , భజన లు చేసుకుంటూ , నడుస్తూ ఏ ఆడంబరం లేకుండా యాత్ర చేసే వాళ్లను చూస్తూ ఉంటే మనము చేసే యాత్రలు ఏపాటి. అనుకుంటాను.


ఇంకొక సారి ఇంకా కొన్ని అనుభవాలు తో


శుభరాత్రి



















 
 
 

Recent Posts

See All
హాస్య వల్లరి

ఇదే పేరుతొ వున్న పుస్తకం లో మొక్కపాటి గారి బారిస్టర్ పార్వతీసం ఈ నవల ఈ కాలం వాళ్ళు చదివారో లేదో తెలియదు. బ్రిటిష్ వాళ్ళ టైమ్ లో ఆంధ్ర , గోదావరి జిల్లా నుండీ లండన్ స్టీమర్ లో వెళ్ళి ఎడింబరో లో

 
 
 
హాస్య వల్లరి

వారానికో, పది రోజుల కొక్కసారి ఆలా నా పుస్తకాలు వున్న ఆల్మరా తెరిచి చూసుకుంటూ వుంటాను. పోయిన వారం ఏదయినా లైట్ గా చదువుదాం అనీ వెతుకుతూ ఉంటే హాస్య లహరి అనీ యువ భారతి వాళ్ళ పుస్తకం కనిపించిం

 
 
 
వరుగులు

ఈ పండగలు హడావిడి లో అసలు వంటిల్లు చాలా జిడ్డుగా అయింది ఫ్రిడ్జ్ లు కూడా సర్ది క్లీన్ చేయండి నా చెలికత్తె లకు చెప్పాను. పూర్వం లాగా నడుం కట్టుకుని చేసే ఓపిక లేదు, ఏదో చదువుతూ లేక పొతే ఫేస్

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page