హాస్య వల్లరి
వారానికో, పది రోజుల కొక్కసారి ఆలా నా పుస్తకాలు వున్న ఆల్మరా తెరిచి చూసుకుంటూ వుంటాను. పోయిన వారం ఏదయినా లైట్ గా చదువుదాం అనీ వెతుకుతూ ఉంటే హాస్య లహరి అనీ యువ భారతి వాళ్ళ పుస్తకం కనిపించింది.
ఈ పుస్తకం నేను కొన్నట్లు లేదు. మావారి ఆఫీస్ కి వచ్చే వాళ్ళు చాలా మంది ఏన్నో రకాల పుస్తకాలు ఆయనికి గిఫ్ట్ గా ఇచ్చి చదివి అభిప్రాయం చెప్పండి అనీ అడిగితే , ఆ పుస్తకాలు యింటికి తెచ్చి చదివి అభిప్రాయం చెప్పు అంటూ నా కు
ఇచ్చే వారు.
ఏ విషయం అయినా అన రంగళంగా మాట్లాడుతూ ఉంటే బాగా పుస్తకాలు చదువు తారు అనే అభిప్రాయం వస్తుంది కదా అలా నా లైబ్రరీ లో బోలెడు గిఫ్ట్
గా వాళ్ళు వచ్చిన పుస్తకాలు చేరుతూ వుంటాయి.
ఇంత కి ఆ పుస్తకం తీసి వారం అయినా నిన్న నే చదవటం మొదలు పెట్టి ,
భావుక స్నేహితులతో పంచుకోవాలి ఆనుకున్నాను.
ఆ పుస్తకం లో ప్రాచీన సాహిత్యం నుండీ ఆధునిక సాహిత్యం వరకు రచన ల్లోని
హాస్యము గురించీ రాశారు. న న్న య్య గారితో మొదలు అయ్యి ముళ్లపూడి గారి తో ముగించారు
కందుకూరి వీరేశ లింగం గారు, చిలక మర్తి వారు, పాను గంటి నర్సింహం గారు ఇలా
చూస్తూ గురజాడ వారి దగ్గర ఆగి రాత్రి కొన్ని పేజీలు చదివాను. కన్యా శుల్కమ్
అభిమాన పుస్తకం కదా.
అనుకోకుండా ఈ రోజు ఉదయం ఫేస్ బుక్ లో కూడా ఈ రోజు గురజాడ గారి
జయంతి అనీ చూసి ఓహో ఆనుకున్నాను.
గ్రాంధిక భాష సరిగ్గా అర్ధం కూడా కానీ రోజుల్లో ఈ కన్యా శుల్కమ్ పుస్తకం చదివాను.
ఆ తర్వాత ఏన్నో సార్లు చదవటం, రవీంద్ర భారతి లో డ్రామా గా రెండు మూడు సార్లు చూసాను.
ఇంక ఈ టీ వి లో చాలా సార్లు సినిమాగా చూసాము
ఇంతకీ ఈ పుస్తకం లో శ్రీ శంకర నారాయణ అనే వారు రాశారు. ఆయన మాటల్లోనే
గురజాడ గారిది విశ్వ శ్రే య హాస్యం అన్నారు. ఇంకా హాస్య వేదం కూడా
కన్యా శుల్కమ్ లో మొత్తం 38 పాత్రలు వున్నాయి ఏ పాత్ర వివరం అడిగినా ఎంతయినా హాస్యం వె ల్లి విరుస్తుంది.
అయితే హాస్యం హాస్యం కోసమే కాకుండా హాస్యాన్ని సంఘ సం స్కరణ
ప్రయాణ పతా క గా గురజాడ గారు శిఖర ప్రముఖులు అయ్యారు.
కన్యా శుల్కమ్ లో అన్నీ పాత్రల ద్వారా హాస్యాన్ని పంచి పెట్టీ హాస్యమును ప్రేమించు మమ్మా మంచి అన్నది పెంచుమన్నా అన్నట్లు కనుల ముందు నిలిచారు.
ఒక్కొక్క పాత్ర గురించీ కూడా చక్కగా విశ్లేషణ రాశారు.
ఇంకా ఈ పుస్తకం లో మొక్కపాటి , భమిడి పాటి ముని మాణిక్యం భానుమతి
ఇంకా ముళ్ల పూడి గార్ల హాస్య చతురత గురించీ వ్యాసాలు వున్నాయి.
అవీ చదివాక మీతో ఆ కబుర్లు పంచుకుంటాను.
వంద ఏళ్లు గడిచినా కన్యా శుల్కమ్ లోని కొన్ని వాడుక లో వున్న మాటలు
అటునుంచి నరుక్కు రావటం, డా మి ట్ కథ అడ్డం తిరి గింది,
పొగ తాగని వాడు దున్నపోతె యి పుట్టున్
తాంబూలాలు ఇచ్చేసాను తన్నుకు చావండి
ఇంకా చాలా వున్నాయి కానీ నాకు గుర్తు వున్నవి రాశాను.
గుర జాడ గారి జయంతి రోజున వారిని తల్చుకోవటం చంద్రునికీ ఒక నూలు పోగు లాంటిది .
ఎందరో మహానుభావులు ఆందరికీ వందనములు
Comments