, మనం ఏమయినా రాజులమా, బ్రేక్ ఫాస్ట్ కి, లంచ్ కి వేరే వేరే రూమ్‌లు వుండటానికి అనుకుంటారు కదూ.ఇలా రాస్తూ వుంటే ఎన్ని జ్ఞాపాక లో వద్దు వద్దు అన్నా అలా ముసురు కుంటూ వస్తాయి. మా ఇంట్లో చద్దన్నాల గది అని ఒక రూమ్ వుండేది. వుదయం పూట కాఫీ లు. టిఫిన్లు పిల్లలకు చద్దన్నం ఆ రూము లోనే పెట్టే వారు. పాపం చద్దన్నం అని పేరే కానీ రోజూ వేడి అన్నంలో గోంగూర పచ్చడి, కంది పచ్చడి అలాంటివి వేసి పెట్టే వాళ్ళు. ఇంక కాఫీ పిల్లలకు ఇచ్చే వారు కాదు కానీ కొంచెం కాఫీ కి అలవాటు పడ్డ పిల్లల కు పోన్లే పాపము అని మా అమ్మ మా నాన్న గారు చూడకుండా ఇస్తూ వుండేది. మేము స్కూల్ ఫైనల్ వచ్చిన దాక సస్టు గా చద్దన్నం అనబడే ఈ వేడి అన్నం తిని స్కూల్ కి వెళ్ళే వాళ్ళం. మా సే సన్ అయ్యాక ఇంటిలోని పెద్ద వాళ్ళ టిఫిన్ సెక్షన్ మొదలు అయ్యేది. మా నాన్న గారు చాలా ఆ రోజుల్లో నే రాగి దోశ తినే వాళ్ళు ఇప్పటి లాగా దోశ అనగానే దాన్లో నానా చెత్త వేసే దోశ కాదు. సింపుల్ గా రాగిపిండి లో కొంచెం బెల్లం కలిపి చిన్న అట్టు లాగా వేసిన దోశ ఒక రెండు మాత్రం తినే వారు. ఆయన కాఫీ కుడా తాగే వారు కాదు. పాలు తాగే వారు. ఇంక మా పెద్దనాన్న గారు, మిగతా బంధువులు, ఆరోజుల్లో బంధువులు లేని రోజు వుండేదికాదు ఇడ్లీ , చట్నీ తో టిఫిన్ చేసేవారు. ఈ రోజుల్లో లాగా కాఫీ లు ఇన్నిసార్లు తాగే వారు కాదు. ఈ గది కి వేరే పక్కగా వంట గది పూజ గది వుండేవి. అక్కడ వంట మనిషి వంట చేస్తూ మమ్మల్ని ఆ ఛాయలకు కూడా రానిచ్చేది కాదు. మధ్యాహ్నం లంచ్ పూజ గది పక్కన హాల్లో చేసే వారు. మేమూ స్కూల్ లంచ్ కి వచ్చే వాళ్లం. ఇంత వివరంగా ఎందుకు రాస్తున్నాను అంటే ఈ రోజుల్లో వంట చేసి అన్నీ టేబుల్ మీద పెట్టీ ఏదో చాలా ఆలసి పోయాము అనుకుంటాము. మా అమ్మ గారి గురించి ఇపుడు ఆలోచిస్తే , అమ్మ ఎంత ఓపికగా చేసేదీ అని ఆశ్చర్యం వేస్తుంది. మా అమ్మ ఎపుడూ విసుగు చెందినట్లుగా అనిపించేది కాదు. ఎపుడూ ఉత్సాహంగా వున్నట్లు అనిపించేది. ఆరోజుల్లో మిక్సీలు లేవు కదా, మా ఇంట్లో లార్జ్ స్కేల్ లో కావాలి కదా, రోజూ ఒక అమ్మాయి వచ్చి రుబ్బి పెట్టేది. ఆ అమ్మాయి కి సినిమా పిచ్చి రోజూ పిండి రుబ్బి సినిమా కి డబ్బు లు అడిగేది. మా అమ్మ ఆ అమ్మాయి నీ చివాట్లు పెట్టీ డబ్బులు ఇచ్చేవారు. మేమూ రోజూ ఆ అమ్మాయి పక్క న కూర్చుని సినిమా కధ చేప్పించు కొనే వాళ్ళం. ఒక్కొక్క రోజు మా నాన్న గారు కానీ పెదనాన్న గారు గానీ ఇంట్లో వుంటే సినిమా కబుర్లు వుండేవి కాదు. ఆరోజు ఇంక మాకు ఏదో కొల్పోయినట్లు వుండేది. ఇంక మా రాత్రి భోజనాలు పంచ లో పెట్టేవారు. ఎందుకంటే వుదయం భోజనం చేసిన హాలు పూజగది వంటిల్లు వంట మనిషి కడిగి, ముగ్గులు వేసి మర్నాడు ఉదయం వంట కు రెడీ చేసి పెట్టుకొని వెళ్ళేది. మనం ఇపుడు తినే పద్ధతులకు అప్పటి పద్ధతుల కు ఎంత తేడా నో చూడండి. మా అత్త గారు వున్నపుడు మాఇంట్లో కూడా భోజనాలు డైనింగ్ టేబుల్ మీద చేసినా రోజూ వంటిల్లు కడిగే వాళ్ళం. మా పెద్ద అమ్మాయి, మా బావ గారి అమ్మాయి కడిగే వాళ్ళు. మా అమ్మ గారు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చే టప్పటికి ఏదో ఒక స్నాక్ చేసి రెడీ గా వుంచేది. మేము కాలేజీ కి వచ్చాక వదిన కూడా వచ్చింది ఇంక ఆ గది మా మీటింగ్ ప్లేస్ అయింది కుంపటి వెలిగిస్తూ కాఫీలు కలుపుతూ, అమ్మ చేసిన ఎదో ఒక స్నాక్ నములుతూ వుండేవాళ్ళం. ఆ గది పక్కనే రెండు అరుగులు వుండేవి. మా అన్నయ్య లు ఇద్దరూ వేరే ఊర్లు లో చదువుకు వెళ్ళారు. వాళ్ళు సెలవలకు వచ్చినపుడు అమ్మ వాళ్ళ కోసం స్వీట్స్ కారప్పూస అలాంటివి చేస్తూ వుండేది. మేమూ అమ్మ కు సహాయం చేయకపోయినా ఆ అరుగులు మీద కూర్చుని ఎన్నో కబుర్లు తో కాలక్షేపము చేసే వాళ్ళం. ఇంక మా అక్కయ్య కుడా అన్నయ్య లు వచ్చారని వ స్తే , అమ్మ, నాన్న గారు అక్కయ్య నీ చాలా గారాబం గా చూసేవారు. ఆపుడు ఇల్లు అంతా ఒక పండగ లాగా వుండేది. ఇప్పటికీ తలచుకుంటే అన్నయ్యలు మేము ఆ అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ వున్నట్లు వుంటుంది. ఇంక మా అత్తయ్య గారింట్లో బ్రేక్ఫాస్ట్ రూమ్ నీ తడికల గది అనే వాళ్ళం బహుశ కప్పు తడికలేమో తెలియదు. వాళ్ళింట్లో వంట వాడు వేసిన రవ్వ దోశ లాంటివి, మసాల దోశ , పెసరట్టు నేను ఏ పేరు ప్రతిష్టలు వున్న హోటల్ లో కూడా తినలేదు. అంత బాగా చేసేవాడు. ఎపుడు ఏమి రాసినా మా అమ్మ, మా అత్తయ్య గారింటి గురించీ రాస్తాను. ఎందుకంటే మా రెండు ఇళ్ళు అలా ఒక దాని కొకటి పెనవేసు కొని వుండేవి. మా అమ్మ, అత్తయ్య వాళ్ళ వ్యక్తిత్వం గురించి ఇంకో సారి వ్రాస్తాను. that's అల్ అబౌట్ అవర్ బ్రేక్ఫాస్ట్ రూమ్.
బ్రేక్ ఫాస్ట్ రూమ్
murthydeviv
'చద్దెన్నాల ' గది తో చిన్నప్పటి మన జీవితాలు ఎల్లాముడిపెట్టుకు ఉంటాయో బాగా చెప్పారు . మా ఇంట్లో మా వంటిల్లే మా 'చద్దెన్నాల ' గది. పొద్దున్నే మా అమ్మ పెట్టే కాఫీ కోసం కుంపటి చుట్టూ కూచునే వాళ్ళం . మా నాన్నతో సహా .